నారబట్టను గూర్చిన సంకేతము

13 1. ప్రభువు నాతో ”నీవు వెళ్ళి నారబట్టను కొని నీ నడుమునకు కట్టుకొనుము. కాని దానిని నీిలో తడుపవలదు” అని చెప్పెను.

2. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేను నారబట్టను కొని నా నడుమునకు కట్టుకొింని.

3. ప్రభువు మరల రెండవసారి నాతో మ్లాడెను.

4. ఆయన ”నీవు కొనితెచ్చుకొని నడు మునకు కట్టుకొనియున్న నారవస్త్రమును యూఫ్రీసు నదికి తీసికొని వెళ్ళి, అచట ఒక రాతి నెఱ్ఱలో దాచి పెట్టుము” అని చెప్పెను.

5. నేను ప్రభువు చెప్పినట్లే యూఫ్రీసు నదికి వెళ్ళి ఆ వస్త్రమును దాచితిని.

6. చాలా రోజులైన పిమ్మట ప్రభువు నాతో ”నీవు యూఫ్రీసు నదికివెళ్ళి అచట దాచియుంచిన వస్త్రమును తెమ్ము” అని చెప్పెను.

7. కనుక నేను యూఫ్రీసునదికి వెళ్ళి ఆ తావును వెదకి నడికట్టును బయికి తీసితిని. కాని అది చివికిపోయి ఎందుకు పనికిరానిదై యుండెను.

8. అంతట ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:  9. ”నేను యూదా గర్వమును, యెరూషలేము పొగరును ఈ రీతినే అణచివేయు దును.

10. ఈ దుష్టులు నా మాట వినక తమ హృదయకాఠిన్యము ప్రకారము నడుచుచున్నారు. అన్యదైవములనుకొలిచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకు పనికిరాని ఈ నారబట్టవిం వారగు దురు. 11. నారబట్ట నరుని నడుమునకు అంి పెట్టుకొనియుండునట్లే, యిస్రాయేలీయులు, యూదా ప్రజలు నాకు అంిపెట్టుకొని యుండవలెనని కోరు కొింని. వారు నా ప్రజలై నా నామమునకు కీర్తి ప్రతిష్ఠలు తీసికొని రావలెనని అభిలషించితిని. కాని వారు నా మాటవినరైరి.

ద్రాక్షారసపు కూజాల సంకేతము

12. ప్రభువు నాతో ఇట్లు అనెను: నీవు ప్రజలతో ప్రతికూజాను ద్రాక్షారసముతో నింపవలెనని చెప్పుము. వారు ప్రతి కూజాను ద్రాక్షారసముతో నింపవలెనని మాకు తెలియునని జవాబిత్తురు.

13. అపుడు నీవు వారితో ఇట్లు చెప్పుము. ప్రభువు పలుకులివి. నేను ఈ దేశప్రజలనెల్ల అనగా దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తల నేమి, యెరూషలేము పౌరులందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.

14. అటుపిమ్మట ఈ ప్రజలు ఒకరినొకరు పడద్రోసికొనునట్లు చేయుదును. వృద్ధు లును, పిల్లలునుగూడ తూలి ఒకరిపైనొకరు పడి పోయెదరు. నేను దయ, జాలి, కరుణ లేకుండ వారిని సంహరింతును.

ప్రవక్త పొగరువలదని హెచ్చరించుట

15.          యిస్రాయేలు ప్రజలారా!

               ప్రభువు మ్లాడుచున్నాడు.

               పొగరును క్టిప్టిె సావధానముగా వినుడు.

16.          మీ ప్రభువైన దేవుడు చీకిని కొనిరాగా

               మీరు కొండలమీద జారిపడుదురు.

               కనుక ఆ దుర్గతి పట్టకమునుపే

               మీరు ఆయనను గౌరవింపుడు.

               మీరు వెలుగును ఆశింతురుగాని

               ఆయన దట్టమైన కారుచీకిని కొనివచ్చును.

17.          మీరు నా మాటవినరేని నేను మీ పొగరును

               గూర్చి రహస్యముగా విలపింతును.

               ప్రభువు ప్రజలు ప్రవాసమునకు గురియైరి

               కావున నేను గాఢముగా పరితపించి

               కన్నీరు కార్తును.

యెహోయాకీనును హెచ్చరించుట

18.          ప్రభువు నాతో ఇట్లు అనెను:

               నేను రాజును, రాజమాతను హెచ్చరింతును.

               ”మీరు సింహాసనముదిగి క్రింద కూర్చుండవలెను.

               వైభవోపేతములైన మీ కిరీటములు పడిపోయినవి.

19.          శత్రువులు యూదా

               దక్షిణ నగరములను ముట్టడించిరి.

               నేగేబు నగరములు మూయబడెను.

               ఇక వానియొద్దకు ఎవరునుపోయి తెరువజాలరు

               యూదా ప్రజలెల్లరిని

               ప్రవాసమునకు ఈడ్చుకొనిపోయిరి.

యెరూషలేమునకు హెచ్చరిక

20.        నీ కన్నులెత్తి చూడుము.

               ఉత్తరమునుండి నీ శత్రువులు వచ్చుచున్నారు.

               నీకు అప్పగించిన మంద,

               నీకు గర్వకారణమునైన ఆ ప్రజలేరీ?

21.          నీవు స్నేహితులుగా భావించినవారే

               నీమీదికెత్తివచ్చి నిన్ను జయించినచో

               నీవేమందువు?

               పురినొప్పులు వచ్చిన స్త్రీవలె తన్నుకలాడవా?

22.        నాకు ఈ దుర్గతి ఏల ప్టినదని

               నిన్ను నీవు ప్రశ్నించుకోవచ్చును.

               నీ పాపము మహాఘోరమైనది,

               కనుక శత్రువులు నిన్ను వివస్త్రనుచేసి

               మానభంగము చేసిరి.

23.        కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా?

               చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోగలిగినచో, దుష్టకార్యములకు

               అలవాటుపడిన మీరుకూడ

               మంచిని చేయగలుగుదురు.

24.         ఎడారి గాలికి పొట్టు ఎగురునట్లు 

               నేను మిమ్ము ఎగురగొట్టుదును.  

25.        మీరు నన్ను విస్మరించి అబద్ధమును నమ్ముకుింరి

               కనుక ఈ శిక్షకును, ఈ దుర్గతికిని గురియైతిరి.

               నేనే మీకీగతి ప్టించితిని

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

26.        నీ బట్టలను తొలగించి, నీ దిగంబరత్వము

               ఎల్లరికి కన్పించునట్లు చేసినది నేనే.

27.         నేనొల్లని కార్యములను నీవు చేయుట చూచితిని.

               కొండల మీదను, పొలములలోను

               విగ్రహములను కొలుచుచు, కామాతురతతో

               వ్యభిచారమునకు పాల్పడుటకింని.

               యెరూషలేమూ! నీకు అనర్థముతప్పదు.

               నీవు అపవిత్రురాలవు.

               ఇంకను ఎంతకాలము ఇట్లే ఉండిపోయెదవు?”