యెరూషలేము పట్టువడుట

39 1. సిద్కియా యూదాను పరిపాలించు కాలము తొమ్మిదవయేడు పదియవనెలలో బబులోనియారాజగు నెబుకద్నెసరు సర్వసైన్యముతోవచ్చి యెరూషలేమును ముట్టడించెను.

2. సిద్కియారాజు పరిపాలనాకాలము పదునొకండవయేడు నాలుగవనెల తొమ్మిదవ దినమున శత్రువులు నగరప్రాకారములను ఛేదించిరి.

3. యెరూషలేము పట్టుబడినప్పుడు, బబులోనియా రాజు ముఖ్యాధికారులెల్లరును వచ్చి మధ్యద్వారము వద్ద కొలువుదీరిరి. వారు నేర్గల్‌ షరేసర్‌, సమ్గర్నేబో, నపుంసకుల అధిపతియైన సర్సెకీము, మంత్రజ్ఞులకు అధిపతియైన నేర్గల్‌ షరేసర్‌ అనువారు.

4. సిద్కియా రాజును, అతని యోధులును ఈ ఉదంతమునుచూచి భయపడి రాత్రిలో నగరమునుండి పారిపోయిరి. వారు రాజోద్యానముగుండ వెళ్ళి రెండు ప్రాకారముల మధ్య గల ద్వారమును దాి యోర్దాను లోయవైపునకు వెళ్ళిపోయిరి.

5. కాని బబులోనియా సైనికులు వారిని వెన్నాడిరి. సిద్కియాను యెరికో మైదానమున పట్టుకొని హమాతు మండలములోని రిబ్లా నగరమున విడిది చేయుచున్న నెబుకద్నెసరు చెంతకుకొనిపోయిరి. అచట ఆ రాజు సిద్కియాకు శిక్ష విధించెను.

6. రిబ్లా నగరమున బబులోనియా రాజు సిద్కియా చూచుచుండ గనే అతని పుత్రులను చంపించెను. అతడు యూదా అధికారులను గూడ మట్టుప్టిెంచెను.

7. తదనంత రము అతడు సిద్కియా కన్నులను పెరికించెను. అతనిని బబులోనియాకు కొనిపోవుటకుగాను గొలుసు లతో బంధించెను.

8. బబులోనియా సైన్యము రాజ ప్రాసాదమును, ప్రజల గృహములను కాల్చివేసి నగర ప్రాకారములను పడగొట్టెను.

9. అంగరక్షకుల అధిపతి యైన నెబూజరదాను, నగరమున మిగిలియున్న వారిని, తన పక్షమున చేరిన వారిని బబులోనియాకు బందీలనుగా కొనిపోయెను.

10. అతడు పొలము పుట్రలేని నిరుపేదలను కొందరిని యూదాలోనే యుండనిచ్చెను. వారికి భూములు, ద్రాక్షతోటలిచ్చెను.

యిర్మీయాకు విముక్తి

11-12. ”నీవు యిర్మీయాను వెదకి అతనిని ఆదరింపుము. అతనికి హానిచేయవలదు. అతడు అడిగినదెల్ల చేసిపెట్టుము” అని బబులోనియారాజగు నెబుకద్నెసరు తన అంగరక్షకుల అధిపతియైన నెబూజరదానునకు ఆజ్ఞ ఇచ్చెను.

13-14. కనుక నెబూజరదాను ఉన్నత అధికారులగు నెబూషస్బాను, నేర్గల్‌ షరేజరు, మరియు బబులోనియా రాజు ఇతర అధికారులందరును కలిసి నన్ను ప్రాసాదావరణము నందలి చెరనుండి విడిపించిరి. వారు నన్ను షాఫాను మనుమడును, అహీకాము కుమారుడునైన గెదాల్యాకు ఒప్పగించిరి. నన్ను సురక్షితముగా ఇంికి చేర్చు పూచీని అతనికి ఒప్పగించిరి. కనుక నేను మా జనుల మధ్య నివసించితిని.

ఎబెద్మెలెకు గూర్చిన దైవోక్తి

15. నేనింకను ప్రాసాదపు ఆవరణములోని చెరలోబంధింపబడి ఉండగనే ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను.

16. ”నీవు వెళ్ళి ఎబెద్మెలెకుతో ఇట్లు చెప్పుము: ‘యిస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియైన ప్రభువిట్లు చెప్పుచున్నాడు. నేను పూర్వము చెప్పినట్లే క్షేమమునుగాక, వినాశమును ఈ నగరము మీదికి రప్పించెదను. ఈ కార్యము జరిగినపుడు నీవే చూతువు.

17. ఆ దినమున ప్రభుడనైన నేను నిన్ను కాపాడుదును. విరోధులు నీవు భయపడువారికి నిన్నప్పగింపరు.

18. నేను నిన్ను రక్షింతును. నీవు కత్తివాతపడవు. నీవు నన్ను నమ్మితివి గనుక బ్రతికి బయటపడెదవు. ఇది ప్రభుడనైన నావాక్కు.’ ”