విశ్వసృష్టి – మానవోత్పత్తి

సృష్టి-మొది కథనము

1. ఆదిలో దేవుడు ఆకాశమును, భూమిని  సృష్టించెను1.

2.భూమికి ఒక ఆకారము లేకుండ శూన్యముగా నుండెను. అంధకారము అగాధజలముల మీద వ్యాపించియుండెను. దేవునిఆత్మ నీిపై గుండ్రముగా తిరుగాడుచుండెను2.

3. అపుడు ”వెలుగు కలుగునుగాక!” అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగుపుట్టెను.

4. దేవుని కింకి అది బాగుగానుండెను. ఆయన చీకినుండి వెలుగును వేరుచేసెను.

5. వెలుగునకు ‘పగలు’ అనియు, చీకికి ‘రాత్రి’ అనియు పేర్లుపెట్టెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదియే మొదిరోజు.

6. ”నీి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని రెండు భాగములుగా విడదీయునుగాక!” అని దేవుడు ఆనతి ఇచ్చెను. ఆ ప్రకారముగనే జరిగెను.

7. పై నీినుండి క్రిందినీిని వేరుచేయు గుండ్రని   కప్పును  దేవుడు నిర్మించెను.

8.ఆయన ఆ గుండ్రని కప్పునకు ‘ఆకాశము’ అని పేరుపెట్టెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదియే రెండవరోజు.

9. ”ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రింద నున్న నీరంతయు ఒక చోట నిలుచునుగాక!” అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగనే జరిగెను.

10. ఆరిన నేలకు ‘భూమి’ అని పేరుపెట్టెను. నిలిచిన నీికి ‘సముద్రము’ అని పేరుపెట్టెను. దేవుని కింకి అది బాగుగానుండెను.

11. ”గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్నిరకముల వానిని భూమి మొలిపించునుగాక!” అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగనే జరిగెను.

12. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనము లున్న పండ్లనిచ్చు చెట్లను అన్నిరకముల వానిని మొలిపించెను. దేవుని కింకి అది బాగుగానుండెను.

13. అంతట సాయంకాలము గడచి ఉదయ మాయెను. ఇదియే మూడవరోజు.

14. ”రాత్రినుండి పగిని వేరుచేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు కలుగును గాక!

15. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించునుగాక!” అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను.

16. దేవుడు మహాజ్యోతులను రెండింని చేసెను. వానిలో పెద్దది పగిని పాలించును. చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్ర ములను కూడ చేసెను.

17-18. రేయింబవళ్ళను పాలించుటకు, చీకినుండి వెలుగును వేరుచేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కింకి అది బాగుగానుండెను.

19. అంతట సాయం కాలము గడచి ఉదయమాయెను. అదియే నాలుగవరోజు.

20. ”జలములు పలురకముల ప్రాణులను ప్టుించునుగాక! భూమిపైని ఆకాశమున పకక్షులు ఎగురునుగాక!” అని దేవుడు అనెను. ఆ ప్రకారముగనే జరిగెను.

21. దేవుడు సముద్రమునందలి మహా తిమింగిలములను, నీిలోపుట్టు ఆయా రకముల ప్రాణులను, మరియు పలురకముల పకక్షులను సృజించెను. దేవుని  కింకి  అది  బాగుగానుండెను.

22. వానినన్నిని దీవించి ”జలములయందలి ప్రాణులు వృద్ధిచెంది సముద్రములో నిండియుండును గాక! నేలమీద పకక్షులు లెక్కకు మిక్కుటమగునుగాక!” అని ఆనతిచ్చెను.

23. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదియే అయిదవరోజు.

24. ”భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్నిరకముల వానిని ప్టుించునుగాక!” అని దేవుడు అనెను. ఆ ప్రకారముగనే జరిగెను.

25. దేవుడు పెంపుడు జంతువులను, క్రూరమృగములను, ప్రాకెడు జంతువు లను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కింకి అది బాగుగా నుండెను.

26. దేవుడు ”ఇక ఇప్పుడు మానవజాతిని1 కలిగింతము. మానవుడు మమ్ముపోలి, మావలె ఉండును. అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశము నందలి పకక్షులపై, నేలమీది పెంపుడు ప్రాణులపై, క్రూరమృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగియుండును” అని అనెను.

27. దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను.

28. దేవుడు వారిని దీవించెను. ”ఫలించి సంతానాభివృద్ధి చెందుడు. భూమండలమునందంతట విస్తరించి, దానిని వశము చేసికొనుడు. నీళ్ళలోని చేపలను, ఆకాశములోని పకక్షులను, నేలమీది జంతువులను పాలింపుడు.

29. గింజలనిచ్చు మొక్కలన్నియు, విత్తనములున్న పండ్ల నిచ్చు చెట్లన్నింని మీకు ఆహారముగ ఇచ్చితిని.

30. కాని నేలమీది క్రూరమృగములకు, ఆకాశమునందలి పకక్షులకు,  నేలమీద ప్రాకెడు జంతువులకు, శ్వాసించు జీవులన్నికిని పచ్చనిమొక్కలు ఆహారమగును” అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను.

31. దేవుడు తాను చేసిన సృష్టినంతయు చూచెను. ఆయన కింకి అది చాల బాగుగానుండెను. అదియే ఆరవరోజు.

Previous                                                                                                                                                                                              Next                                                             

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము