శాంతికొరకు ప్రార్థన
ప్రధానగాయకునికి
కోర కుమారులు రచించిన కీర్తన
85 1. ప్రభూ! నీవు నీ దేశమునకు మేలు చేసితివి. యాకోబునకు మరల పెంపును దయచేసితివి.
2. నీ ప్రజల పాపములను క్షమించితివి.
వారి తప్పిదములను మన్నించితివి.
3. నీ కోపమును ఉపసంహరించుకొింవి
నీ క్రోధమును విడనాడితివి.
4. మా రక్షకుడవైన దేవా!
మేము తిరిగి నీచెంతకు వచ్చునట్లు చేయుము.
మాపై నీకుగల కోపమును అణచుకొనుము.
5. నీవు మాపై కలకాలము కోపింతువా?
తరతరములవరకు మామీద కినుక పూనుదువా?
6. మాకు నూతనబలమును దయచేసి,
నీ ప్రజలమైన మేము
నీయందు ఆనందించునట్లు చేయవా?
7. ప్రభూ! నీ కృపను మాపట్ల ప్రదర్శింపుము.
నీ రక్షణమును మాకు దయచేయుము.
8. నేను ప్రభువైన దేవుని పలుకులు ఆలింతును.
ఆయన తన భక్తులమైన
మనకు శాంతి కలుగుననియు,
మనము మాత్రము మరల పిచ్చిపనులకు
పాల్పడరాదనియు చెప్పుచున్నాడు.
9. ఆయన తనపట్ల భయభక్తులు చూపువారిని
రక్షించుటకు సిద్ధముగానున్నాడు.
అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును.
10. కృపయు, విశ్వసనీయతయు
ఒకదానిని ఒకి కలిసికొనును.
న్యాయమును, శాంతియు ఒకదానిని
ఒకి ముద్దుపెట్టుకొనును.
11. పుడమి మీదినుండి విశ్వసనీయత మొలకెత్తును.
నింగినుండి న్యాయము క్రిందికి పారజూచును.
12. ప్రభువు మనకు శుభములు దయచేయును.
మన నేల చక్కగా పంటలు పండును.
13. నీతి ప్రభువునకు ముందుగా నడచును.
ఆయన అడుగుజాడలలో అది నడచును.