ప్రభువు భవిష్యత్తునకు అధిపతి
48 1. యాకోబుసంతతీ!
యిస్రాయేలు నామధారులారా!
యూదవంశజులారా!
ఈ సంగతివినుడు.
మీరు ప్రభువు పేరుమీద
బాస చేయుదురు.
యిస్రాయేలు దేవుని ఆరాధింతురు.
కాని మీకు చిత్తశుద్ధి
ఏ మాత్రమును లేదు.
2. మీరు మేము పరిశుద్ధ నగరపౌరులమనియు,
సైన్యములకధిపతి అని పేరుపొందిన
యిస్రాయేలు దేవునిపై ఆధారపడు వారమనియు
చెప్పుకొనుచున్నారు.
3. ”జరుగనున్న కార్యములను
నేను పూర్వమే తెలియ జేసితిని.
వానినిగూర్చి స్వయముగా చెప్పియుింని.
అవి దిఢీలున జరుగునట్లు చేసితిని.
4. మీరు మొండివారని నేనెరుగుదును.
నీ మెడ ఇనుప నరమనియు,
నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరుగుదును.
5. నేను పూర్వమే భవిష్యత్సంఘటనములను
మీకెరిగించితిని కనుక
మీరు కొలుచు విగ్రహములే,
మీ కొయ్యబొమ్మలే, మీ లోహవిగ్రహములే
వానిని జరిగించెను అని మీరు చెప్పజాలరు.
6. నేను చెప్పినవన్నియు నెరవేరినవి
కనుక మీరు
నా వాక్కుల యథార్థమును అంగీకరింపవలెను.
నేనిపుడు మీకు క్రొత్తసంగతులు
తెలియ జేయుచున్నాను.
వీనిని గూర్చి మీరింతవరకును ఎరుగరు.
7. ఈ కార్యములను నేను ఇప్పుడే నిర్ణయించితిని. వీనినిగూర్చి మీరింత వరకును వినియుండలేదు.
కనుక ఈ సంగతులు మీకిది వరకే తెలియునని మీరు చెప్పజాలరు.
8. మీరు నమ్మదగినవారు కారు,
మొదినుండియు నామీద తిరుగుబాటు
చేసినవారు కనుకనే
మీరు ఆ విషయములను
ఏనాడును వినియుండలేదు.
ఆ సంగతులు ఏనాడును
మీ చెవిన బడియుండలేదు.
9. ”నా నామ కీర్తి కొరకు
నేను కోపమును అణచుకొింని.
ప్రజలు నన్ను స్తుతించుటకొరకు
నా ఆగ్రహమును విడనాడితిని.
నేను మిమ్ము నాశనము చేయను.
10. వెండిని కుంపిలో పుటము వేసినట్లుగా,
నేను మిమ్ము బాధలు అను కుంపిలో
పుటము వేసితిని.
11. నేను నా కీర్తి కొరకే ఈ కార్యమును చేసితిని.
నాకు అపకీర్తి కలుగుటను
నేను సహించజాలను.
నేను నా కీర్తిని మరియొకరితో పంచుకొనను.
కోరెషు, ప్రభువునకు ఇష్టుడు
12. ”యాకోబూ! నేను పిలిచిన యిస్రాయేలూ!
నా పలుకులాలింపుము. నేనే ఆయనను,
నేను మొదివాడను, కడపివాడను.
13. నేలకు పునాదులెత్తినది నేనే.
ఆకాశమును విశాలముగా విప్పినది నేనే.
భూమ్యాకాశములను పిలువగా
అవి తక్షణమే ప్రత్యక్షమయ్యెను.
14. మీరెల్లరును ప్రోగై నా వాక్కులను ఆలింపుడు.
నాకిష్టుడైనవాడు నా చిత్తము నెరవేర్చుటకై
బబులోనియా మీదికి దండెత్తెను,
కల్దీయులను ముట్టడించెను.
ఈ సంగతిని ముందుగా
తెలియజేసినవాడు మీలో ఎవడున్నాడు?
15. ఈ ఆజ్ఞలను ఇచ్చినవాడను నేనే.
పలుకు పలికినది నేనే, అతనిని పిలిచినది నేనే,
అతనిని పంపినదినేనే,
అతనికి విజయమొసగినది నేనే.
16. మీరు నా దగ్గరికి వచ్చి నామాటలాలింపుడు.
ఆదినుండియు
నేను మీతో స్పష్టముగనే మాటలాడితిని.
ఎల్లప్పుడును
నా పలుకులు నెరవేరునట్లు చేసితిని.”
ఇప్పుడు ప్రభువైన దేవుడు నన్నును,
తన ఆత్మను పంపెను.
ప్రభువు తన ప్రజలకు చేయనెంచిన మేలు
17. మిమ్ము రక్షించు యిస్రాయేలు పవిత్రదేవుడు మీతో ఇట్లనుచున్నాడు:
”నేను మీ ప్రభుడనైన దేవుడను.
నేను మీమేలు కొరకే
మీకు ఉపదేశము చేయుదును.
మీరు పోవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును.
18. నా ఆజ్ఞలు పాించియుండిన ఎడల
మీరు పొంగిపారెడు నదివలె
వృద్ధిచెందియుండెడి వారు.
మీ విజయము సముద్రతరంగముల వలె
ఒప్పియుండెడిది.
19. మీ బిడ్డలు ఇసుకవలె విస్తరించుదురు.
మీ సంతానము
ఇసుక రేణువులవలె
సంఖ్యలకు అందకయుండెడిది.
వారి నామము నా సన్నిధినుండి
తీసివేయబడదు లేదా మరువబడదు.”
బబులోనియానుండి
వెడలిపోవుటకు గీతము
20. బబులోనియా నుండి వెడలిపొండు.
కల్దీయులనుండి వెళ్ళిపొండు.
సంతోషనాదములతో
ఈ సంగతి తెలియజేయుడు.
ఈ వార్తను నేల అంచులవరకును విన్పింపుడు.
ప్రభువు తనసేవకుడైన యిస్రాయేలును
రక్షించెనని పలుకుడు.
21. ప్రభువు తన ప్రజలను ఎడారిగుండ
నడిపించినపుడు వారు దప్పికకు గురికాలేదు.
ఆయన వారికొరకు
బండనుండి నీళ్ళు వెలువడునట్లు చేసెను.
ఆయన కొండబండను చీల్చగా
జలము స్రవించెను.
22. కాని దుష్టులకు శాంతియుండదని
ప్రభువు చెప్పుచున్నాడు.