యెహెజ్కేలు ధర్మశాస్త్రము

నూతన దేవాలయము

40 1. అది నూతన వత్సరము తొలిమాసపు పది యవరోజు. మా ప్రవాసము ఇరువది ఐదవయేడు. యెరూషలేము పట్టువడిన పిదప పదునాలుగవయేడు. ఆ దినము ప్రభువు హస్తము నామీదికి రాగా, ఆయన నన్ను కొనిపోయెను.

2. దర్శనములో దేవుడు నన్ను యిస్రాయేలు దేశమునకు కొనిపోయి, ఒక ఉన్నత పర్వతముపై నిలిపెను. నా యెదుట దక్షిణపు వైపున నగరమువిం కట్టడములేవో కన్పించెను.

3. ఆయన నన్ను వాని చెంతకు తీసుకొనిపోయెను. నాకు కంచు వలె మెరయు నరుడొకడు కనిపించెను. అతడు కొలనూలు, కొలబద్ద పట్టుకొని ద్వారముచెంత నిలు చుండి ఉండెను.

4. అతడు నాతో ”నరపుత్రుడా! జాగ్రత్తగా గమనింపుము. నా పలుకులను శ్రద్ధగా విని నేను నీకు చూపించు సంగతులను మనసులో ఉంచుకొనుము. నిన్నిక్కడికి తీసికొని వచ్చినది ఇందు కొరకే. నీవు చూచిన అంశములెల్ల యిస్రాయేలీయులకు తెలియజెప్పుము” అని అనెను.

తూర్పు ద్వారము

5. నేను దేవాలయము ప్రాంగణమునకు వెలుపల దానిచుట్టు ఉన్న గోడను చూచితిని. ఆ మనుష్యుని చేతిలోనున్న కొలబద్ద పొడవు ఆరుమూరలుండెను. మూర ఒకి ముంజేతి పొడవు మరియు అరచేయి వెడల్పు కలిపినంత పొడవుండెను1. అతను గోడను కొలిచెను. దాని ఎత్తు ఒక కొలబద్ద మరియు మందము ఒక కొలబద్ద. 6. అంతట అతడు తూర్పుద్వారము నొద్దకువెళ్ళి మెట్లెక్కి దాని ప్రవేశగదిని కొలచెను. అది ఒక కొలబద్ద వెడల్పుండెను.

7. దానికి ఇరువైపుల ఒక్కొక్కపక్క చతురస్రాకారపు మూడేసి కావలివారి గదులుండెను. ఒక్కొక్క గది కొలత ఒక కొలబద్ద. గదుల నడుమనున్న గోడల మందము ఐదుమూరలు.

8-9. ఆ గదులకు ఆనుకొనియున్న లోపలి ప్రవేశగది వెడల్పు ఒక కొలబద్ద మరియు చివరనున్న వసారా ఎనిమిదిమూరల వెడల్పు కలిగి ఇరువైపుల రెండు మూరల స్తంభాకార గోడలు కలిగియుండెను. వసారా చిట్టచివరనుండెను.

10. తూర్పు ద్వారములో ఇరు వైపులనున్న కావలివారి గదులన్నియు ఒకే పరిమాణ మున ఉండెను. వాని నడుమనున్న గోడల మంద మును సమానమే.

11. అటుపిమ్మట అతడు ద్వారప్రవేశ భాగమును కొలవగా అది పది మూరలుండెను. మరియు ప్రవేశ గది వెడల్పు మొత్తము పదమూడు మూరలుండెను.

12. కావలివారి గదుల ముందున్న అడ్డకమ్ములు ఒక మూర ఎత్తు, అంతే మందము కలిగియుండెను. చతురస్రాకారపు ఒక్కొక్క గది కొలత ఆరు మూరలు.

13. అటుపిమ్మట అతడు ఒక గది వెనుకి గోడ నుండి దాని అభిముఖముగానున్న గది వెనుకి గోడ వరకును గల పొడవును కొలువగా అది ఇరువది అయిదు మూరలుండెను. తలుపులులేని ఖాళీ ప్రవే శములు ఒకదానికొకి ఎదురుగానుండెను.

14. చిట్ట చివరనున్న వసారాగదిని అతడు కొలువగా ఇరువది మూరలుండెను. ఈ వసారానుండి దేవాలయ వెలుపలి ఆవరణలోనికి వెళ్ళవచ్చును.

15. ప్రవేశద్వారము వెలుపలి గోడనుండి లోపలిద్వారమును ఆనుకొని యున్న వసారా చివరవరకును గల పొడవు ఏబది మూరలు.

16. ప్రతి గది వెలుపలి గోడలోను, గదికి గదికి మధ్యగల గోడలలోను ఒకదానికొకి అభిముఖ ముగా అల్లిక కికీలు గలవు. అదే విధముగా వసారాలో కికీలు మరియు దాని పక్కనగల స్థంభాకార గోడల మీద ఖర్జూర వృక్షములను చెక్కిరి.

వెలుపలి ఆవరణ

17. ఆ మనుష్యుడు నన్ను వెలుపలి ఆవరణము లోనికి తీసికొనిపోయెను. అచట వెలుపలి గోడనాను కొని చుట్టు ముప్పది గదులుండెను.

18. వాని ముందట రాళ్ళు పరచిన తావుండెను. ఆ రాళ్ళు వెలుపలి ఆవరణములోనికి వ్యాపించి ప్రవేశగది పొడుగున వ్యాపించియుండెను. వెలుపలి ఆవరణము లోపలి ఆవరణము కంటె పల్లముగా నుండెను.

19. లోపలి ఆవరణములోనికి కొనిపోవు ఎత్తయిన ద్వారము ఒకి కలదు. అతడు రెండు ద్వారముల మధ్య గల దూరమును కొలువగ వంద మూరలుండెను.

ఉత్తర ద్వారము

20. అంతట అతడు వెలుపలి ఆవరణమునకు చేర్చు ఉత్తరద్వారమును కొలిచెను.

21. ప్రవేశమునకు ఇరువైపులనున్న మూడు కావలివారి గదులు, వాని నడుమనున్న కావలివారి గదులు,  వాని నడుమనున్న గోడలు, ప్రవేశపు గది కొలతలు తూర్పు ద్వారపు కొలతల వలెనే యుండెను. ఆ ద్వారపు పొడవు ఏబది మూరలు. వెడల్పు ఇరువదిఅయిదు మూరలు.

22. కికీలు, వసారాగది, చెక్కిన ఖర్జూర వృక్షములును తూర్పుద్వారముననున్నట్లే ఉండెను. ఇచట ఏడు మెట్లు ద్వారమునొద్దకు కొనిపోవును. దేవాలయ వెలుపలి ఆవరణములోనికి ప్రవేశించునట్లుగా వసారాగది యుండెను.

23. ఈ ఉత్తరద్వారమునకు అభిముఖ ముగా వెలుపలి ఆవరణమునుండి, దేవాలయ లోపలి ఆవరణములోనికి పోవుటకు ఒక ద్వారము కలదు. తూర్పున కూడ ఈ విధానమే కలదు. ఆ మనుష్యుడు ఈ రెండుద్వారముల నడుమనున్న దూరమును కొలవగా వందమూరలుండెను.

దక్షిణ ద్వారము

24. అంతట అతడు నన్ను దక్షిణ దిక్కునకు కొనిపోయెను. అచట నేను మరియొక ద్వారమును చూచితిని. అతడు దాని లోపలి గోడలను దాని ప్రవేశపు గదిని కొలిచెను. అవి ఇతర ద్వారముల కొలతలవలె నుండెను.

25. ఈ ద్వారమునకు చెందిన గదులకు ఇతర ద్వారములవలెనె కికీలు కలవు. ద్వారము పొడవు ఏబది మూరలు, వెడల్పు ఇరువది ఐదు మూరలు.

26. ఏడు మెట్లు దాని చెంతకు కొనిపోవును. ఈ ద్వారము నందు కూడ దేవాలయ వెలుపలి ఆవరణములోనికి ప్రవేశించునట్లుగా వసారాగది యుండెను. వసారాకు ఇరువైపుల స్తంభాకార గోడల మీద చెక్కిన ఖర్జూర వృక్షములు కలవు.

27. ఈ వసారాగదికి అభిముఖమున కూడ దేవాలయ లోపల ఆవరణములోనికి పోవు ద్వారము కలదు. ఆ మనుష్యుడు రెండు ద్వారముల నడుమన నున్న దూరమును కొలువగా అది వందమూరలుండెను.

లోపలి ఆవరణము, దక్షిణ ద్వారము

28. అతడు నన్ను దక్షిణద్వారముగుండ లోపలి ఆవరణములోనికి కొనిపోయెను. అతడు లోపలి ఆవరణద్వారమును కొలిచిచూడగా అది వెలుపలి గోడలోనున్న  ద్వారముల కొలతకు  సమానము గానుండెను. 29-30. దాని కావలివారి గదులు ప్రవేశపుగది, లోపలిగోడలు, వెలుపలి ద్వారములలోని గదుల కొలతలకు సమానముగానుండెను. పొడవు ఏబది మూరలు, వెడల్పు ఇరువది ఐదు మూరలు.

31. అయితే దాని వసారాగది దేవాలయ వెలుపలి ఆవరణము లోనికి ప్రవేశించునట్లు ఉండెను. వసారా ఇరువైపుల స్థంభాకారగోడలమీద ఖర్జూరవృక్షముల చెక్కడములు కలవు. వెలుపలి ఆవరణమునుండి ఎనిమిది మెట్లు ఈ ద్వారమునకు కొనిపోవును.

లోపలి ఆవరణము, తూర్పు ద్వారము

32. అతడు నన్ను దేవాలయ లోపలి ఆవరణములో తూర్పుదిక్కునకు కొనిపోయి అచట ద్వారమును కొలిచెను. అది ఇతర ద్వారముల కొలతలకు సమాన ముగా ఉండెను.

33. దాని కావలివారి గదులు, ప్రవేశపుగది, లోపలిగోడలు ఇతర ద్వారములలోని గదుల కొలతలకు సమానముగా నుండెను. దానికి అన్నివైపుల, ప్రవేశపు గదిలో కూడ కికీలు కలవు. దాని పొడవు ఏబది మూరలు, వెడల్పు ఇరువది అయిదు మూరలు.

34. వసారాగది ఇరుప్రక్కల స్థంభాకార గోడలమీద ఖర్జూర వృక్షములను చెక్కిరి. వసారా గదినుండి దేవాలయ వెలుపలి ఆవరణము లోనికి వెళ్ళవచ్చును. వెలుపలి ఆవరణమునుండి ఎనిమిది మెట్లు ఈ ద్వారమునకు కొనిపోవును.

లోపలి ఆవరణము, ఉత్తర ద్వారము

35. అంతట ఆ మనుష్యుడు నన్ను ఉత్తర ద్వారము నకు కొనిపోయెను. అతడు దానిని కొలిచిచూడగా అది ఇతర ద్వారముల కొలతలకు సమానముగా నుండెను.

36. వానివలెనె దానికి గూడ కావలివారి గదులు, అలంకరింపబడిన లోపలిగదులు, ప్రవేశపు గది, నలువైపుల కికీలుండెను. దాని పొడవు ఏబది మూరలు, వెడల్పు ఇరువది అయిదు మూరలు.

37. వసారా నుండి దేవాలయ వెలుపలి ఆవరణమునకు వెళ్ళవచ్చును. వసారా ప్రక్కనున్న స్తంభాకారగోడలపై ఖర్జూరవృక్షములను చెక్కిరి. ఎనిమిది మెట్లు ఈ ద్వార మునకు కొనిపోవును.

ఉత్తర ద్వారము ప్రక్కనున్న కట్టడము

38. ద్వారపు వసారానుండి ప్రవేశింపదగిన గది ఒకి ఉండెను. దానిలో దహనబలి పశువు మాంసమును కడిగి శుద్ధిచేయుదురు.

39. ద్వారపు వసారాలో దహనబలి పశువులను, పాపపరిహార బలి పశువులను, ప్రాయశ్చిత్తబలిపశువులను వధించుటకు ఇరువైపుల రెండేసి బల్లలు కలవు.

40.  ద్వారపు వెలుపల వసారా గోడను ఆనుకొని మెట్లు ఎక్కు స్థలమునకు ఇరుపక్కల రెండేసి బల్లలుండెను. 41.  ఆ విధముగ ద్వారమునకు ఒకవైపు నాలుగు బల్లలు, మరొకవైపు నాలుగు బల్లలు మొత్తము ఎనిమిది బల్లలపై పశువులను వధింతురు.

42. పశువులను దహనబలికి సిద్ధముచేయు బల్లలు చెక్కిన రాతితో చేయబడినవి. అవి ఒకిన్నర మూర పొడవు, ఒకిన్నర మూర వెడల్పు మరియు ఒక మూర ఎత్తు కలిగి ఉండెను. బలిపశువులను వధించు పరికరము లన్నింని ఈ బల్లలపైననే ఉంచుదురు.

43. బల్లల పై భాగముచుట్టు ఒకచేతి వెడల్పు గల దోనెలు ఉండెను. బలిగా అర్పించు మాంసమును మాత్రము ఈ బల్లలపైననే ఉంచుదురు. 

44. అంతట ఆ మనుష్యుడు నన్ను లోపలి ఆవరణలోనికి కొనిపోయెను. అచట ఆవరణము వైపు నకు తెరవబడియున్న రెండు గదులు కలవు. ఒకి ఉత్తరద్వారము ప్రక్కన దక్షిణ దిక్కునకు అభిముఖ ముగా నుండెను. మరియొకి దక్షిణద్వారము ప్రక్కన ఉత్తర దిక్కునకు అభిముఖముగా నుండెను.

45. దక్షిణమునకు అభిముఖముగానున్న గది దేవళమున పరిచర్యచేయు యాజకులకొరకు అనియు, 46. ఉత్తరమునకు అభిముఖముగానున్న గది బలి పీఠమువద్ద పరిచర్యచేయు యాజకులకొరకు అనియు అతడు నాతో చెప్పెను. యాజకులెల్లరును సాదోకు వంశజులు. లేవీయులతెగలలో దేవునిసన్నిధిలో పరిచర్యలు  చేయుటకు అనుమతి పొందినవారు వీరు మాత్రమే.

దేవాలయ ప్రవేశద్వారము

47. ఆ మనుష్యుడు లోపలి ఆవరణమును కొలువగా అది నలుచదరముగానుండి వందమూరలు పొడవు, వందమూరలు వెడల్పును కలిగియుండెను. దేవాలయమునకు ఎదురుగా బలిపీఠము కలదు.

48. అంతట అతడు నన్ను దేవాలయ ముఖ మంటపమునకు కొనిపోయెను. దాని ఇరుప్రక్కల ఒక్కొక్కి ఐదు మూరల మందముగల స్తంభాకార గోడలుండెను. దాని ప్రవేశద్వారమును ఆనుకొని ఇరు వైపుల మూడు మూరల గోడలు ఉండెను.

49. ప్రవేశ గది మొత్తము పొడవు ఇరువది మూరలు, వెడల్పు పదునొకండు మూరలు. పదిమెట్లు దేవాలయ ప్రవేశ భాగములోనికి కొనిపోవును. ద్వారముకిరు వైపుల స్తంభములు కలవు.