9 1. నేను ఈ సంగతులన్నిని గూర్చి ఆలోచించి చూచినపిదప ఈ విషయము గ్రహించితిని. నీతి మంతులు, వివేకవంతులు చేయుపనులు, వారుచూపు ద్వేషము లును, ప్రేమలునుగూడ దేవుని అధీనమున ఉన్నవి. భవిష్యత్తులో తనకేమి జరుగనున్నదో ఎవరికిని తెలియదు.

2. ధర్మవర్తనులకును, అధర్మవర్తనులకును, పవిత్రుల కును, అపవిత్రులకును, బలులర్పించు వారికిని, అర్పింపనివారికిని, సత్పురుషులకును, పాపులకును, వ్రతము పట్టువారికిని, పట్టనివారికిని కడన ఒకేగతి పట్టుచున్నది.

3. ఈ భూమిమీద జరుగు కార్యములన్నిలో ఒక చెడుగుణము కన్పించు చున్నది. అది ఎల్లరికిని కడన ఒకేగతి పట్టుట అనునది. నరులు జీవించినంతకాలమును దుష్టులుగాను, బుద్ధి హీనులుగాను ప్రవర్తించి, ఆ మీదట చనిపోవుచున్నారు.

4. కాని ఇంకను చావకబ్రతికియున్న కుక్క మెరుగు కదా! చచ్చిన సింహముకంటె బ్రతికి ఉన్న కుక్క మెరుగుకదా?

5. బ్రతికి ఉన్నవారికి తాము చత్తుమని తెలియును, చచ్చినవారు ఏమియు ఎరుగరు. వారికిక ఏ బహుమతియు లేదు. ఎల్లరును వారిని విస్మరింతురు.

6. వారి ప్రేమలు, ద్వేషములు, అసూయలు వారితోనే గతించును. ఈ లోకమున జరుగు కార్యములలో వేనిలోను, వారికి ఎప్పికిని వంతులేదు.

7.            ఇక వెళ్ళి నీ భోజనము భుజించి సంతసింపుము.

               నీ ద్రాక్షసవము సేవించి ఆనందింపుము.

               దేవుడు ఈ కార్యమునకు సమ్మతించును.

8.           ఎప్పుడును శ్వేతవస్త్రములు ధరింపుము.

               నీ శిరస్సును తైలముతో అభిషేకించుకొనుము.

9. ఈ లోకమున దేవుడు నీకు దయచేసిన నిరర్ధక మైన రోజులన్నిటను నీవు ప్రేమించిన భార్యతో కలిసి సుఖింపుము. ఈ లోకమున నివసించుచూ శ్రమపడి పనిచేసినందులకుగాను నీకు కలుగు ప్రతిఫలమిదియే.

10. నీవు చేయదలచుకొన్న పనిని కష్టపడి బాగుగా చేయుము. నీవు పోనున్న పాతాళలోకమున పనిచేయు టకుగాని, ఆలోచించుటకుగాని, విద్య, విజ్ఞానమును గడించుటకుగాని వీలుపడదు.

అదృష్టము

11. ఇంకను నేను ఆలోచింపగ, సూర్యుని క్రింద జరుగుచున్న ఈ సంగతి కూడ గమనించితిని. వేగ ముగా పరుగెత్తువారికి పందెములలో గెలుపును, శౌర్యవంతులకు యుద్ధములలో విజయమును సిద్ధించుట లేదు. విజ్ఞానులకు  తిండిలేదు, మేథోవంతులకు డబ్బు లేదు, విద్యావంతులకు మన్ననలేదు. అన్నియు అదృష్ట ములను బ్టి కాలవశమున జరిగిపోవుచున్నవి.

12. నరునికి తన కాలమెప్పుడు వచ్చునో తెలియదు. చేపలు పాడు వలలో చిక్కుకొనినట్లు, పకక్షులు ఉచ్చులలో తగులుకొనినట్లు, నరుడు తలవని తలంపుగా వచ్చు విపత్కాలమున చిక్కుచున్నాడు.

13. విజ్ఞానమును గూర్చి ఇంకొక ముఖ్యమైన అంశమును గూడ నేను ఈ లోకమున గమనించితిని.

14. కొద్దిమంది పౌరులు మాత్రమే వసించు చిన్న నగరమొకి కలదు. ఒక గొప్పరాజు ఆ నగరము మీదికి  దాడిచేసి దానిని ముట్టడించెను. దానిచుట్టు గోడలనుకూల్చు మంచెలు క్టించెను.

15. ఆ నగర మున దరిద్రుడైన విజ్ఞాని ఒకడు కలడు. అతడు తన విజ్ఞానముతో ఆ పట్టణమును కాపాడెను. కాని అతడినెవరును తలంపనైనను లేదు.

16. బలము కంటె జ్ఞానమే గొప్పదని నేనెంచితిని. కాని దరిద్రుని జ్ఞానమునెవరును లెక్కచేయరు. అతని పలుకుల నెవరును ఆలింపరు.

17. బుద్ధిహీనుల సభలో పెద్దగా అరచు రాజు కేకలనాలించుటకంటె, మెల్లగా మ్లాడు విజ్ఞాని పలుకులు వినుట మేలు.

18. ఆయుధముల కంటె విజ్ఞానము మెరుగు. కాని ఒక తప్పిదము వలన మంచిపనులు చాల చెడిపోవును.

Previous                                                                                                                                                                                                Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము