యిస్రాయేలీయులకు దండన

ప్రభువు అభియోగము

6 1. ప్రభువు యిస్రాయేలీయులను గూర్చి చెప్పునది వినుడు.

               పర్వతముల సాక్షిగా

               నీవు లేచి నీ అభియోగము వినిపింపుము.

               కొండలు, తిప్పలు నీ పలుకులు ఆలించునుగాక!

2.           భూమికి శాశ్వతపునాదులగు పర్వతములారా!

               మీరు ప్రభువు అభియోగమును వినుడు

               ప్రభువు తన ప్రజలపై నేరము తెచ్చెను

               వారిమీద ఫిర్యాదు చేసెను.

3. ప్రభువు ఇట్లనుచున్నాడు:

               నా ప్రజలారా! నేను మీకేమి కీడు చేసితిని?

               నేను మిమ్మెట్లు విసిగించితినో చెప్పుడు

4. నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చితిని. బానిసత్వమునుండి మిమ్ము విడిపించితిని.

               మిమ్ము నడిపించుటకు

               మోషే, అహరోను, మిర్యాములను పంపితిని.

5.           నా ప్రజలారా!

               మోవాబు రాజైన బాలాకు

               మీకేమి కీడు చేయగోరెనో,

               షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును

               సంభవించినదానిని బేయేరు పుత్రుడైన

               బలాము అతనికి ఏమి చెప్పెనో

               జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు మిమ్ము రక్షించుటకు నేనేమి చేసితినో మీరు గ్రహింతురు.

ప్రభువు కోరునదేమి?

6.           మహోన్నతుడైన దేవుని పూజించుటకు

               వచ్చినపుడు నేనేమి తీసికొని రావలెను?

               ఏడాది దూడలను దహనబలిగా   కొనిరావలెనా?

7.            వేల కొలది పొట్టేళ్లను,

               పదివేల నదుల ఓలివు తైలమును

               కొనివచ్చినచో అతడు సంతుష్టి చెందునా?

               నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా

               నా జ్యేష్ఠకుమారుని బలిగా అర్పింపవలెనా?

8.           ఓయి! మేలైనదేదో ప్రభువు

               నీకు తెలియజేసియే ఉన్నాడు.

               నీవు న్యాయమును పాింపుము,

               కనికరముతో మెలగుము.

               నీ దేవునిపట్ల వినయముతో ప్రవర్తింపుము. ఇదియేగదా! ప్రభువు నీ నుండి కోరుకొనునది.

నగరములోని మోసగాండ్రు

9.           ప్రభువునకు భయపడుటయే జ్ఞానము.

               అతడు పట్టణముతో ఇట్లు చెప్పుచున్నాడు:

               నగరమున ప్రోగైన జనులారా1 ! వినుడు!     

10.         దుష్టులు అన్యాయముగా సొమ్మునార్జించి

               తమ ఇండ్లలో భద్రపరుచుకొనిరి.

               వారి దొంగకొలతలను నేను ఏవగించుకొందును.      

11.           తప్పుడు త్రాసులను తూకపురాళ్ళనువాడెడి వారిని

               నేను దోషులనుగా గణింపకుందునా?

12.          మీలోని ధనవంతులు

               పేదలను పీడించుచున్నారు.

               మీరెల్లరును బొంకులాడువారు,

               మీ నాలుక కపటములాడును.

13.          మీరు చేసిన పాపములకుగాను

               నేను ఇదివరకే మీకు వినాశనము తలప్టిెతిని.

14.          కావున మీరు భుజింతురుగాని, మీ ఆకలి తీరదు.

               వస్తువులు కొనిపోవుదురుగాని,

               వానిని పదిలపరచుకోలేరు.

               మీరు కూడబెట్టుకొనునదెల్ల

               నేను పోరున నాశనము చేయుదును.

15.          మీరు పైరు వేయుదురుగాని

               కోత కోయజాలరు.

               ఓలివుపండ్లనుండి నూనె తీయుదురుగాని,

               దానిని వాడుకోజాలరు.

               ద్రాక్షపండ్లనుండి రసము తీయుదురుగాని

               దానిని త్రాగజాలరు.

16.          మీరు దుష్టరాజులైన ఒమ్రీ అహాబుల

               ఇంివారల పోకడలు పోవుచు,

               వారి పద్ధతులను అనుసరించుచున్నారు.

               కావున నేను మిమ్ము నాశనము చేయుదును.

               ఎల్లరును మిమ్ముచూచి నవ్వుదురు.

               సమస్తజనులు మిమ్ము చిన్నచూపుచూచెదరు.

Previous                                                                                                                                                                                                  Next