10 1. ఈగలు పడి చచ్చిన  బుడ్డిలోని పరిమళ తైలమంతయు పాడగును. ఈ రీతిగనే కొద్దిపాి బుద్ధిహీనత నరుని మహావిజ్ఞానమును గూడ నాశనము చేయును.

2.           విజ్ఞాని బుద్ధి అతనిని తిన్నగా నడిపించును.

               మూర్ఖుని బుద్ధి అతనిని పెడత్రోవ ప్టించును.

3. దారివెంట నడచునప్పుడు కూడ మూర్ఖునికి వివేకము చాలదు. కనుక ఎల్లరును అతని బుద్ధిహీన తను గుర్తింతురు.

4. రాజునకు నీ మీద ఆగ్రహము కలిగినచో నీవు నీ ఉద్యోగమునకు రాజీనామా చేయవలదు. నీవు నెమ్మదిగా నుందువేని పెద్దతప్పులుకూడ మన్నింప బడును.

5. రాజు అవివేకము వలన ఉత్పన్నమైన అనర్థము నొకదానిని నేను గమనించితిని.

6. బుద్ధి హీనులకు పెద్ద ఉద్యోగములు లభింపగా, ధనికులు క్రింది స్థానములోనే ఉండిపోయిరి.

7. బానిసలు గుఱ్ఱముల నెక్కి తిరుగగా, రాజకుమారులు బానిసలవలె కాలి నడకన పోయిరి.

8. గోతిని త్రవ్వువాడు దానిలోనే కూలును, కంచె కొట్టువానిని పాము కరచును.

9. రాళ్ళు కొట్టువాడు రాతి వలననే గాయపడును.

చెట్లు నరుకువానికి వానివలననే దెబ్బ తగులును.

10. పదును ప్టిెంపనందున గొడ్డలి మొద్దు బారెనేని ఎక్కువ బలముతో నరకవలసి యుండును. ముందుగా జాగ్రత్త పడువానికి ఫలితము కలుగును.

11. మంత్రపుకట్టు లేక పాము కరిచినచో మంత్రగాని వలనను లాభము లేదు.

12.బుద్ధిమంతుని పలుకులు అతడికి గౌరవము తెచ్చిపెట్టును.

               మూర్ఖుని పలుకులు అతనికి నాశనము తెచ్చిపెట్టును.

13. మూర్ఖుని మాటలు బుద్ధిహీనతతో ప్రారంభ మగును, వెఱ్ఱితనముతో ముగియును.

14. మూర్ఖుడు ఎడతెరపి లేకుండ మ్లాడును. నరునికి భవిష్యత్తులో ఏమిజరుగునో తెలియదు.తన మరణము తరువాత ఏమి జరుగునో అతనికి తెలియదు.

15. మూర్ఖుని ప్రయాస తుదకు ఇంికి తిరిగివచ్చుటకు త్రోవతెలిసికోలేనంతగా అతనిని అలసటకు గురిచేయును.

16. ఏ దేశమున యువకుడు రాజగునో, రాజోద్యోగులు రేయెల్ల విందులుచేసికొందురో, ఆ దేశము నాశన మగును.

17. అభిజాతుడైన రాజు రాజ్యము చేయు దేశము, రాజోద్యోగులు త్రాగుబోతులుగాక మితముగా భుజించు రాజ్యము, భాగ్యములు బడయును.

18.ఇంి యజమాని సోమరియైనచో ఇంి కప్పులు కూలును. ఇల్లు వానకు కారి నేలమట్టమగును.

19. విందులు ఆరగించుటవలన సంతసమును, మద్యము సేవించుటవలన ఆనందమును కలుగును, కాని ఇవన్నియు ధనము వలననే సాధ్యపడును.

20.నీ మనసులోగూడ రాజును విమర్శింపకుము. ఏకాంతముననైన ధనికులను దూయబట్టకుము.

ఆకాశపకక్షులు నీ మాటలను వారి చెంతకు కొనిపోవును. రెక్కలుగల ప్రాణి నీ పలుకులను వారికెగిరించును.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము