పేదలకు భోజనము

55 1.      ”దప్పికగొనినవారెల్లరును

                              నీి చెంతకురండు.

                              ధనములేనివారును వచ్చి

                              ధాన్యముగొని ఆరగింపుడు.

                              రండు, ధనమీయకయే

                              ద్రాక్షారసమును, పాలను కొనుడు.

2.           ఆకలి తీర్పజాలని రొట్టెమీద

               మీ ధనమును వెచ్చింపనేల?

               మీకు తృప్తి కలిగింపని దానిపై

               మీ వేతనమును ఖర్చు చేయనేల?

               మీరు నా మాటవినుడు,

               మీకు మంచిభోజనము లభించును.

               మీరు శ్రేష్ఠమైన ఆహారమును భుజింతురు.

3.           నా మాటవిని నాచెంతకు రండు.

               నా పలుకులాలింపుడు,

               మీరు జీవమును బడయుదురు.

నిబంధనము

               నేను మీతో నిత్యనిబంధనము చేసికొందును.

               దావీదునకు వాగ్ధానము చేసిన

               దీవెనలను మీకిత్తును.

4.           నేను అతనిని జాతులకు నాయకునిగాను,

               అధికారినిగాను నియమించితిని.

               అతని ద్వారా వారికి

               నా శాశ్వతకృపను చూపుదును.

5.           మీకిదివరకు తెలియని జాతులను

               మీరు ఇపుడు పిలుతురు.

               మిమ్ము ఎరుగని ప్రజలు

               మీలో చేరుటకు పరుగెత్తుకొని వత్తురు.

               మీ ప్రభుడను, దేవుడను,

               యిస్రాయేలు పవిత్రదేవుడనగు

               నేను ఈ కార్యము చేయుదును.

               నేను మీకు కీర్తి అబ్బునట్లు చేయుదును.

ప్రభువు చేరువలోను,

దూరమునను ఉండువాడు

6.           ప్రభువు దొరుకునప్పుడే ఆయనను వెదకుడు.

               ఆయన చేరువలోనున్నప్పుడే

               ఆయనకు ప్రార్థన చేయుడు.

7.            దుర్మార్గులు తమ మార్గమును

               విడనాడుదురుగాక!

               తమ ఆలోచనను మార్చుకొందురుగాక!

               వారు ప్రభువువద్దకు మరలివచ్చినచో,

               ఆయన వారి మీద దయజూపును.

               మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును.

8.           ”నా ఆలోచనలు మీ ఆలోచనల వింవికావు.

               మీ మార్గములు నా మార్గముల వింవికావు”

               అని ప్రభువు పలుకుచున్నాడు.

9.           ”ఆకాశము భూమికెంత ఎత్తుగాఉండునో

               మీ మార్గములకంటే నా మార్గములు,

               మీ ఆలోచనలకంటే నా ఆలోచనలు

               అంత ఉన్నతముగా నుండును.”

ప్రభువు వాక్కు శక్తికలది

10.         వానయు, మంచును

               ఆకాశమునుండి దిగివచ్చి,

               ఎచికిని మరలిపోక, భూమినితడిపి,

               దానిమీద పైరును  మొలిపించి ,

               పంట పండించునో

11.           ఆ రీతిగనే నా నోినుండి వెలువడు

               వాక్కు కూడ ఉండును.

               అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగిరాక,

               నా సంకల్పమును నేరవేర్చును.

               నేను ఉద్దేశించిన కార్యమును సాధించును.

ఆదరణ గ్రంథాంతము

12.          మీరు సంతసముతో వెడలిపోదురు.

               సమాధానముతో తోడుకొనిపోబడుదురు.

               మిమ్ముజూచి కొండలు, మెట్టలు

               సంగీతనాదములు చేయును.

               పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

13.          ముండ్లపొదలకు బదులుగా దేవదారులెదుగును.

               దురదగొండిచెట్లు పెరుగుచోట,

               గొంజివృక్షములు పెరుగును.

               దీనివలన ప్రభువునకు కీర్తి కలుగును.

               అది ఎన్నడును చెరిపివేయబడని

               జ్ఞాపకసూచనగా నిలిచియుండును.”