అనుబంధము

యెరూషలేము పతనము

52 1. సిద్కియా ఇరువది యొకటవ యేట యూదాకు రాజై యెరూషలేమునుండి పదునొకండేండ్లు పరిపాలించెను. లిబ్నా నగరవాసియు, యిర్మీయా కుమార్తెయునైన హమూతాలు అతని తల్లి.

2. యెహోయాకీము రాజువలె సిద్కియాకూడ ప్రభువు ఒల్లని దుష్కార్యములు చేసెను.

3. ప్రభువు యెరూషలేము నగరవాసుల పైన, యూదా ప్రజలపైన మిక్కిలి కోపించి వారిని తన సమక్షమునుండి గిెం వేసెను.

సిద్కియా బబులోనియా ప్రభువైన నెబుకద్నెసరుపై తిరుగబడెను.

4. కనుక అతని యేలుబడి తొమ్మిదవ యేడు పదియవనెల పదియవనాడు నెబుకద్నెసరు సర్వసైన్యములతో వచ్చి యెరూషలేమును ముట్ట డించెను. బబులోనీయులు నగరము వెలుపల శిబి రము పన్నిరి. దానిచుట్టును ముట్టడి దిబ్బలు పోసిరి.

5. సిద్కియా యేలుబడి పదునొకొండవ యేివరకు ముట్టడి కొనసాగెను.

6. ఆ యేడు నాలుగవనెల తొమ్మిదవనాడు కరువు మిక్కుటముకాగా ప్రజలకు తిండి దొరక దయ్యెను.

7. శత్రువులు నగర ప్రాకారములను కూల్చివేసిరి. బబులోనీయులు నగరమును చుట్టు మ్టుియున్నను, సైనికులెల్లరును రాత్రిలో పలాయితు లైరి. వారు రాజోద్యానవనము ప్రక్కగా, రెండు ప్రాకారముల మధ్యనున్న ద్వారముగుండ తప్పించు కొని యోర్దాను లోయకు అభిముఖముగా అనగా అరాబావైపు పారిపోయిరి.

8. బబులోనియా సైనికులు సిద్కియారాజును వెన్నాడి యెరికోమైదానమున పట్టు కొనిరి. సిద్కియా సైనికులెల్లరు అతనిని విడచిపారి పోయిరి.

9. ఆ రాజును హమాతు మండలములోని రిబ్లా నగరమున విడిదిచేయుచున్న నెబుకద్నెసరు నొద్దకు కొనిపోయిరి. అతడు సిద్కియాకు శిక్ష విధించెను.

10. నెబుకద్నెసరు ఆజ్ఞపై రిబ్లా నగర మున సిద్కియా కన్నులయెదుటనే అతని కుమారులను వధించిరి. యూదా అధికారులను గూడ చంపివేసిరి.

11. అటుపిమ్మట సిద్కియా కన్నులను పెకలించిరి. అతనిని గొలుసులతో బంధించి, బబులోనియాకు కొనిపోయిరి. అతడు చనిపోవువరకును ఆ దేశమున బందీగానుండెను.

దేవాలయ ధ్వంసము, యూదావాసులను

బబులోనియాకు గొనిపోవుట

12. నెబుకద్నెసరు పరిపాలనా కాలము పందొమ్మిదవ యేట ఐదవనెల పదియవనాడు బబులోనియారాజు అంగరక్షకుల అధిపతియు, సలహా దారుడునగు నెబూజరదాను యెరూషలేమున ప్రవే శించెను.

13. అతడు దేవాలయమును, రాజ ప్రాసాద మును పట్టణములోని ప్రముఖుల యిండ్లను తగుల బ్టెించెను.

14. అతని సైనికులు పురప్రాకారమును పడగ్టొిరి.

15. నెబూజరదాను పట్టణమున మిగిలి యున్న జనమును, చేతిపనుల వారిని, బబులోనియా పక్షమును అవలంబించిన వారిని బబులోనియాకు కొనిపోయెను.

16. అతడు కొందరు పేదవారిని మాత్రము యూదాలోని పొలములను, ద్రాక్షతోటలను సాగుచేయుటకు అచటనే వదలివేసెను.

17. బబులోనీ యులు దేవాలయములోని కంచుస్తంభములను, బండ్లను, కంచుకుంటను ముక్కలు ముక్కలు చేసిరి. ఆ కంచునంతిని బబులోనియాకు కొనిపోయిరి.

18. మరియు వారు బలి పీఠముమీది బూడిదనెత్తు గరిటలను, పళ్ళెములను, దీపసామగ్రిని, జంతు బలులు అర్పించునపుడు నెత్తురుపట్టు పాత్రలను, సాంబ్రాణిపొగ వేయుటకు వాడు గిన్నెలను, ఇంకను దేవాలయమున వాడు రకరకముల కంచు పరికరము లను బబులోనియాకు కొనిపోయిరి.

19. వారు వెండి బంగారములతో చేసిన పరి కరములన్నిని తీసికొనిపోయిరి. చిన్నపాత్రములను, నిప్పుకణికలను కొనిపోవు పాత్రములను, బలులలో నెత్తురుపట్టు పాత్రములను, బూడిదనెత్తు పళ్ళెరము లను, దీపస్తంభములను, సాంబ్రాణి కలశములను, పానీయార్పణనకువాడు పాత్రములను తీసికొని పోయిరి.

20. సొలోమోనురాజు దేవాలయమునకు చేయించిన కంచువస్తువులు అనగా రెండు స్తంభ ములు, బండ్లు, పెద్దకుంట, దానినిమోయు పండ్రెండు ఎద్దులు తూకము వేయుటకు సాధ్యపడనివి.

21. ఆ రెండు స్తంభములు ఒకే రీతిగానుండెడివి. వాని ఎత్తు పదునెనిమిది మూరలు, చుట్టుకొలత పన్నెండు మూరలు. అవి లోపల బోలుగానుండి నాలుగు వేళ్ళ మందము కలిగియుండెను.

22. వానిమీద మరల ఐదుమూరల ఎత్తుకల దిమ్మెలుండెను. రెండు దిమ్మెల చుట్టు పై భాగమున అల్లినవల అల్లికను కంచు దానిమ్మ పండ్లతో అలంకరించిరి.

23. స్తంభముల మీది దిమ్మెలపై మొత్తము వంద దానిమ్మపండ్లుండెను. వానిలో తొంబదియారు క్రింది నుండి చూచువారికి కన్పించుచుండెను.

24. నెబూజరదాను ప్రధానయాజకుడైన సెరాయాను, ఉపయాజకుడైన సెఫాన్యాను, మరి ముగ్గురు దేవాలయోద్యోగులను చెరగొనిపోయెను.

25. పట్టణములోని సైన్యాధిపతిని, నగరముననున్న రాజు సలహాదారులను ఏడుగురిని, సైనికులను, యుద్ధమున చేర్చుకొను సేనాధిపతి కార్యదర్శిని, మరియు అరువదిమంది ప్రముఖులను చెరబట్టెను.

26-27. నెబూజరదాను వారినందరిని హమాతు మండలములోని రిబ్లా నగరమున విడిది చేయుచున్న బబులోనియా రాజు నొద్దకు కొనిపోయెను. ఆ రాజు వారిని క్టొించి చంపించెను. ఆ రీతిగా యూదీ యులు తమ దేశమునుండి ప్రవాసమునకు వెళ్ళి పోయిరి.

28. బబులోనియా రాజు బందీలుగా కొనిపోయినవారి సంఖ్యలివి. అతడు తన యేలుబడి ఏడవయేట 3,023 మందిని కొనిపోయెను.

29. పదునెనిమిదవయేట యెరూషలేము నుండి 832 మందిని కొనిపోయెను.

30. ఇరువది మూడవయేట నెబూజరదాను 745 మందిని కొనిపోయెను. కనుక మొత్తము బందీలు 4,600 మంది.

31. యెహోయాకీను ప్రవాసకాలము ముప్పది యేడవ యేట పండ్రెండవనెల యిరువదిఐదవ నాడు ఎవిల్మెరోదాకు బబులోనియాకు రాజయ్యెను. ఆ రాజు యెహోయాకీనును క్షమించి అతనిని చెరనుంచి విడి పించెను. 

32. అతడు యెహోయాకీను మీద కరుణ జూపెను. నాడు ఆ దేశమున ప్రవాసములోనున్న రాజు లందరికంటెను అతనిని పెద్దజేసెను.

33.యెహోయాకీను బందీగృహ వస్త్రములను తొలగించుకొని నాినుండి జీవితాంతము వరకును రాజగృహముననే భుజించెను.

34. యెహోయాకీను బ్రతికియున్నంతకాలము అతని రోజువారి ఖర్చులకొరకు బబులోనియా రాజు సొమ్ము చెల్లించెను.