సిద్కియా యిర్మీయాను సంప్రతించుట

371. యెహోయాకీము కుమారుడైన కొన్యా1 స్థాన మున యోషీయా కుమారుడైన సిద్కియాను యూదాకు రాజుగా నెబుకద్నెసరు రాజు నియమించెను.

2. సిద్కియాకాని, అతని అధికారులుకాని, ప్రజలుకాని ప్రభువు నాచే చెప్పించిన సందేశమును లెక్కచేయరైరి.

3. సిద్కియారాజు షెలెమ్యా కుమారుడగు యెహూకలును, యాజకుడైన మాసేయా కుమారుడగు జెఫన్యాను నా చెంతకు పంపి ”నీవు మా తరపున మన దేవుడైన ప్రభువునకు మనవిచేయుము” అని చెప్పించెను.

4. అప్పికి నన్నింకను చెరలోపెట్టలేదు. కనుక నేను ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరుగుచుింని.

5. బబులోనియా సైనికులు యెరూషలేమును ముట్టడించుచుండిరి. కాని ఐగుప్తు నుండి ఫరో దండు కదలి వచ్చుచున్నదని విని వారు ముట్టడిని ఆపివేసిరి.

6. అంతట ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను: 7. ”యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: నన్ను సంప్రతింపుమని అడిగిన యూదారాజుతో నీవు ఇట్లు చెప్పుము: ‘నీకు సహా యము చేయుటకు వచ్చుచున్న ఐగుప్తు సైన్యములు తమ దేశమునకు తిరిగిపోవును.

8. బబులోనీయులు తిరిగి వచ్చి ఈ పట్టణమును ముట్టడింతురు. దీనిని స్వాధీనము చేసికొని కాల్చివేయుదురు. 9. ప్రభుడనైన నేను చెప్పున దేమనగా: ”బబులోనీయులు మరలి వెళ్ళిపోవుదురనుకొని మిమ్ము మీరు వంచించుకొన కుడు. వారు వెళ్ళరు.

10. మీరిపుడు మీతో పోరాడు చున్న బబులోనియా సైన్యమునంతిని ఒకవేళ చంపి వేసినను, వారిలో గాయపడినవారు తమ గుడారము లలో నుండి పైకిలేచి వచ్చి ఈ నగరమును కాల్చి వేయగలరు.’ ”

యిర్మీయాను బంధించి చెరలో పెట్టుట

11. ఫరోదండు వచ్చుచున్నది కనుక బబులోనియా సైన్యము యెరూషలేము ముట్టడిని ఆపివేసెను.

12. నేను యెరూషలేమును విడిచి బెన్యామీను మండల మునకు పోవుటకు ప్రయాణము క్టితిని. అచట నా వంతు కుటుంబపు ఆస్తిని స్వాధీనము చేసికోనెంచితిని.

13. కాని నేను బెన్యామీను ద్వారమువద్దకు పోగానే అచట గస్తీకాయువారికి అధిపతియైన యిరీయ్యా అను అతడు నన్ను అడ్డగించెను. అతడు షెలెమ్యా కుమా రుడు, హనన్యా మనుమడు. అతడు నాతో ”నీవు బబులోనీయుల పక్షమున చేరబోవుచున్నావుగదా!” అనెను.

14. నేను ”అది నిజము కాదు. నేను బబులోనీయులలో చేరుటలేదు” అని అంిని. కాని యిరీయ్యా నా మాటలువినక, నన్ను బంధించి అధికా రుల యొద్దకు కొనిపోయెను.

15. ఆ అధికారులు నాపై మండిపడి నన్ను క్టొి ఆస్థానకార్యదర్శియైన యోనాతాను ఇంిలో చెరలో ప్టిెరి. అతని గృహము చెరగా మార్చబడినది.

16. నన్ను భూగర్భములోని చెరలోనుంచిరి. నేనచట చాలకాలము ఉంిని.

17. అటుతరువాత సిద్కియారాజు నన్ను పిలి పించి ”ప్రభువునుండి సందేశమేమైన కలదా?” యని తన ప్రాసాదమున రహస్యముగా ప్రశ్నించెను. నేను ”ఉన్నది,  నిన్ను బంధించి బబులోనియారాజునకు అప్పగింతురు” అని చెప్పితిని.

18. మరియు నేనతనితో ఇట్లింని: ”నేను నీకును, నీ ఉద్యోగులకును, నీ ప్రజలకును ఏమి అపరాధము చేసితినని మీరు నన్ను చెరలో ప్టిెంచితిరి?

19. ‘బబులోనియా రాజు నీ మీదికిగాని, ఈ దేశము మీదికిగానిరాడు’ అని చెప్పిన ఆ ప్రవక్తలు ఇపుడెచట ఉన్నారు?

20. ప్రభువుల వారు నా మనవిని ఆలకించి నా ప్రార్థనమును అంగీకరింతురుగాక! నన్ను మరల యోనాతాను ఇంి చెరలోనికి పంపవలదు. పంపుదురేని నేనచట చచ్చుట తథ్యము”.

21. సిద్కియారాజు నన్ను ప్రాసాదపు ఆవరణ లోని చెరలో ఉంచవలెనని ఆజ్ఞాపించెను. కనుక నేనచట వసించితిని. నగరములో రొట్టె దొరకునంత కాలము రొట్టెలను కాల్చువారి వీధిలోనుండి ప్రతిరోజు నాకొక రొట్టెను తెచ్చియిచ్చిరి.