మూడవ దర్శనము-లంబసూత్రము

2 1. నేను మరియొక దర్శనమున లంబసూత్ర మును చేతబట్టుకొనియున్న నరుని చూచితిని.

2. నేను అతనిని ”నీవెచికి పోవుచున్నావు?” అని అడుగగా అతడు ”నేను యెరూషలేమును కొలిచి దాని పొడవును, వెడల్పును తెలిసికోగోరుచున్నాను” అని అనెను.

3. అంతట నాతో మ్లాడు దేవదూత ముందు నకు నడుచుచుండగా మరియొక దేవదూత అతని చెంతకు వచ్చెను.

4. మొది దేవదూత రెండవ వానితో ”నీవు శీఘ్రమేపోయి ఆ లంబసూత్రమును చేతబట్టుకొనియున్న యువకునితో ఇట్లు చెప్పుము: యెరూషలేమున చాలమంది మనుష్యులును, చాల పశువులును వసించును. గనుక దానికి ప్రాకారము పనికిరాదు.

5. ప్రభువే దానికి అగ్ని ప్రాకారముగ నుండి దానిని కాపాడుదుననియు, తాను దాని మధ్య వైభవోపేతముగా వసింతుననియు అని మాట యిచ్చెను”. ఇది ప్రభువు వాక్కు.

ప్రవాసులు తిరిగి వత్తురు

6.           ప్రభువు తన ప్రజలతో ఇట్లనెను:

               ”నేను మిమ్ము నలుదిక్కులకు చెదరగ్టొితిని.

               కాని ప్రవాసులారా!

               మీరు ఇపుడు ఉత్తరదేశము నుండి

               తప్పించుకొని తిరిగిరండు.            

7.            బబులోనియాలో వసించు సియోను ప్రజలారా!

               మీరు తప్పించుకొనిరండు.      

8.           సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కిది:

               మిమ్ము ముట్టుకొనినవాడు

               తన కింపాపను ముట్టుకొనినట్లేయని యెంచి

               తనకు ప్రసిద్ధితెచ్చుకొనదలచి మిమ్మును

               దోచుకొనిన అన్యజాతులయొద్దకు

               నన్ను ఈ సందేశము చెప్పబంపెను.

9.           ‘నేను నా బాహువును మీపై ఆడించగా,

               మీరు మీదాసులకు దోపుడుసొమ్మగుదురు’

               ఈ కార్యము జరిగినపుడు ఎల్లరును

               సైన్యములకధిపతియైన ప్రభువు

               నన్ను పంపెనని గ్రహింతురు.

10. ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ‘సియోను కుమార్తె!

               నీవు సంతసముతో పాటలు పాడుము

               నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను’

11.           ఆ కాలమున పెక్కుజాతులు ప్రభువువద్దకు

               వచ్చి ఆయన సొంతప్రజలగుదురు.

               ఆయన మీ నడుమ వసించును.

               ఆయనే నన్ను పంపెనని మీరు  గ్రహింతురు.

12.          ప్రభువు పవిత్రదేశమున

               యూదా మరల ప్రభువు స్వాస్థ్యమగును

               ఆయన యెరూషలేమును మరల ఎన్నుకొనును.

13. ఆయన తన పవిత్రనివాస స్థానమునుండి

               విజయము చేయుచున్నాడు.

               ప్రభువు ఎదుట

               ఎల్లరును మౌనము వహింతురుగాక! 

Previous                                                                                                                                                                                                     Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము