రాజును, యాజకుడునైన మెస్సయా

దావీదు కీర్తన

110  1.    ప్రభువు నా ప్రభువుతో ఇట్లనెను:

                              ”నేను నీ శత్రువులను నీకు

               పాదపీఠముగా చేయువరకు

               నీవు నా కుడిపార్శ్వమున ఆసీనుడవు కమ్ము”

2.           ప్రభువు సియోనునుండి

               నీ రాజ్యాధికారమును విస్తృతము చేయును. నీవు నీ శత్రువులను పరిపాలింపుమని

               ఆయన వాకొనును.

31.          యుద్ధసన్నాహ దినమున నీ ప్రజలు

               ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై

               అరుణోదయ గర్భములోనుండి పుట్టు

               మంచుబిందువులవలె నీయొద్దకు వచ్చెదరు.

4.           ప్రభువు బాసచేసెను, అతడు మాట తప్పడు. ”నీవు మెల్కీసెదెకువలె యాజకత్వమును బడసి

               కలకాలము యాజకుడవుగానుందువు.”

5.           ప్రభువు నీ కుడిపార్శ్వమున ఉన్నాడు.

               ఆయనకు కోపము వచ్చినపుడు

               రాజులను నాశనము చేయును.

6.           అతడు జాతులకు తీర్పుచెప్పును.

               యుద్ధభూమిని శవములతో నింపును.

               భూమిమీద రాజులనెల్ల ఓడించును.

7.            దారిప్రక్కనున్న యేినుండి నీళ్ళు త్రాగి

               విజయసిద్ధివలన తలయెత్తుకొని నిలబడును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము