ఉత్తర తెగలు
యిస్సాఖారు
7 1. యిస్సాఖారు తనయులు తోలా, పువా, యాషూబు, షిమ్రోను అను నలుగురు.
2. తోలా కుమారులు ఉస్సీ, రెఫాయా, యెరీయేలు, యహ్మాయి, యిబ్సాము, షెమూవేలు. వారు తోలా వంశములో ఆయా కుటుంబములకు నాయకులు, యుద్ధవీరులు. దావీదుకాలమున వీరి వంశజులు 22,600 మంది ఉండిరి.
3-4. ఉస్సీ కుమారుడు ఇస్రహ్యా. అతని పుత్రులు మికాయేలు, ఓబద్యా, యోవేలు, ఈష్యా. వీరు ఐదుగురు ఆయా కుటుంబములకు నాయకులు. వారికి పలువురు భార్యలును, పెక్కండ్రు కుమారులును కలరు. కనుక వారి వంశజులు యుద్ధమునకు 36 వేలమంది యోధులను సిద్ధము చేయకలిగిరి.
5. యిస్సాఖారు వంశమంతట కలసి 87 వేలమంది యోధులుండిరి.
బెన్యామీను, దాను
6. బెన్యామీను పుత్రులు బేల, బేకేరు, యెదీయేలు అను ముగ్గురు.
7. బేల కుమారులు ఎస్బోను, ఉస్సి, ఉస్సీయేలు, యెరీమోతు, ఈరి అను ఐదుగురు. వారెల్లరు ఆయా కుటుంబములకు నాయకులు, గొప్ప యోధులు. వారి వంశజులు 22,034 మంది యుండిరి.
8. బేకేరు తనయులు సెమీరా, యోవాషు, ఎలియెజెరు, ఎల్యోయేనయి, ఒమీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, అలేమేతు.
9. వీరెల్లరును ఆయా కుటుంబములకు నాయకులు, గొప్పయోధులు. వారి వంశజులు 20,200 మంది ఉండిరి. వారెల్లరును యుద్ధము చేయగలవారు.
10. యెదీయేలు కుమారుడు బిల్హాను. అతని పుత్రులు యేమూషు, బెన్యామీను, ఏహూదు, కెనానా, సేతాను, తర్షీషు, అహీషహరు.
11. వీరెల్లరును ఆయా కుటుంబములకు నాయకులు, యోధులు. వీరి వంశజులు 17,200 మంది యుండిరి. వీరెల్లరును యుద్ధము చేయగలవారు.
12. షుప్పీము, హుప్పీము ఈరు కుమారులు. అహేరు కుమారుడు హషీము.
నఫ్తాలి
13. నఫ్తాలి కుమారులు యహసీయేలు, గూని, యేజెరు, షల్లూము. వీరెల్లరు బిల్హాకు జన్మించినవారు.
మనష్షే
14. మనష్షేకు అరామియా ఉపపత్ని వలన అస్రీయేలు, మాకీరు అను పుత్రులు కలిగిరి. మాకీరు కుమారుడు గిలాదు.
15. మాకీరు హుప్పీము, షుప్పీముల సహోదరిని పెండ్లియాడెను. దాని సహో దరి పేరు మాకా. మాకీరు రెండవ కుమారుడు సెలోఫెహాదు. ఇతనికి ఆడుబిడ్డలు మాత్రమే కలిగిరి.
16. మాకీరు భార్య మాకాకు పెరెషు, షెరెషు అను కుమారులు కలిగిరి. పెరెషు సుతులు ఊలాము, రాకెము.
17. ఊలాము కుమారుడు బేదాను. వీరెల్లరు గిలాదు వంశజులు. ఈ గిలాదు మాకీరు కుమారుడు, మనష్షే మనుమడు.
18. మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు నకు ఇషోదు, అబీయెజెరు, మహ్లా అను పుత్రులు కలిగిరి.
19. షెమిదా కుమారులు అహీయాను, షెకెము, లికీ, అనీయాము.
ఎఫ్రాయీము
20-21. ఎఫ్రాయీము వంశజులు క్రమముగా వీరు: షూతలాహ్‌ా, బెరెదు, తాహతు, ఎలాదా, తాహతు, సాబాదు, షూతలాహ్‌ా. ఎఫ్రాయీముకు షూతలాహ్‌ా కాక యేజెరు, ఎల్యాదు అను మరి ఇరువురు పుత్రులు కలరు. వీరు గాతు ప్రజల పశువులను అపహరింపబోగా వారు వీరిని చంపిరి.
22. ఎఫ్రాయీము వారి మరణ మునకు చాలనాళ్ళు శోకించెను. అతని సోదరులు అతనిని ఓదార్చిరి.
23. అటుతరువాత ఎఫ్రాయీము భార్యను కూడగా ఆమె గర్భవతియై ఒక కుమారుని కనెను. తన కుటుంబమునకు కీడు వాిల్లినదని తెలియజేయుచు ఎఫ్రాయీము ఆ బిడ్డనికి బెరియా అని పేరు పెట్టెను.
24. ఎఫ్రాయీమునకు షేరా అను కుమార్తె గలదు. ఆమె ఎగువ బేత్‌హోరోను, దిగువ బేత్‌హోరోను, ఉస్సేను షేరా అను నగర ములను నిర్మించెను.
25-27. ఎఫ్రాయీమునకు ప్టుిన కుమారులు రేఫా, రెషెఫు. అతని వంశజులు క్రమముగా రెషెఫు, తేలా, తహాను, లాదాను, అమ్మీహూదు, ఎలీషామా, నూను, యెహోషువ.
28. వీరు బేతేలును దాని చుట్టు పట్లగల గ్రామములను ఆక్రమించుకొనిరి. తూర్పు నారానువరకు పడమరయందు గేసేరు వరకుగల గ్రామములను వారు స్వాధీనము చేసికొనిరి. షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములు, వాని చుట్టుపట్ల గల పట్టణములు వారికే చెందెను.
29. మనష్షే వంశజులు బేత్షెయాను, తానాకు, మెగిద్దో, దోరు పట్టణములను వాని చుట్టుపట్ల గల గ్రామము లను ఆక్రమించుకొనిరి. ఈ తావులందెల్ల యాకోబు కుమారుడు యోసేఫు వంశజులు వసించిరి.
ఆషేరు
30. ఆషేరు కుమారులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. అతని పుత్రిక పేరు సెరా.
31. బెరీయా కుమారులు హేబేరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్సాయీతుకు తండ్రి.
32. హేబేరు కుమారులు యఫ్లెతు, షోమేరు, హోతాము. అతని పుత్రిక పేరు షువా.
33. యఫ్లెతు ముగ్గురు కుమారులు పాసకు, బింహాలు, అష్వతు.
34. షోమేరు తనయులు అహి, రోగా, యెహుబ్బా, ఆరాము.
35. హేలేము నలుగురు కుమారులు సోఫా, ఇమ్నా, షెలెషు, ఆమాలు.
36-37. జోఫా పుత్రులు సువా, హర్నెఫెరు, షూవాలు, బేరి, ఇమ్రా, బేజేరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బేరా. 38. యేతేరు వంశ జులు యెఫున్నె, పిస్పా, ఆరా.
39. ఉల్లా వంశజులు ఆరా, హన్నియేలు, రిసియా.
40. వారెల్లరు ఆషేరు వంశజులు. వారు ఆయా కుటుంబములకు నాయ కులు, గొప్పయోధులు. ఆషేరు వంశజులు ఇరువది ఆరు వేలమంది ఉండిరి. వారెల్లరును యుద్ధము చేయ గలవారు.