దేవుడు న్యాయాధిపతి

ప్రధానగాయకునికి అల్‌తష్‌హెత్‌ అనెడి రాగముమీద పాడదగిన ఆసాపు రచించిన గీతము

75 1.      ప్రభూ! మేము నీకు కృతజ్ఞతలర్పింతుము.

                              నీ సామీప్యతనుబ్టి నిన్ను స్తుతింతుము.

                              నీ నామమును ఘనపరతుము.

                              నీ మహాకార్యములను ప్రకింతుము.

2.           ”నిర్ణీతదినము వచ్చినపుడు నేను తీర్పుతీర్చెదను. న్యాయయుక్తముగా తీర్పుచెప్పెదను.

3.           భూమియు, భూమిమీద వసించువారును

               గతించినను, నేను భూమి పునాదులను

               మాత్రము  కదలనీయక  స్థిరముగా నుంచెదను.

4.           నేను గర్వితులతో

               మీ ప్రగల్భములు క్టిపెట్టుడింని.

               దుష్టులతో మీ అహంకారము అణచుకొనుడింని

5.           మీ మిడిసిపాటును విడనాడుడు.

               పొగరుబోతుతనముతో మాటలాడకుడు అంిని” అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

6.           న్యాయనిర్ణయము తూర్పునుండిగాని,

               పడమినుండిగాని రాదు.

               ఎడారినుండియైనను హెచ్చింపబడదు.

7.            న్యాయము చెప్పువాడు దేవుడే.

               అతడు కొందరిని తగ్గించి,

               మరికొందరిని హెచ్చించును.

8.           ప్రభువు చేతిలో పానపాత్రము ఉన్నది.

               దానిలోని ద్రాక్షారసము నురగలు క్రక్కుచున్నది.

               అది ఔషధ సమ్మిశ్రితమై ఉన్నది.

               ప్రభువు ఆ రసమును పోయగా

               దుష్టులెల్ల త్రాగుదురు.

               దానిని చివరిబొట్టువరకును పీల్చివేయుదురు.

9.           నేను నిరంతరము యాకోబు దేవుడైన

               ప్రభువును స్తుతింతును.

               ఆయనపై కీర్తనలు పాడుదును.

10.         ప్రభువు దుర్మార్గుల బలమును వమ్ముచేసి,

               సత్పురుషుల బలమును హెచ్చించును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము