యోబు దేవుని మహాబలమును అంగీకరించుట

27 1. తరువాత యోబు ఇట్లనెను:

2.           ”నాకు న్యాయమును నిరాకరించి

               నా బ్రతుకును కడగండ్లపాలు చేసిన

               ప్రభువు పేరుమీదుగా బాసచేసి చెప్పుచున్నాను.

3.           నా బొందిలో ప్రాణమున్నంతవరకు,

               నా ముక్కురంధ్రములలో దేవుని ఊపిరి

               నిల్చియున్నంతవరకు

4.           నా పెదవులు అసత్యము పలుకవు.

               నా జిహ్వ అబద్ధము చెప్పదు.

5.           మీ పలుకులను నేనంగీకరింపను.

               కన్నుమూయువరకు

               నేను నిర్దోషిననియే వాదింతును

6.           నేను నిర్దోషినన్న భావమును విడనాడను.

               నా అంతరాత్మ నా మీద నేరము మోపుటలేదు.

7.            నా విరోధులకు దుర్మార్గులకు పట్టుగతి

               పట్టునుగాక!

               నా శత్రువులు దుష్టులవలె శిక్ష ననుభవింతురుగాక!

8.           దేవుడు తన ప్రాణములను తీయబోవుచుండగా,

               ఇక దుర్జనునకు ఏమి ఆశ మిగులును?

9.           వినాశము దాపురించినపుడు దేవుడు

               దుష్టుని వేడుకోలు ఆలించునా?

10.         అతడు దేవుని తన ఆనందనిధిగా ఎన్నుకొనెనా?

               ఆయనకు ఏ ప్రొద్దునైనా మ్రొక్కుకొనెనా?

11.           దేవుని మహత్త్వము ఎంత గొప్పదో

               ఆయన ప్రణాళికలు ఎి్టవో నేను మీకు తెలియ

               జేయుదును.

12.          ప్రభువు మార్గములను మీరు ఎరుగుదురుగదా?

               మరి ఇప్పుడు మీర్టి నిరర్థకపు

               పలుకులనేల పలికితిరి?

దుర్మార్గులకు పట్టుగతి

131.        దేవుడు దుర్మార్గులకు ప్టించుగతి,

               ఆయన పరపీడకులను శిక్షించు తీరు ఇి్టది:

14.          వారికెందరు పుత్రులున్నను,

               అందరు కత్తివాతబడుదురు.

               వారి బిడ్డలకు కడుపునిండ తిండి దొరకదు.

15.          వారిలో మిగిలినవారికి గత్తరసోకును.

               వారు చచ్చినపుడు

               వారి విధవరాండ్రుకూడ శోకింపరు.

16.          దుష్టులు వెండిని ధూళివలె కుప్పలుగా

               ప్రోగుచేసికోవచ్చుగాక!

               దుస్తులను మ్టివలె సేకరించుకోవచ్చుగాక!

17.          ఎవడో ఒక సత్పురుషుడు వారి బట్టలు తాల్చును

               ఎవడో ఒక సజ్జనుడు వారి వెండిని గైకొనును.

18.          సాలీడు గూడు నేసినట్లుగా, పొలమునకు కావలికాయు బానిస

               గుడిసె వేసినట్లుగాను దుర్జనులు ఇళ్ళు కట్టుదురు.

19.          వారు చివరిసారిగ ధనవంతులవలె నిద్రపోవుదురు

               కాని మేల్కొని చూచునప్పికి

               వారి సొత్తు చిల్లిగవ్వయైన మిగులదు.

20.        అకస్మాత్తుగా వచ్చిన వరదలవలె

               విపత్తులు వారిని చుట్టుముట్టును.

               రేయి సుడిగాలి వారిని లేపుకొనిపోవును.

21.          వారు తమ ఇంినుండి పెనుగాలికి

               కొట్టుకొనిపోవుదురు.

22.         ఆ ప్రభంజనము నిర్దయతో వారిని తాడించును.

               దాని తాకిడికి తట్టుకోలేక వారు పారిపోజూతురు

23.         మనుష్యులు వారినిచూచి చప్పట్లు కొట్టుదురు.

               వారి స్థలములలోనుండి వారిని ఛీక్టొి

               తరిమివేయుదురు.