విశ్వము దేవుని స్తుతించుట

148 1.    మీరు ప్రభువును స్తుతింపుడు.

                              మహోన్నతస్థానమున వసించువారలారా!

                              ఆకసమునుండి

                              మీరు ప్రభువును స్తుతింపుడు

2.           ప్రభువు దూతలారా!

               మీరందరు ఆయనను స్తుతింపుడు.

               ప్రభువు సైన్యములారా!

               మీరందరు ఆయనను స్తుతింపుడు.

3.           సూర్య చంద్రులారా! ఆయనను స్తుతింపుడు.

               ప్రకాశించు తారలారా!

               మీరందరు ఆయనను స్తుతింపుడు.

4.           మహోన్నతాకాశమా! ప్రభువును స్తుతింపుము.

               ఆకాశముపైనున్న జలములారా!

               ఆయనను స్తుతింపుము.

5.           అవియెల్ల ప్రభు నామమును స్తుతించునుగాక!

               ఆయన ఆజ్ఞ ఈయగా అవి పుట్టెను.

6.           ప్రభువు తిరుగులేని శాసనముతో

               ఆ వస్తువులనెల్ల వానివాని స్థలములలో

               శాశ్వతముగా పాదుకొల్పెను.

7.            భూమిమీద వసించువారలారా!

               మీరు ప్రభువును స్తుతింపుడు.

               మకరములారా! అగాధజలములారా!

               ఆయనను స్తుతింపుడు.

8.           మెరుపులారా, వడగండ్లలారా,

               హిమమా, పొగమంచులారా,

               ఆయన ఆజ్ఞకు లొంగు తుఫానూ

9.           కొండలారా, తిప్పలారా,

               పండ్లతోటలారా, అడవులారా

10.         సాధుజంతువులారా, వన్యమృగములారా

               నేలప్రాకుప్రాణులారా, ఎగురుపకక్షులారా

11.           రాజులారా, సమస్తప్రజలారా,

               అధిపతులారా, సమస్తపాలకులారా

12.          యువతీయువకులు, వృద్ధులు, బాలబాలికలు

13.          అందరును ప్రభునామమును స్తుతింతురుగాక! ఆయన నామము అన్నికంటెను గొప్పది.

               ఆయన మహిమ భూమ్యాకాశములను మించినది

14.          ఆయన తన ప్రజలకు

               అభ్యుదయమును ప్రసాదించెను.

               కనుక ఆయన ప్రజలెల్లరును,

               ఆయనకు ప్రీతిపాత్రులైన

               యిస్రాయేలీయులెల్లరును, ఆయనను స్తుతింతురు

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము