16 1.       నరుడు పథకములను

                              సిద్ధము చేసికోవచ్చుగాక!

                              ప్రత్యుత్తర మొసగునది మాత్రము ప్రభువే.

2.           మన కార్యములు

               మనకు మంచివిగానే కన్పింపవచ్చును.

               కాని ప్రభువు మన ఉద్దేశములను

               పరిశీలించిచూచును.

3.           దేవుని నీ కార్యక్రమములను

               దీవింపుమని వేడికొందువేని

               నీకు తప్పక విజయము కలుగును.

4.           ప్రభువు ప్రతికార్యమును

               ఏదేనియొక ఉద్దేశముతోనే చేసెను.

               దుష్టుని శిక్షించినపుడును

               అతని ఉద్దేశము వమ్ముకాదు.

5.           పొగరుబోతును ప్రభువు చీదరించుకొనును.

               అతడు దైవదండనము తప్పించుకోజాలడు.

6.           దయ, విశ్వసనీయత ఉండెనేని

               దేవుడు తప్పులు మన్నించును.

               దైవభయము కలవాడు పాపమునుండి వైదొలగును

7.            ప్రభువు ఎవనివలన ప్రీతిచెందునో

               వానికి శత్రువులుగూడ మిత్రులగునట్లు చేయును.

8.           అన్యాయ మార్గమున

               చాలసొమ్మును ఆర్జించుటకంటె

               న్యాయమార్గమున కొంచెమే గడించుటమేలు.

9.           నరుడు పథకములను సిద్ధము చేసికోవచ్చునుగాక!

               అతని కార్యక్రమములను

               నడిపించునది మాత్రము  ప్రభువే.

10.         రాజు దైవాధికారముతో తీర్పుచెప్పును.

               అతని తీర్పు తప్పు కాజాలదు.

11.           తూనికలు కొలతలు సక్రమముగా

               నుండవలెనని ప్రభువు కోరిక.

               సక్రమముగా సరుకులను అమ్మవలెనని

               ఆయన ఆశయము.

12.          చెడుచేయుట రాజులకు గిట్టదు.

               న్యాయము వలననే సింహాసనములు నిలుచును.

13.          రాజు సత్యభాషణను కోరును.

               నిజము పలుకువానిని

               అతడాదరముతో చూచును.   

14.          రాజు కోపము మరణమును తెచ్చిపెట్టునుకాని

               జ్ఞాని అతని ఆగ్రహమును ఉపశమింపచేయును.

15.          రాజు ప్రసన్నుడయ్యెనేని జీవనమబ్బును.

               అతని అనుగ్రహము మధుమాస వర్షము వింది.

16.          బంగారంకంటె విజ్ఞానమును ఆర్జించుట మెరుగు

               వెండికంటె వివేకమును బడయుట మేలు.

17.          సత్పురుషులు చెడుకు దూరముగా నడతురు.

               తన క్రియలను పరిశీలించి చూచుకొనువాడు

               ప్రాణములు కాపాడుకొనును.

18.          పొగరుబోతుతనము వెనుక వినాశము నడచును.

               పతనమునకు ముందు గర్వము నడచును.

19.          గర్విష్ఠుడైయుండి కొల్లసొమ్మును పంచుకొనుటకంటె

               వినయవంతుడైయుండి పేదగా బ్రతుకుట మేలు.

20.        ఉపదేశమును ఆలించువాడు

               విజయమును చేపట్టును,

               ప్రభుని నమ్మువాడు సుఖములు బడయును.

21.          విజ్ఞుడు వివేకశీలి అనబడును.

               మృదుభాషణములకు ఆకర్షణమెక్కువ.

22.        జ్ఞానికి విజ్ఞానమే జీవమొసగెడి జలధార.

               మూర్ఖునికి మూర్ఖత్వమే శిక్ష.

23.         విజ్ఞాని ఆలోచించిగాని మ్లాడడు.

               కనుక అతని సంభాషణ

               ఆకర్షణీయముగానుండును.

24.         కరుణగల పలుకులు తేనెపట్టు వింవి.

               అవి తీపిని, ఆరోగ్యమును చేకూర్చిపెట్టును.

25.        నరులు సత్ఫలితమని నమ్మినదే

               కడకు మృత్యువునకు చేర్చును.

26.        పనివాని ఆకలి అతనిని ప్రేరేపించును.

               ఆకలి తీర్చుకొనగోరి అతడు పనికి పూనుకొనును.

27.         దుష్టుడు ఇతరులకు

               కీడుచేయు మార్గమును వెదకును.

               అతని పలుకులుకూడ నిప్పువలె కాల్చును.

28.        కొండెగాడు కలహములుపెంచి

               మిత్రులను విడదీయును.

29.        దుష్టుడు తోడివారిని మోసగించి

               అపమార్గము ప్టించును.

30.        కన్నులు మూసికొనువాడు చెడును తలపెట్టును,

               పెదవులు కదపనివాడు కీడెంచును.

31.          పుణ్యపురుషులు దీర్ఘాయుష్మంతులగుదురు.

               తలనెరయుట గౌరవప్రదమైన

               కిరీటమును బడయుటయే.

32.        ఓర్పుగలవాడు వీరునికంటె ఘనుడు.

               నగరమును జయించుటకంటె

               తననుతాను గెలుచుట లెస్స.

33.        దైవచిత్తము నెరుగుటకు చీట్లువేయుటకద్దు.

               కార్యనిర్ణయము చేయునది మాత్రము ప్రభువే.