విజ్ఞాన స్తోత్రము
24 1. విజ్ఞానము తన కీర్తిని తాను
ఉగ్గడించుకొనుచున్నది.
తన ప్రజలైన యిస్రాయేలీయుల మధ్య
తనను తాను స్తుతించుకొనుచున్నది.
2. మహోన్నతుడైన ప్రభువు సమాజము ఎదుట
దేవదూతల సమక్షమున
ఆమె తన కీర్తినిట్లు వెల్లడించుకొనుచున్నది:
3. నేను మహోన్నతుడైన ప్రభువు పలికిన వాక్కును. పొగమంచువలె నేను భూమిని కప్పితిని.
4. అత్యున్నతమైన ఆకాశము నా నివాసస్థలము,
నా సింహాసనము మేఘస్తంభముమీద ఉండెడిది
5. ఏ తోడును లేక నేనొక్కర్తెనే
ఆకాశపు అంచుల చుట్టు తిరిగితిని.
సాగరగర్భమున సంచరించితిని.
6. సాగర తరంగములమీదను, సర్వభూమిమీదను,
సమస్తజాతులమీదను
నా ఆధిపత్యమును నెరపితిని.
7. నా నివాసమునకు అనువైన స్థలము కొరకు
ఎల్లయెడల గాలించితిని.
నేను ఏ ప్రదేశమున వసింతునా అని
పరిశీలించి చూచితిని.
8. అపుడు సర్వమును కలిగించిన దేవుడు
నాకు ఆజ్ఞ యిచ్చెను.
‘సృష్టికర్త నేనెచట వసింపవలెనో నిర్ణయించెను.
అతడు నీవు యాకోబు వంశజుల నడుమ వసింపుము
యిస్రాయేలీయులు నీ ప్రజలగుదురు’
అని సెలవిచ్చెను.
9. కాలము కలుగకమునుపే ఆదిలోనే
అతడు నన్ను చేసెను.
నేను కలకాలము మనుదును.
10. పవిత్రమైన గుడారమున నేను
ప్రభువును సేవించితిని.
అటు తరువాత సియోను కొండమీద వసించితిని
11. ప్రభువు తనకు ప్రీతికరమైన నగరమున
నాకు నివాస మేర్పరచెను.
యెరూషలేము మీద
నాకు ఆధిపత్యము నొసగెను.
12. ఆయన తన సొంత ప్రజగా ఎన్నుకొని
ఆదరాభిమానములతో చూచుకొను
జనులనడుమ నేను స్థిరపడితిని.
13. నేను లెబానోనునందలి దేవదారు తరువులవలెను
హెర్మోను పర్వతముమీది
వృక్షరాజములవలెను ఎదిగితిని.
14. ఎంగెడిలోని ఖర్జూర వృక్షములవలెను,
యెరికోలోని గులాబి పొదలవలెను వర్ధిల్లితిని.
పొలములోని అందమైన ఓలివు చెట్లవలెను,
నీియొడ్డున ఎదుగు అక్షోట వృక్షమువలెను
పెంపొందితిని.
15. నా శ్వాస లవంగమువలెను,
సుగంధతైలమువలెను, గోపరసమువలెను,
గోపీచందనమువలెను, జామాంసి వలెను,
దేవుని గుడారమున వాడు సాంబ్రాణిపొగ వలెను
సువాసనలొలికెను.
16. నేను సింధూరమువలె సుదీర్ఘములును,
సుందరములైన శాఖలును తొడిగితిని.
17. ద్రాక్షలతవలె సొగసైనరెమ్మలు చాచి పూలు పూచి
శోభాయమానముగను, సమృద్ధిగను ఫలించితిని.
18. నిర్మలమైన ప్రేమకు, దైవభీతికి, విజ్ఞానముకు,
నిరీక్షణకు నేను జననిని.
నేను శాశ్వతముగా జీవించుదానను.
గనుక దేవుడు తానెన్నుకొనిన ప్రజలందరికి
నన్ను దయచేసెను.
19. నన్ను అభిలషించు వారందరు
నా చెంతకు రండు.
మీ ఆకలిదీర నా ఫలములు భుజింపుడు.
20. మీరు నన్ను స్మరించుకోగా,
నేను మీకు తేనెకంటె తీయగానుందును.
మీరు నన్ను సంపాదించుకోగా
నేను మీకు తేనెపట్టు కంటె తీయగానుందును.
21. నన్ను భుజించువారు,
మరి అధికముగా భుజింపగోరెదరు.
నన్ను పానము చేసినవారు,
మరి అధికముగా పానము చేయగోరెదరు.
22. నాకు విధేయులైనవారు
అవమానమునకు గురికారు.
నేను చెప్పినట్లు చేయువారు
పాపము కట్టుకొనరు”.
విజ్ఞానము, ధర్మశాస్త్రము
23. ఈ విజ్ఞానము, మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము,
మహోన్నతుడైన ప్రభువు నిబంధన గ్రంథము,
యిస్రాయేలు సమాజములకు
వారసత్వముగా లభించిన ఆస్తి.
24. ఎల్లవేళల మీరు ప్రభువునుండి
బలమును పొందుడు.
ఆయనను ఆశ్రయించి ఆయన నుండి
శక్తిని పొందుడు.
సర్వశక్తుడైన ప్రభువు తప్ప, మరొక దేవుడు కాని,
రక్షకుడు కాని లేడు.
25-26. నీితో నిండిన పీషోను నదివలెను,
పంటకారు నందలి ిగ్రిసు నదివలెను
ధర్మశాస్త్రము విజ్ఞానముతో నిండియుండును.
జలముతో నిండిన యూఫ్రీసు నదివలెను
పంటకారునందలి యోర్దాను నదివలెను
ధర్మశాస్త్రము వివేకముతో నిండియుండును.
27. నీరముతో నిండిన నైలునదివలెను,
ద్రాక్షపండ్లు కోయుకాలము నందలి
గీహోను నదివలెను
ధర్మశాస్త్రము ఉపదేశముతో నిండియుండును.
28. తొలి నరునికి విజ్ఞానముగూర్చి
పూర్తిగా తెలియదు.
కడపి నరుడును దానిని
సంపూర్ణముగా గ్రహింపజాలడు.
29. విజ్ఞాన భావములు
సముద్రము కంటెను విశాలమైనవి.
దాని ఆలోచనలు అగాధజలములకంటెను లోతైనవి
30. నామట్టుకు నేను నదినుండి తోటలోనికి
నీినికొనివచ్చు చిన్నకాల్వవింవాడనని
అనుకొింని.
31. నేను నా తోటకు, నా పూలమడులకు
నీరు పెట్టుదును అని అనుకొింని.
కాని ఆ కాలువ అనతికాలములోనే నదియైనది,
ఆ నదియు సముద్రమైనది.
32. నేనిపుడు ఉదయభానునివలె
ఉపదేశకిరణములు విరజిమ్ముదును.
ఆ ఉపదేశపు కాంతి చాలదూరము వరకు
ప్రసరించునట్లు చేయుదును.
33. ప్రవక్తవలె నా బోధను వెలువరించెదను.
అది భావితరముల వారికి ఉపయోగపడును.
34. కేవలము నా కొరకు మాత్రమేగాక
విజ్ఞానమును అన్వేషించు వారందరి కొరకు
నేనీ కృషి చేసితిని.