వివేకము, విజ్ఞత

8 1.         పేరు ప్రసిద్ధులు కలవానితో పోీకి దిగవద్దు.

                              నీవతని ఆధిక్యమునకు

                              లొంగిపోవలసి వచ్చును.

2.           సంపన్నునితో కలహము తెచ్చుకోవద్దు.

               అతడు లంచముప్టిె నిన్నోడింపవచ్చును. 

               బంగారము చాలమందిని చెరచినది.

               రాజుల హృదయములను అపమార్గము

               ప్టించినది.

3.           వదరుబోతుతో వివాదమునకు దిగవద్దు.

               నీవు అతని అగ్నికి సమిధలు పేర్చినట్లగును.

4.           సభ్యతలేని వానితో సరసమునకు దిగవద్దు. అతడు నీ పూర్వులను దెప్పిపొడవవచ్చును.

5.           తన పాపములకు పశ్చాత్తాపపడిన వానిని

               నిందింపవద్దు.

               మనమందరము తప్పులు చేయువారమేకదా!

6.           వృద్ధుని చిన్నచూపు చూడవలదు.

               మనమందరము ముసలివారమగుదుముకదా!

7.            ఎటువింవాడు చనిపోయినను సంతోషపడవలదు

               మనమందరము మరణింపవలసినదేకదా!

వృద్ధుల ఉపదేశములు

8.           విజ్ఞుల బోధను అనాదరము చేయవద్దు.

               వారి సూక్తులను జాగ్రత్తగా పఠింపుము.

               వాని వలన నాగరికతను అలవరచుకొని

               ఉన్నతులకు సేవలుచేయు

               విధానము నేర్చుకొందువు.

9.           వృద్ధుల ఉపదేశములను

               అనాదరము చేయవలదు

               వారు తమ పూర్వులనుండి వానిని  నేర్చుకొనిరి.

               వారినుండి  నీవు విజ్ఞానమును గడింతువు.

               అవసరము కలిగినప్పుడు జవాబును

               ఎట్లు చెప్పవలెనో కూడ తెలిసికొందువు.

వివేకము

10.         దుష్టుని ఉద్రేకములను రెచ్చగొట్టవలదు.

               అప్పుడు అతడు  నీకును హాని చేయవచ్చును.

11.           వాదమాడుచు పొగరుబోతుతో నడువవలదు.

               అతడు నీ పలుకులకు అపార్థము కల్పించి

               వానిని నీ మీదనే త్రిప్పికొట్టును.

12.          నీ కంటె బలాఢ్యుడైన వానికి

               ఏ వస్తువు అరువీయకుము.

               ఇత్తువేని, అది పోయినదాని క్రిందనే లెక్క.

13.          నీ శక్తికి మించి అన్యునికి హామీగా నుండవలదు.

               ఉందువేని, ఆ సొమ్ము చెల్లించుటకు సిద్ధపడుము

14.          న్యాయాధిపతి మీద వ్యాజ్యెము తేవలదు.

               తెత్తువేని, పదవీ, బలమువలన  అతడే  నెగ్గును.

15.          అపాయమును లక్ష్యపెట్టని

               దుస్సాహసితో పయనింపకుము.

               అతడు నీకు తాంలుతెచ్చును.

               తన ఇష్టము వచ్చినట్లు వెఱ్ఱి పోకడలుపోయి,

               మూర్ఖచేష్టల వలన నిన్ను కూడ

               నాశనము చేయును.

16.          కోపిష్ఠితో వాదింపకుము.

               అతనితో ఒంటరిగా ప్రయాణము చేయకుము.

               ప్రాణములు తీయుట అతనికి చాలచులకన

               కనుక ఎవరి సహాయము

               లభింపనిచోట నిన్నుమట్టు పెట్టవచ్చును.

17.          మూర్ఖుని సలహా అడుగకుము.

               అతడు నీ రహస్యములను బట్టబయలు చేయును.

18.          అన్యుని ఎదుట ఏ రహస్యకార్యములను చేయరాదు

               అతడు ఆ రహస్యములను            

               దాచునో లేదో తెలియదు.

19.          ప్రతి వానికిని హృదయము విప్పరాదు.

               ప్రతివానినుండియు ఉపకారములు పొందరాదు.