దేవుని మాహాత్మ్యము

18 1.       చిరంజీవియైన ప్రభువు

                              ఈ విశ్వమును సృజించెను.

2.           ఆయనొక్కడే నీతిమంతుడు.

               ఆయనతప్ప మరి యెవడును లేడు.

3.           ఆయన తనచేతితో ఈ ప్రపంచమును నడిపించును

               ఎల్లప్రాణులును ఆయనకు విధేయములగును.

               అన్నింకి ఆయనే రాజు.

               ఆయన దక్షతతో పవిత్రులను అపవిత్రులనుండి

               వేరుచేయును.

4.           ఏ నరుడును ఆయన సృష్టిని సరిగా వర్ణింపజాలడు

               ఎవడును ఆయన అద్భుతకార్యములను

               పూర్తిగా గ్రహింపజాలడు.

5.           ఆయన మహాశక్తిని

               ఎవడు అర్థము చేసికోగలడు?

               ఆయన కరుణకార్యములనెవ్వడు

               సంపూర్ణముగా ఉగ్గడింపగలడు?

6.           మనము ఆ కార్యములకు ఏమి చేర్పజాలము.

               వానినుండి యేమియు తీసివేయజాలము.

               ప్రభుని అద్భుతకార్యములను ఎరుగుట అసాధ్యము

7.            ఆయన మహాకార్యములను పూర్ణముగా

               తెలిసికొనినపుడు వాని విషయమున

               ఇంకా ప్రారంభముననే ఉన్నామనుకోవలెను.

               ఆ కార్యములను గాంచి నోటమాటరాక

               దిగ్భ్రాంతి చెందుదుము.

నరుడు సర్వశూన్యుడు

8.           నరుడేపాివాడు?

               అతనివలన ఏమి ప్రయోజనము?

               అతడుచేయు మంచికిగాని,

               చెడుకుగాని విలువెంత?

9.           నరుడు వందయేండ్లు జీవించినచో

               దీర్ఘకాలము బ్రతికినట్లే.

10.         కాని అనంతకాలముతో పోల్చిచూచినచో

               ఆ నూరేండ్లు సాగరములో

               ఒక్క నీిచుక్క వింవి.

               ఒక్క యిసుక రేణువు వింవి.

11.           కనుకనే ప్రభువు నరులపట్ల

               మిక్కిలి ఓర్పుచూపును.

               వారిమీద దయను క్రుమ్మరించును.

12.          నరులు మృత్యువువాత బడుదురని గ్రహించి

               వారిని ఉదారముగా క్షమించును.

13.          నరుడు తోడినరునిపై మాత్రమే దయచూపును.

               కాని ప్రభువు ప్రతిప్రాణిని కరుణతో చూచును.

               ఆయన నరులను మందలించుచు,

               చక్కదిద్దుచు, ప్రబోధించుచు,

               కాపరినుండి తప్పి పోయిన గొఱ్ఱెలనువలె

               వారిని మరల తన చెంతకు కొనివచ్చును.

14.          ఆయన దిద్దుపాటునకు లొంగి

               ఆయన ఆజ్ఞలకు తలయొగ్గు వారిపై

               ఆయన కరుణచూపును.

15.          నాయనా! నీవు దానము చేయునపుడు

               నిందావాక్యములు పలుకవలదు.

               ఇతరులకు ఇచ్చునపుడు

               వారి మనసు నొప్పింపవలదు.

16.          మంచు కురిసినపుడు

               ఎండవేడిమి సమసిపోవును కదా!

               నీవిచ్చు వస్తువుకంటెను నీ మాటలు ముఖ్యము.

17.          కరుణపూరిత వాక్యములు ప్రశస్తదానముకంటె

               శ్రేష్ఠమైనవి.

               కాని ఉదారస్వభావుడు ఆ రిెంని కూడ ఇచ్చును

18.          మూర్ఖుడు ఏమీ ఈయక

               వచ్చినవారిని అవమానించును. 

               అయిష్టముగానిచ్చు దానమును

               ఎవడు ప్రీతితో చూడడుగదా!

ఆలోచన, ముందుచూపు

19.          నీవు చెప్పనున్న సంగతిని

               బాగుగా తెలిసికొనిన పిమ్మట మ్లాడుము.

               వ్యాధి రాకముందే నీ ఆరోగ్యమునుగూర్చి

               జాగ్రత్తపడుము.

20.        ప్రభువు నీకు తీర్పు తీర్చక పూర్వమే

               నీ అంతరాత్మను పరిశోధించి చూచుకొనుము.

               అట్లయినచో ఆ క్షణము వచ్చినపుడు

               ప్రభువు నిన్ను క్షమించును.     

21.          వ్యాధియను శిక్షకు గురిగాకముందే

               వినయమును ప్రదర్శింపుము.

               తప్పు చేసినపుడు పశ్చాత్తాపపడుము.

22.        దేవునికి చేసిన మ్రొక్కులు

               వెంటనే తీర్చుకొనుము.

               చనిపోవు సమయమువరకు జాప్యము చేయకుము  

23.        మ్రొక్కుబడి  చేసికొనునపుడు 

               దానిని చెల్లించు ఉద్దేశము వుండవలెను.

               దేవుని సహనమును పరీక్షింపవలదు.

24.         నీ మరణ కాలమున ప్రభువు నీపట్ల

               ఆగ్రహమును చూపకుండునట్లును,

               నీకు తీర్పు చెప్పునప్పుడు నీకు విముఖుడుగా

               ఉండకుండునట్లును జాగ్రత్తపడుము.

25.        పంటలు పండిన కాలమున

               కరువును గుర్తుంచుకొనుము.

               సంపదలు కలిగిన కాలమున

               పేదరికమును  జ్ఞప్తికి తెచ్చుకొనుము.

26.        ఉదయసాయంకాలముల మధ్యలోనే

               పరిస్థితులు మారిపోవచ్చును.

               ప్రభువు తలప్టిెనపుడు మార్పు

               అతి శీఘ్రముగా కలుగును.

27.         జ్ఞాని తన కార్యములన్నింటను జాగ్రత్తగానుండును

               పాపము విస్తరించియున్నపుడు

               అతడు మెలకువతో దోషమునుండి వైదొలగును.

28.        తెలివికలవాడెవడైనను విజ్ఞానమును గుర్తించును

               విజ్ఞానము కలవానిని గౌరవించునుకూడ.

29.        విజ్ఞానమును అభిమానించువారు

               విజ్ఞానవేత్తలగుదురు.

               వారి పలుకులు విజ్ఞాన సూక్తులగును.  

30.        కామమునకు  లొంగవలదు.

               ఆశాపాశములను జయింపుము.

31.          నీలోని ఆశలకు లొంగిపోయెదవేని

               నీ శత్రువులు నిన్ను చూచి నవ్వుదురు.

32.        సుఖభోగములకు దాసుడవు కావలదు.

               భోగజీవనము వలనయగు ఖర్చులు

               నిన్ను గుల్లజేయును.

33.        నీ చేత డబ్బు లేనపుడు అప్పులుచేసి

               విందులారగించి బిచ్చగాడివై పోవలదు.