యిష్మాయేలు జననము

1. అబ్రామునకు సారయియందు సంతానము కలుగలేదు. ఆమెకు ఐగుప్తుదేశీయురాలయిన ఒక దాసీకన్య ఉండెను. ఆమె పేరు హాగారు.

2. సారయి అబ్రాముతో ”దేవుడు నన్ను బిడ్డలతల్లిగా చేయలేదు. నా దాసీకన్యను భార్యగా స్వీకరింపుము. ఆమె వలననైన నాకు సంతానము కలుగునేమో!” అనెను. అబ్రాము భార్యచెప్పిన మాటలకు ఒప్పుకొనెను1. 3. అబ్రాము భార్య సారయి, ఐగుప్తు దేశీయురాలు దాసీ కన్య హాగారును కొనివచ్చి అతనికి భార్యగా చేసెను. ఇది జరుగు నాికి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు నివసించెను.

4. అతడు హాగారును కూడెను. ఆమె గర్భవతి అయ్యెను. చూలాలైన నాినుండి యజమానురాలు హాగారు కింకి చులకన అయ్యెను.

5. సారయి అబ్రాముతో ”నాకు ఎంతపని జరిగినదో చూచితివా? ఈ అవమానమును తీర్ప వలసినవాడవు నీవే. ఆ బానిసతొత్తును నేనే నీ చేతులలో ప్టిెతిని. అది నేను గర్భవతినైతిని గదా అని కన్నుమిన్నుగానక నన్నే చిన్నచూపు చూచు చున్నది. దేవుడే మనకిద్దరకు తీర్పుచెప్పునుగాక!” అనెను.

6. అబ్రాము సారయితో ”నీ దాసి నీ చెప్పు చేతలలోనే ఉన్నది. దానిని నీ ఇష్టము వచ్చినట్లు చేయుము” అనెను. సారయి ఆ దాసిని నేలబ్టెి కాలరాచెను. ఆమె బాధలు పడలేక పారిపోయెను.

7. ఎడారియందు షూరునకు పోవు త్రోవలో నున్న నీిబుగ్గచెంత యావేదూత హాగారును చూచెను.

8. అతడు ”సారయి దాసివగు హాగారు! నీవు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి పోవుచుింవి?” అని అడిగెను. ఆమె ”నా యాజమానురాలు సారయి పోరు పడలేక పారిపోవుచున్నాను” అని చెప్పెను.

9. అంతట యావేదూత ఆమెతో ”తిరిగి నీ యజమానురాలి దగ్గరకు పొమ్ము. ఆమెకు అణగిమణగి ఉండుము. ఇంకను వినుము.

10. నీ సంతతిని లెక్కకు మిక్కిలి అగునట్లు చేయుదును, నిశ్చయముగ విస్తరింప జేసెదను” అనెను.

11. మరియు యావేదూత ఆమెతో ఇట్లనెను: ”నీవు గర్భవతివి. నీకు కుమారుడు కలుగును. దేవుడు నీ మొర ఆలకించెను గావున ఆ బిడ్డకు యిష్మాయేలు2 అను పేరు పెట్టుము.

12. అతడు అడవిగాడిదవలె స్వేచ్ఛగా తిరుగును. అతడు అందరిమీద చేయిచేసికొనును. అందరు వానిమీద చేయిచేసికొందురు. అతనికి, అతని చుట్టపక్కాలకు సుతికలియదు”

13. ఆమె తనతో మ్లాడిన దేవుని ”ఎల్‌రోయి” అను పేరున పిలిచెను. ”నిజముగా నేను నా కింతో దేవుని చూచితినిగదా! దైవదర్శనమైన తరువాత కూడ నేనింకను బ్రతికియుింనిగదా!” అనుకొనెను.

14. అందుచే జనులు  ఆ  నీిబుగ్గకు  ”బేయెర్‌- లహాయిరోయి”3 అనుపేరు ప్టిెరి. అది కాదేషునకు  బెరెదునకు నడుమ ఉన్నది.

15. హాగారు అబ్రాము నకు ఒక కొడుకును కనెను. అబ్రాము తనకు హాగారు నకు ప్టుిన కుమారునకు యిష్మాయేలు అను పేరు పెట్టెను.

16. హాగారు యిష్మాయేలును కన్నప్పుడు అబ్రాము వయస్సు ఎనుబదియారేండ్లు.

Previous                                                                                                                                                                                                    Next                                                                                     

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము