డెబ్బది వారముల ప్రవచనము

దానియేలు ప్రార్థన

9 1. మాదీయుడైన అహష్వేరోషు కుమారుడైన దర్యావేషు బబులోనియా రాజమ్యును పాలించుచుండెను.

2. అతని పరిపాలనాకాలము మొదియేట నేను పవిత్ర గ్రంథములు చదివి, ప్రభువు తన ప్రవక్త యగు యిర్మీయాకు చెప్పినట్లు యెరూషలేము డెబ్బది ఏండ్ల పాటు శిథిలముగానుండుటను గూర్చి ఆలో చించుచుింని.

3. నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవిచేసికొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుింని.

4. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థనచేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొింని:

               ”ప్రభువైన దేవా! నీవు మహితాత్ముడవు.

               నీ ఆజ్ఞలను అనుసరించి జీవించువారియెడల

               నీ నిబంధనమును, నీ కృపను పాింతువు.

5.           మేము నీ దాసులగు ప్రవక్తలు

               నీ పేరుమీదిగా మా రాజులకును,

               మా అధిపతులకును, మా తండ్రులకును, యూదాదేశ జనులందరికిని

               చెప్పిన మాటలను ఆలకింపక

6.           నీ ఆజ్ఞలను, విధులను అనుసరించుటమాని,

               పాపులమును దుష్టులమై చెడుగా ప్రవర్తించుచు

               తిరుగుబాటు చేసినవారము.

7.            ప్రభూ! నీవు నీతిమంతుడవు.

               కాని మేముమాత్రము ఎల్లపుడు

               తలవంపులే తెచ్చుకొింమి.

               యూదయాలోను, యెరూషలేమునను

               వసించువారికిని, నీకు ద్రోహము చేసినందున

               నీవు దూరదేశములకును, దగ్గరిదేశములకును

               చెల్లాచెదరు చేసినవారికిని,

               ఈ అవమానమే చెల్లును.

8.           ప్రభూ! మారాజులు, పాలకులు, పూర్వులు

               నీకు ద్రోహముగా పాపముచేసి

               లజ్జాకరముగా ప్రవర్తించిరి.            

9.           మేము నీపై తిరుగబడినను,

               నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి.

10.         మా ప్రభుడవైన దేవా!

               నీవు నీ సేవకులైన ప్రవక్తలద్వారా

               దయచేసిన శాసనములను

               మేము పాింపవలెనని కోరితివి.

               కాని మేము నీ మాటవినమైతిమి.

11.           యిస్రాయేలీయులెల్లరును నీ కట్టడలనుమీరి

               నీ పలుకులను లెక్కచేయరైరి.

               మేము నీకు ద్రోహముగా అపరాధములు చేసితిమి. కనుక నీవు నీ సేవకుడైన

               మోషే ధర్మశాస్త్రమున లిఖింపబడిన

               శాపములకు మమ్ము గురిచేసితివి.

12.          నీవు మాకును, మా పాలకులకును

               నీవు చేయుదునన్న కార్యములేచేసితివి.

               నీవు లోకములోని నగరములన్నికంటెను

               యెరూషలేమును అధికముగా శిక్షించితివి.

13.          మోషే ధర్మశాస్త్రములోని

               శిక్షలన్నింని మామీదికి రప్పించితివి.

               మా ప్రభుడవైన దేవా!

               ఇప్పుడుకూడ మేము మా పాపములనుండి

               వైదొలగి నీ సత్యమును అనుసరించి

               నీకు ప్రీతికలిగింపజాలమైతిమి.

               నీవు ఎల్లపుడు న్యాయమునే

               పాించువాడవు కనుకను,

14.          మేము నీమాట వినలేదుకనుకను,

               నీవు మమ్ము దండింపకోరితివి, దండించితివి.

15.          మా ప్రభుడవైన దేవా!

               నీవు నీ ప్రజలను ఐగుప్తునుండి

               తోడ్కొనివచ్చుటద్వారా నీబలము ప్రదర్శించితివి.

               నేికిని నీకు కీర్తి చెల్లుచున్నది.

               మేము పాపములు అపరాధములు చేసితిమి.

16.          నీవు పూర్వము మమ్ము ఆదుకొింవి.

               కనుక నగరముమీద ఇకమీదట

               ఆగ్రహము చెందకుము.

               అది నీ నగరము, నీ పవిత్రపర్వతము.

               మేమును, మా పూర్వులును

               పాపము చేసినందులకుగాను

               లోకములోని నరులెల్లరును యెరూషలేమును,

               నీ ప్రజలను చిన్నచూపుచూచుచున్నారు.

17.          ప్రభూ! దీనిని బ్టి మీ దాసుడుచేయు ప్రార్థనను, విజ్ఞాపనలనాలకించి,

               ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన

               మీ పరిశుద్ధస్థలముమీదికి,

               మీ ముఖ ప్రకాశమును రానిమ్ము.

18.          ప్రభూ! మా వేడుకోలును ఆలింపుము.

               మా కష్టములు పరికింపుము.

               నీ పేరున వెలయుచున్న

               ఈ నగరపు ఇక్కట్టులను చూడుము.

               మేము ఏమేమో ధర్మకార్యములు

               చేసితిమనికాదు,

               నీవు దయామయుడవు కనుక

               మేము నీకు మనవిచేయుచున్నాము.

19.          ప్రభూ! మా మొరవినుము, మమ్ము క్షమింపుము.

               ఆలస్యముచేయక మా వేడికోలును చిత్తగింపుము.

               ఈ నగరమును, ఈ ప్రజలును

               నీ నామమును వహించినవారు,

               నీ ఘనతను గ్రహించినవారు.”

గబ్రియేలు ప్రవచనమును వివరించుట

20. నేనింకను ప్రార్థన కొనసాగించుచుింని. నా తప్పిదములను, మా ప్రజలైన యిస్రాయేలీయుల తప్పిదములను దేవునిముందట ఒప్పుకొనుచుింని. నా ప్రభువైన దేవుడు తన పవిత్రమందిరమును పునరు ద్ధరింపవలెనని వేడుకొింని.

21. నేనట్లు ప్రార్థన చేయుచుండగా, నేను పూర్వదర్శనమున చూచిన గబ్రియేలు, నేనున్న చోికి దిగివచ్చెను. అది  సాయంకా లము. బలినర్పించు సమయము.

22. అతడు నాతో ఇట్లనెను: ”దానియేలూ! నేను నీకు ప్రవచనము నునెరి గింప వచ్చితిని.

23. నీవు దేవునికి మొరప్టిెనపుడు ఆయన నీ వేడుకోలును ఆలించెను. ఆయన  నిన్ను ప్రేమించెను. కనుక నేను నీకు ఆయన జవాబు నెరిగింప వచ్చితిని. నేను దర్శనభావమును వివరింతును. సావధానముతో వినుము.    

24. ”ప్రభువు మీ ప్రజలను బానిసత్వమునుండి విడిపించుటకును, మీ పవిత్రనగరమును పాపము నుండి రక్షించుటకును డెబ్బదివారములు నిర్ణయించెను. ఆయన పాపములుమన్నించి శాశ్వతమైన న్యాయమును నెలకొల్పును. కావున ఈ దర్శనమును, ప్రవచనమును నెరవేరితీరును. పవిత్ర మందిరమును పునరంకితము చేయుదురు.

25. ఈ విషయము సావధానముగా విని గ్రహింపుము. యెరూషలేమును పునర్నిర్మింపుడని ఆజ్ఞ యిచ్చినప్పినుండి అభిషిక్తుడైన ప్రజాపతి వచ్చు వరకును ఏడువారములు గడచును. యెరూషలేమును వీధులతోను, బలమైన కోటలతోను పునర్నిర్మింతురు. అది అరువదిరెండువారములు పట్టును. కాని యిది శ్రమలతో నిండినకాలము.

26. ఆ కాలాంతమున ప్రభువు ఎన్నుకొనిన అభిషిక్తుడైన నాయకుని అన్యాయ ముగా హత్యచేయుదురు. బలాఢ్యుడైన రాజు సైన్య ములు దాడిచేసి నగరమును, దేవాలయమును నాశనము చేయును. ఆ అంతము ప్రళయమువలె వచ్చును. అది ప్రభువు నిర్ణయించిన యుద్ధమును,  వినాశమును కొనివచ్చును.

27. అతడొక వారము వరకు అనేకులతో సుస్థిర నిబంధన నేర్పరచును. అర్ధవారమువరకు బలిని, నైవేద్యమును నిలిపివేయ కారకుడగును. హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావ లెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఇట్లు జరుగును”.

Previous                                                                                                                                                                                                    Next