ప్రధానయాజకుని దుస్తులు

1. యిస్రాయేలీయులనుండి నీ సోదరుడు అహరోనును, అతని కుమారులను యాజకులుగా నాకు సమర్పింపుము. అహరోను అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియెజెరు, ఈతామారులు నాకు యాజకులగుదురు.

2. నీ సోదరుడు అహరోనుకు పవిత్రవస్త్రములు తయారు చేయింపుము. అవి అతనికి గౌరవమును, శోభను కలిగించును.

3. నేర్పుగల పనివారినందరిని అహరోనునకు వస్త్రములు తయారు చేయుటకు నియమింపుము. వారికి నేను వివేక హృదయమును, జ్ఞానాత్మను ప్రసాదించితిని. ఈ వస్త్రములు ధరించి అతడు నాకు యాజకుడుగా నివేదితుడగును.

4.ఆ పనివారు కుట్టవలసిన వస్త్రములివి: వక్షఃఫలకము, ఏఫోదు అనబడు పరిశుద్ధ వస్త్రము, నిలువుటంగీ, విచిత్ర అల్లికపని గల చొక్కా, తలపాగా, నడికట్టు. ఈ రీతిగా నీ సోదరునికి అతని కుమారులకు పవిత్రవస్త్రములు క్టుింపవలయును. వానిని ధరించి వారు నాకు యాజకులుగా పనిచేయుదురు.

5. పనివారు బంగారము, ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్ని, పేనినదారమును వాడుదురు.

ఎఫోదు పరిశుద్ధవస్త్రము

6. పనివారు బంగారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నితో, పేనిన దారముతో, కళాత్మకమైన అల్లికపనితో పరిశుద్దవస్త్రమును తయారు చేయవలెను.

7. ఈ ఎఫోదు పరిశుద్ధవస్త్రమునకు రెండుఅంచుల రెండు భుజపాశములుండును. వానిని యాజకుని భుజములకు తగిలింపవచ్చును.

8. దానితో కలిపి క్టుిన నడికట్టునుగూడ బంగారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో, పేనిన దారముతో కళాత్మకముగా తయారుచేయవలయును.

9. రెండు లేతపచ్చమణులను తీసికొని వానిమీద యిస్రాయేలు తెగల పేరులు చెక్కింపుము.

10. జనన క్రమము అనుసరించి ఒక మణిమీద ఆరుగురి పేర్లు, మరియొక మణిమీద ఆరుగురి పేర్లు చెక్కింపుము.

11. మణులు ముద్రలు చెక్కు పనివారిని నియమించి రెండు మణుల మీద యిస్రాయేలు తెగల పేర్లు చెక్కింపుము. అటుపిమ్మట ఆ మణులను బంగార మున పొదిగింపుము.

12. ఈ మణులను ఎఫోదు పరిశుద్ధవస్త్రము భుజపాశములపై అమర్చుము. ఈ మణుల మూలమున యిస్రాయేలీయులు నాకు  జ్ఞప్తికి వత్తురు. ఈ రీతిగా అహరోను యిస్రాయేలీయుల పేర్లను తన భుజములపై తాల్చును. ఈ పేర్లు చూచి ప్రభువు యిస్రాయేలీయులను స్మరించుకొనును.

13. మరియు నీవు రెండు రత్నపురవ్వలను మేలిమి బంగారముతో పొదిగించి, జిలుగుపనిగా బంగారు కడియములను చేయుము.

14. దారపు ముడులవలె వంగిన బంగారుకడియములు గల రెండు బంగారు గొలుసులను గూడ చేయించి వానికి ఆ రత్నపు రవ్వలను తగిలింపుము.

వక్షఃఫలకము

15. నీవు న్యాయతీర్పు చెప్పు వక్షఃఫలకమును కళాత్మకముగా తయారుచేయవలెను. ఎఫోదు పరిశుద్ధ వస్త్రమువలె, ఇదికూడ ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులు గల ఉన్నితో పేనినదారముతో, బంగార ముతో, అల్లికపనితో తయారు చేయవలయును.

16. నలుచదరముగానున్న దానిని రెండు మడుతలుగా మడువుము. దాని పొడవు తొమ్మిది అంగుళములు, వెడల్పు తొమ్మిది అంగుళములు ఉండవలయును.

17. వక్షఃఫలకముమీద నాలుగు వరుసలలో మణులు తాపింపుము. మొది వరుసలో కురువిందము, పద్మరాగమణి, గరుడపచ్చ ఉండును.

18. రెండవ వరుసలో మరకతము, కెంపు, నీలమణి ఉండును.

19. మూడవ వరుసలో వజ్రము, సూర్యకాంతము, గోమేధికము ఉండును.

20. నాలుగవ వరుసలో సులేమానురాయి, చంద్రకాంతము, వైఢూర్యము ఉండును. ఈ మణులనన్నిని బంగారమున పొదిగింపుము.

21. ఈ పండ్రెండు మణుల మీద పండ్రెండుమంది యిస్రాయేలుకుమారుల పేరులు ఉండవలయును.

22. మణికొక తెగ చొప్పున పండ్రెండు తెగల పేరులు ఆ మణులమీద ముద్రలుగా చెక్కింపవలయును.

23. వక్షఃఫలకమునకు దారపు ముడులవిం మెలికలుగల బంగారుగొలుసులు చేయింపుము.

24. రెండు బంగారు ఉంగరములు చేయించి వానిని వక్షఃఫలకము పైభాగములందు తగిలింపుము.

25. బంగారుగొలుసులు రెండింని పైరెండు ఉంగరము లకు తగిలింపుము.

26. ఆ గొలుసుల చివరికొనలు రెండు జిలుగుబంగారు జవ్వలకు తగిలించి ఆ గొలుసులు ఎఫోదు పరిశుద్ధవస్త్రము ఉపరిభాగమున నున్న భుజపాశములకు తగిలింపబడును.

27. మరియు రెండు బంగారు ఉంగరములు చేయించి వానిని ఎఫోదు పరిశుద్ధ వస్త్రమునకు దాపున,          వక్షఃఫలకమునకు క్రిందిభాగము లోపలివైపు తగి లింపుము.

28. ఇంకను రెండు బంగారు ఉంగరములు చేయించి ఎఫోదు పరిశుద్ధవస్త్ర భుజపాశములకు ముందు క్రిందిభాగమున తగిలింపుము. ఈ ఉంగర ములు కళాత్మకమైన అల్లికపనిగల ఎఫోదు పరిశుద్ధ వస్త్రపు నడికట్టుకు పైగా, దాని కూర్పునొద్ద ఉండవల యును. ఊదాదారముతో వక్షఃఫలకము ఉంగరము లను ఎఫోదు పరిశుద్ధవస్త్రపు ఉంగరములకు బిగియ గట్టవలయును. ఇట్లు చేసినయెడల వక్షఃఫలకము వదులై జారిపోక, నడికట్టుకు పైగా నిలుచును.

29. అహరోను పరిశుద్ధస్థలమున అడుగిడు నపుడెల్ల తన రొమ్ముమీద నున్న వక్షఃఫలకములోని యిస్రాయేలీయుల కుమారుల పేర్లను అనునిత్యము యావే సన్నిధిని జ్ఞాపకార్ధముగా ధరించవలెను.

30. న్యాయవిధానమును నిర్ణయించి చెప్పు వక్షఃఫలకమున ఊరీము, తుమ్మీము పరికరములనుంచుము. అహరోను దేవుని సన్నిధికి వచ్చినపుడెల్ల ఈ పరికరములు అతని ఎదురురొమ్ముపై నుండును. అతడు దేవునిసన్నిధికి వచ్చినపుడెల్ల యిస్రాయేలీయులకు న్యాయవిధాన మును నిర్ణయించి చెప్పుటకై ఆ పరికరములను రొమ్ముపై ధరించును.

నిలువుటంగీ

31. యాజకుడు ఎఫోదు పరిశుద్ధవస్త్రము క్రింద తొడుగుకొను నిలువుటంగీని ఊదారంగు ఉన్నితో చేయింపుము.

32. దానినడుమ తలదూర్చు రంధ్రము ఉండవలయును. ఈ రంధ్రము చుట్టు, తోలు అంగీ మెడకు క్టుినట్లుగా, సులభముగా చినుగకుండునట్లు నేతవస్త్రమును గ్టిగా కుట్టవలయును.

33. ఈ అంగీ క్రింది అంచుచుట్టు ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో దానిమ్మపండ్లు క్టుింపవలయును. వాని నడుమ బంగారుగజ్జెలు అమర్చవలయును.

34. ఈ రీతిగా అంగీ క్రిందిఅంచుచుట్టు దానిమ్మపండ్లు, గజ్జెలు ఒక్కొక్కి వరుసగా వ్రేలాడుచుండును.

35. అహరోను పరిచర్య చేయునపుడెల్ల ఈ అంగీని ధరించును. అతడు గర్భగృహమున ప్రభుసన్నిధికి వెళ్ళి నపుడుగాని, అచినుండి వెలుపలికి వచ్చినపుడు గాని ఆ గజ్జెలు మ్రోగగా, ప్రాణాపాయము తప్పి బ్రతుకును.

పతకము

36. నీవు మేలిమి బంగారముతో పతకమును చేయించి దాని మీద ‘ప్రభువునకు నివేదితము’ అను అక్షరములు చెక్కింపుము.

37. దానిని ఊదాదార ముతో తలపాగాకు ముందరి వైపు క్టించుము.

38. అహరోను దానిని తననొసట ధరించును. ప్రజలు ప్రభువునకు అర్పించు అర్పణములలో ఏమైన దోష మున్నయెడల ఈ పతకము ఆ దోషమును హరించును. ప్రభువు ప్రజల అర్పణమువలన తృప్తి చెందుటకై అహరోను ఈ పతకమును ఎల్లప్పుడును నొసట తాల్చును.

39. అల్లిక పనియైన చొక్కాను, తలపాగాను సన్ననిదారముతో తయారు చేయింపుము. నడికట్టును అల్లికపనితో తయారు చేయింపుము.

యాజకుల వస్త్రములు

40. అహరోను కుమారులకు చొక్కాలు, నడికట్లు, ోపీలు తయారు చేయింపుము. ఇవన్నియు వారికి గౌరవమును, శోభను కలిగించును.

41. ఈ వస్త్రము లను నీ సోదరుడగు అహరోనునకు అతని కుమారు లకు తొడుగుము. నీవు వారికి అభిషేకము చేయవలెను. వారిని యాజకులుగా ప్రతిష్ఠించి నా పరిచర్యకు సమర్పింపుము.

42. నడుమునుండి తొడలవరకు గల శరీరభాగమును కప్పివేయునట్లుగా వారికి నారబట్టలతో లాగులు క్టుింపుము.

43. సాన్నిధ్యపు గుడారమున ప్రవేశించునపుడుగాని పరిశుద్ధస్థలములో పరిచర్యచేయుటకు బలిపీఠమును చేరునపుడుగాని అవి అహరోను, అతని కుమారులమీద ఉండవల యును. అప్పుడు వారు దోషమునుండి, ఆ దోషము వలన కలుగు మరణమునుండి విముక్తులగుదురు. అహరోనునకు అతని సంతతికి ఇది నిత్యనియమము.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము