గాజా నగర ద్వారబంధములు

16 1. సంసోను గాజాకు వెళ్ళెను. అచట ఒక వేశ్యను చూచి ఆమె ఇంికి పోయెను.

2. సంసోను వచ్చెనని విని పురజనులు ప్రోగైవచ్చి నగరద్వారమున కాపుండిరి. వారు ఉదయముననే సంసోనును చంప వచ్చునుగదా అనుకొని రేయంతయు ఊరకుండిరి.        

3. సంసోను నడిరేయివరకు సద్దుసేయక నిద్దుర పోయెను. కాని అతడు అర్ధరాత్రమున లేచి నగర ద్వారము తలుపులను, ద్వారబంధమును, అడ్డు గఱ్ఱతోపాటు ఊడబెరికి భుజములపై మోసికొని వెడలి పోయెను. హెబ్రోనునకు ఎదురుగానున్న కొండపైకి ఎక్కిపోయి వానినచట వదలివేసెను.

డెలీలా సంసోనును ప్టియిచ్చుట

4. అటు తరువాత అతడు సోరేకు లోయలో వసించు వనితను ఒకతెను వలచెను. ఆమె పేరు డెలీలా.

5. ఫిలిస్తీయదొరలు డెలీలా చెంతకు వచ్చి ”నీవు సంసోనును లాలించి అతని విచిత్రబలమునకు కారణమేమో తెలిసికొనుము. అతనిని లోగొని త్రాళ్ళతో క్టి చెరపట్టు మార్గమేమో కనుగొనుము. నీ మట్టుకు నీకు మేమొక్కొక్కరము పదునొకండు వేల వెండికాసులు కానుకగానిత్తుము” అని చెప్పిరి.

6. డెలీలా సంసోనును ”నీ విచిత్రబలమునకు కారణమేమి? నిన్ను చెరపట్టుట ఎట్లు?” అని అడిగెను.

7. సంసోను ”పచ్చిపచ్చిగానున్న అల్లెత్రాడులు ఏడింతో నన్ను బంధింతురేని నాబలమంతయు ఉడిగిపోయి సామాన్యజనునివలె అయ్యెదను” అని చెప్పెను.

8. ఫిలిస్తీయదొరలు వచ్చి అల్లెత్రాడులు ఏడింని డెలీలా కిచ్చిరి. ఆమె  వానితో సంసోనును బంధించెను.

9. ఫిలిస్తీయులు డెలీలా ఇంట దాగి యుండిరి. ఆమె ”సంసోను! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేకపెట్టెను. సంసోను ఆ అల్లెత్రాళ్ళనన్నింని నిప్పంటుకొనిన నారత్రాళ్ళను వలె సునాయాసముగా త్రెంచివేసెను. కనుక అతని బలమునకు కారణమేమో తెలియలేదు.

10. డెలీలా మరల సంసోనుతో ”నీవు కల్లబొల్లి కబుర్లు చెప్పి నన్ను గేలిచేసితివి. నిన్ను బంధించుట ఎో్ల చెప్పవైతివిగదా!” అనెను.

11. అతడు ”ఇంత వరకు ఎవ్వరును వాడని క్రొత్తత్రాళ్ళతో నన్ను కట్టుదు రేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య నరుని వలె నయ్యెదను” అని చెప్పెను.

12. కనుక డెలీలా అతనిని క్రొత్తతాళ్ళతో బంధించి ”సంసోనూ! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేక పెట్టెను. ఫిలిస్తీయులు ఆమె యింట దాగియుండిరి. కాని సంసోను తనచేతి కట్టులన్నిని దారములవలె త్రెంచివేసెను.

13. డెలీలా మరల సంసోనుతో ”ఇంతవరకు అల్లిబిల్లిమాటలు చెప్పి నన్ను గేలిసేసితివిగదా! ఇకనైన నిన్ను బంధించుట ఎో్ల నాతో చెప్పవా?” అనెను.

14. అతడు ఆమెతో ”నా తలజడలు ఏడు పడుగువలె నేసి మేకునకు బిగగట్టెదవేని నా బలమంతయు ఉడిగి సామాన్య జనునివలెనయ్యెదను” అని చెప్పెను. ఆమె సంసోనును నిదురబుచ్చి అతని జడలు ఏడింని పడుగువలె నేసి మేకునకు బిగగ్టి ”సంసోనూ! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేక వేసెను. అతడు నిద్దురలేచి తలవెండ్రుకలను వానిని క్టిన మేకును ఒక్క ఊపున ఊడబెరికెను. కనుక అతని బలమునకు కారణమేమియో తెలియలేదు.

15. అంతట డెలీలా అతనితో ”నీవు నన్ను వలచితివన్నమాట కల్ల. అసలు నీకు నాపై నమ్మకమే లేనపుడు ఇక వలపెక్కడిది? నీవు నన్ను ముమ్మారు గేలిసేసితివి. నీ విచిత్రబలమునకు కారణమేమో ఇంతవరకు నాకు తెలుపవైతివిగదా!” అని వాపోయెను.

16. ఆమె రేపుమాపు సంసోనును గ్రుక్క త్రిప్పుకొన నీయకుండ అదే ప్రశ్నతో పీడించి తొందరపెట్టజొచ్చెను. అతడు విసిగివేసారిపోయెను.

17. ఆమె పోరు పడలేక చివరకు తన రహస్యమును చెప్పివేసెను. ”ఇంతవరకు కక్షురకత్తి నా తలవెంట్రుకలను తాకలేదు. పుట్టుక నుండి నేను వ్రతతత్పరుడనై జీవించుచుింని. నా తలజుట్టు కత్తిరింతురేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య నరునివలె అయ్యెదను” అని చెప్పెను.

18. డెలీలా చిట్టచివరకు సంసోను తన రహస్యము తెలియజెప్పెనని గ్రహించెను. వెంటనే ఆమె ”ఇంకొక మారు మీరు ఇచ్చికిరండు. సంసోను తన మర్మమును తెలియజెప్పెను” అని ఫిలిస్తీయ దొరలకు వర్తమాన మంపెను. ఆ కబురందుకొని ఫిలిస్తీయదొరలు రూకలతో వచ్చిరి.

19. ఆమె సంసోనునులాలించి తన ఒడిలో నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి అతని తలజడలు ఏడుకత్తెరలు వేయించి, అతనిని బాధింప మొదలిడెను. వెంటనే అతనిబలము ఉడిగిపోయెను.

20. డెలీలా ”సంసోనూ! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేకపెట్టెను. అతడు నిద్రమేల్కొని మునుపివలెనె బయటపడుటకు భుజములు జాడింపవచ్చును గదా అనుకొనెను. కాని ప్రభువు తనను విడనాడెనని సంసోనునకు తెలియదు.

21. అంతట ఫిలిస్తీయులు సంసోనును బంధించి అతని కన్నులు పెరికివేసి గాజాకు నడిపించు కొని పోయిరి. రెండుకట్ల ఇత్తడి గొలుసుతో అతనికి సంకెళ్ళు వేసిరి. సంసోను వారి చెరలో తిరగలి విసురు వాడయ్యెను.

22. కాని కత్తిరింపబడిన అతని తలవెంట్రుకలు మరల పెరుగజొచ్చెను.

సంసోను పగతీర్చుకొని చనిపోవుట

23. అంతట ఫిలిస్తీయసర్దారులు వారి దేవుడైన దాగోనునకు మహావైభవముతో బలి సమర్పించి ఉత్సవము చేసికొనుటకై ప్రోగైవచ్చిరి. వారు ”మనము కొలుచుదేవుడు మన పగతుడైన సంసోనును మన చేతికి అప్పగించెనుగదా!” అనుకొని పొంగిపోయిరి.

24. ఆ ప్రజలు దాగోను విగ్రహము కంటబడగనే అతనిని స్తుతించుచు:

               ”మన దేశమును సర్వనాశనము చేసి

               మనవారినెందరినో మట్టుప్టిెన

               మన పగతుడైన సంసోనును మన దేవుడు

               నేడు మనచేతికి అప్పగించెను”

అని అరచిరి.

25. వారి హృదయములు ఆనందము నొందగా ”మనమాతని ఆటప్టింప పిలిపింపుడు, అతని కార్యములనుజూచి వినోదింతుము” అని చెర సాలనుండి సంసోనును కొనివచ్చిరి. అతడు వారి ఎదుట వీరకార్యములు చేసెను. ఫిలిస్తీయులు అతనిని తమ దేవళమునందలి స్తంభములమధ్య నిలిపి పరిహసించిరి.

26. సంసోను తనను నడిపించు బాలకునితో ”ఈ మందిరమును మోయు స్తంభము లను తడవిచూడనిమ్ము. నేను వానిపై కొంచెము ఆను కోవలయును” అనెను.

27. దేవళము స్త్రీపురుషులతో క్రిక్కిరిసియుండెను. ఫిలిస్తీయదొరలందరు అచట సమావేశమై సంసోనును ఎగతాళిచేయగా మీది అంతస్తున రమారమి మూడు వేలమంది స్త్రీపురుషులు తిలకించుచుండిరి.

28. అపుడు సంసోను యావేను స్మరించుకొని ”ప్రభూ! నన్ను జ్ఞప్తియుంచుకొనుము. ఇంకొక్కమారు నీ బలమును నాకు ప్రసాదింపుము. నా రెండుకన్ను లను పెరికివేసినందులకై ఈ ఫిలిస్తీయులపై ఒక్క దెబ్బతో పగతీర్చుకోనిమ్ము” అని ప్రార్థించెను.

29. అతడు మందిరమును మోయు మూలస్తంభములు రెండింమీద చేతులు మోపెను. కుడిచేతిని ఒకదాని మీద, ఎడమచేతిని మరొకదానిమీద మోపి రెండు స్తంభములపై తన బలమును చూపెను.

30. ”ఈ ఫిలిస్తీయులతోపాటు నేనును చత్తునుగాక!” అని అరచి ముందికి వంగి స్తంభములను శక్తికొలది నెట్టెను. ఆ నెట్టుడుకు మందిరము పెళ్ళున కూలి దొరల మీదను, ప్రేక్షకులమీదను విరుచుకొనిపడెను. సంసోను తాను బ్రతికియుండగా చంపిన వారికంటె చనిపోవుచు చంపినవారే అధికులు.

31. అంతట సంసోను సోదరులు, బంధువులు వచ్చి అతని మృతదేహమును కొనిపోయిరి. జోరా, ఎష్టావోలు నగరముల మధ్య నున్న అతని తండ్రి మనోవా సమాధిలోనే అతనిని గూడ పాతిప్టిెరి. సంసోను ఇరువదియేండ్ల పాటు యిస్రాయేలీయులకు న్యాయాధిపతిగాఉండెను.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము