పరిచర్యను గూర్చిన మరికొన్ని నియమములు
1. నిత్యము వెలిగెడి దీపము
24 1. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: 2. ”దీపములు వెలిగించుటకు శ్రేష్ఠమైన ఓలివుతైలమును కొనిరమ్మని యిస్రాయేలీయులతో చెప్పుము. అచట ఒక దీపము నిత్యము వెలుగుచుండవలయును.
3. గర్భగృహములోని నిబంధన మందసమునకు ముందట నున్న అడ్డుతెర ఎదుట అహరోను ఈ దీపమును వెలిగించుచుండవలయును. అది నిత్యము ప్రభువు ఎదుట సాయంకాలమునుండి ఉదయము వరకు వెలుగుచుండవలయును. ఇది శాశ్వతనియమము కావలయును.
4. అతడు పరిశుద్ధమైన దీపస్తంభము పైనున్న ప్రదీపములను నిత్యము ప్రభునియెదుట వెలుగునట్లు చక్కదిద్దవలయును.
2. సమర్పణ రొట్టెలు
5. గోధుమపిండితో పండ్రెండు రొట్టెలు చేయుడు. ఒక్కొక్క రొట్టెకు శేరుపిండి ఉండవలయును.
6. ఒక్కొక్క వరుసలో ఆరేసి రొట్టెల చొప్పున వానిని రెండువరుసలుగా ప్రభువు సన్నిధిలోనున్న బంగారు బల్లపై పేర్చుడు.
7. ఆ రెండు వరుసలమీద మేలిమి సాంబ్రాణిని పోయుడు. ఈ సాంబ్రాణి ప్రభువునకు అర్పించు నైవేద్యమునకు చిహ్నముగా నుండును. రొట్టెలకు మారుగా దానిని ప్రభువునకు దహనబలిగా అర్పింపవలయును.
8. కలకాలము ప్రతి విశ్రాంతి దినమున యిస్రాయేలీయుల సమాజమునుండి యాజకుడు ఈ రొట్టెలను తీసుకొని ప్రభువునెదుట ఉంచవలయును. యిస్రాయేలీయులు ఈ నిబంధనను శాశ్వతముగా పాింపవలయును.
9. ఈ రొట్టెలు అహరోనునకు అతని సంతతి వారలకు చెందును. ఇవి ప్రభువునకు అర్పింపబడిన నైవేద్యము లలో అతిపవిత్రములైనవి. కనుక యాజకులు వీనిని పవిత్రస్థలముననే భుజింపవలయును.”
దైవదూషణమునకు శిక్ష
10-11. ఒక యిస్రాయేలు వనితకు ఐగుప్తీ యునివలన ప్టుిన కుమారుడు ఒకడుండెను. ఆ వనిత పేరు షెలోమీతు, దాను వంశజుడైన దిబ్రి కుమార్తె. అతడు శిబిరమున ఎల్లరును చూచుచుండగా తోి యిస్రాయేలీయునితో ప్లోాడెను. ఆ కలహమున అతడు దేవునినామమును దూషించెను. కనుక అతనిని మోషేయొద్దకు కొనివచ్చిరి.
12. ప్రభువు చిత్తము తెలియువరకు అతనిని కావలిలో ఉంచిరి.
13. అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను.
14. ”ఆ దైవదూషకుని శిబిరము వెలుపలికి కొని పొండు. అతని దూషణమును వినినవారందరు వాని తలమీద చేతులుమోపి అతడు దోషియని నిర్ధారింపుడు. అటుపిమ్మట సమాజమంతయు వానిని రాళ్ళతోక్టొి చంపవలయును.
15. నీవు యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. దేవుని దూషించువాడు తన తప్పునకు తాను బాధ్యు డగును.
16. అి్టవానిని ప్టి చంపవలయును. సమాజమంత అతనిని రాళ్ళతో క్టొి చంపవలయును. యిస్రాయేలీయులుకాని, వారితో వసించు పరదేశులు కాని ప్రభునామమును దూషింతురేని వారిని తప్పక వధింపవలయును.
17. నరహత్యచేసిన వానిని వధింపవలయును.
18. కాని ఇతరుని పశువును చంపినవాడు, మరియొక పశువును పరిహారముగా ఈయవలయును. ప్రాణికి బదులుగా ప్రాణిని యిచ్చుట విధి.
19. ఎవడైన ఇతరునిమీద చేయిచేసికొనినచో, అతని మీదకూడ అట్లే చేయిచేసికోవలెను.
20. అతడు విరుగగ్టొినచో, అదేవిధమున అతనిని విరుగగొట్ట వలయును. ఇతరుని కింనిగాని, పింనిగాని పోగ్టొినచో, వాని కింకిని, పింకిని అదే గతి ప్టింపవలయును. అతడు చేసిన హానికి ప్రతిహాని చేయవలయును. 21. పశువును చంపినవాడు మరి యొక పశువును ఈయవలయును. కాని మనుష్యుని చంపినవానిని చంపవలయును.
22. యిస్రాయేలీయులకును, వారిచెంత వసించు పరదేశులకును ఇదే నియమము చెల్లును. నేను మీ దేవుడనైన ప్రభుడను.”
23. మోషే ఈ మాటలను యిస్రాయేలీయులకు వినిపింపగా వారు దైవదూషకుని శిబిరము వెలుపలికి కొనిపోయి రాళ్ళతోక్టొి చంపిరి. ఈ రీతిగా యిస్రా యేలీయులు ప్రభువు మోషేకు ఆజ్ఞాపించినట్లు పాించిరి.