యోబు బాధలకు కారణము అతని పాపములే
36 1. ఎలీహు తన సంభాషణనిట్లు
కొనసాగించెను:
2. ”నీవు నా పలుకులను ఓపికతో ఆలకింపుము.
దేవునిపక్షమున నేనింకను మ్లాడవలసిఉన్నది.
3. నన్ను సృజించిన దేవుడు న్యాయము తప్పడని
నిరూపించుటకు బహువిస్తృతమైన
నా జ్ఞానమునుండి వాదములు చూపుదును.
4. నా వాదములలో తప్పులేమి ఉండబోవు.
నీతో మ్లాడునది విజ్ఞానవేత్తయని ఎరుగుము.
5. దేవుడు బలాఢ్యుడు,
ఎవరిని చిన్నచూపు చూడనివాడు.
ఆయనకు అన్ని విషయములు తెలియును.
6. ఆయన పాపులను దీర్ఘకాలము మననీయడు.
పేదలకెల్లపుడు న్యాయము జరిగించును.
7. ధర్మాత్ములను కాచి కాపాడును.
రాజులను సింహాసనమెక్కించును,
ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును.
వారు ఘనపరపబడుదురు.
8. కాని వారు గొలుసులతో బంధింపబడి
బందీలుగా బాధపడుచుండిన
9. ఆ రాజులు చేసిన దుష్కార్యములను
వారి అహంకారపు పోకడలను దేవుడు
వారికి జ్ఞప్తికి తెచ్చును.
10. వారు తన హెచ్చరికలను ఆలకించి
పాపము నుండి వైదొలగునట్లు చేయును.
11. ఆ రాజులు దేవునిమాట విందురేని
సంతోషముతోను, సిరిసంపదలతోను
జీవించుదురు.
12. వారు ఆలకింపనియెడల బాణములచేత
కూలినశించెదరు.
జ్ఞానములేక చనిపోయెదరు.
13. దుర్మార్గులు దేవునిమీది కోపముతోనే
కాలము వెళ్ళబుచ్చుదురు.
ప్రభువు తమను శిక్షించినా
వారు ఆయన సాయమును అర్థింపరు.
14. అవమానముతో కూడిన జీవితమును
భరింపజాలక చిన్నవయస్సుననే
కన్ను మూయుదురు.
15. ఆయన శ్రమలద్వారా నరులకు
పాఠములు నేర్పును.
బాధలద్వారా వారి కన్నులు తెరిపించును.
16. పూర్వము దేవుడు నిన్ను ఇక్కట్టులనుండి
గట్టెక్కించి సురక్షితముగా కాచి కాపాడెను.
నీకు సమృద్ధిగా భోజనము దయచేసెను.
17. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది.
తీర్పు, న్యాయము నిన్ను చుట్టుముట్టును.
18. ఇకమీదట సంపదలను ఆశించి
అపమార్గము త్రొక్కకుము.
లంచములకు భ్రమసి మోసపోకుము.
19. నీ సంపదలు నీకు ఉపయోగపడవు.
నీ అధికారము నిన్ను రక్షింపజాలదు.
20. రాత్రివేళ రాజ్యములే మటుమాయమైనచో
నీవేమీ ఆశ్చర్యపడనక్కరలేదు.
21. నీవు దుష్కార్యములనుండి వైదొలగుము.
చెడునడతయే నీ ఈ బాధలకు కారణమని
ఎరుగుము.
దేవుని విజ్ఞానము, మహాశక్తి
22. దేవుని శక్తి గొప్పది.
ఆయనవిం బోధకుడు ఎవడును లేడు.
23. ‘నీవ్టి కార్యము చేయుము’ అని
ఆ ప్రభువునకు ఉపదేశము చేయువాడెవడు లేడు.
ఆయన పనులను తప్పు పట్టువాడెవడును లేడు.
24. ప్రభువు చేసిన కార్యములకుగాను
ఎల్లరు ఆయనను కొనియాడిరి కనుక
నీవు ఆయనను సన్నుతింపుము.
25. ఆయన కార్యముల నెల్లరును వీక్షించిరి.
దూరమునుండి మాత్రమే
మన మీ కార్యములు చూడగలము.
26. దేవుని మహత్త్వమును మనము అర్థము
చేసికోజాలము.
అతనికెన్ని యేండ్లున్నవో గణించి చెప్పజాలము.
27. ప్రభువు నేలమీదినుండి నీిని చేకొని
దానిని వానబొట్టులుగా మార్చివేయును.
28. మబ్బులలోనుండి నీిని కురియించి,
నరులందరికి వర్షమును దయచేయును.
29. ఆకాశమున మబ్బులెట్లు తిరుగాడునో
అంతరిక్షమున ప్రభువు నివాసము చుట్టు
ఉరుములెట్లు గర్జించునో ఎవరికి తెలియును?
30. అతడు ఆకాశమును మెరుపులతో నింపును.
అగాధ సముద్రమునెట్లు కప్పివేయునో చూడుడు.
31. వీి ద్వారా ఆ ప్రభువు ఆహారమును
సమృద్ధిగా దయచేసి నరులకు తీర్పు ఇచ్చును.
32. మెరుపులను గుప్పిట పట్టుకొని అవి తాము
చేరవలసిన గమ్యమును చేరునట్లు చేయును.
33. ఉరుములు రాబోవు ఆయన రాకడను
తెలియజేయును.
పశువులుకూడ
ఆ రాకడను ముందుగనే గుర్తించును.