అంతము సమీపించినది

7 1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 2. ”నరపుత్రుడా! ప్రభుడనైన నేను యిస్రాయేలు దేశముతో ఇట్లు  చెప్పు చున్నాను. దేశమంతికిని అంతము సమీపించినది.

3. యిస్రాయేలూ! నీ అంతము సమీపించినది. నేను నా ఆగ్రహమును నీ మీదికి రప్పింతును. నీ దుష్కార్య ములకు ప్రతిగా నిన్ను దండింతును. నీ హేయమైన పనులకు నీవు ప్రతిఫలము అనుభవింతువు.

4. నేను నిన్నువదలను, నీపై జాలిచూపను. నీవుచేసిన హేయమైన పనులకు గాను నేను నిన్ను దండింతును. అప్పుడు నీవు నేను ప్రభుడనని గుర్తింతువు.

5. యావే ప్రభువిట్లు పలుకుచున్నాడు: వినాశన ములు వరుసగా నీ మీదికి వచ్చును.

6. అంతము వచ్చుచున్నది. రానే వచ్చినది.

7. ఈ దేశమున వసించు ప్రజలారా! అంతము వచ్చుచున్నది. ఆ దినము సమీపించినది. పర్వతముల మీది దేవళ ములలో ఇక ఉత్సవములు జరుగవు. గందరగోళము చూపట్టును.

8. నేను తక్షణమే నా కోపమును మీపై కుమ్మరింతును. నీ దుష్కార్యములకు గాను నీకు తీర్పు విధింతును. నీ హేయమైన పనులకు నీవు ప్రతి ఫలమును అనుభవింతువు.

9. నేను నిన్ను విడువను, నీపై జాలిచూపను. నీ దుష్కార్యములకును, నీ హేయ మైన పనులకును నిన్ను దండింతును. అప్పుడు నేను ప్రభుడననియు, నిన్ను శిక్షించువాడననియు నీవు గ్రహింతువు.

10. ఇదిగో! ఆ దినము, అది వచ్చియేయున్నది. అన్యాయము మొలకెత్తినది. హింస పెచ్చరిల్లుచున్నది. అహంభావము మొగ్గతొడిగినది. గర్వము తాండవించు చున్నది.

11. హింస దుష్క ృత్యములను అధికము చేయుచున్నది. కాఠిన్యమను కొమ్మ దిన దినాభివృద్ధి చెందుచున్నది. ఈ ప్రజల వస్తువులేమియు మిగులవు. వీరి ఆస్తి, కీర్తి అన్నియు నాశనమగును. కడకు వీరును నశింతురు.

12. కాలము సమీపించినది. ఆ రోజు  వచ్చినది. ప్రభువు కోపము అందరిమీదికి దిగి వచ్చును. కనుక ఆస్తి అమ్మువారు దుఃఖింప నక్కర లేదు. కొనువారు ఆనందపడనక్కరలేదు.

13. అమ్మువాడు తాను పోగొట్టుకొనినదానిని తిరిగి పొంద జాలడు. ప్రభువు కోపము అందరిపై దిగివచ్చును. దుష్టులు శిక్షను తప్పించుకోజాలరు.

14. ”బాకా నూదగా ఎల్లరును పోరునకు సిద్ధమగుదురు. కాని ప్రభువు కోపమెల్లరిపై విరుచుకుపడునుగాన, ఎవ రును యుద్ధమునకు పోజాలరు.

యిస్రాయేలు పాపములు

15. నగరము వెలుపల పోరు జరుగుచున్నది. లోపల రోగములు, ఆకలి పీడించుచున్నవి. బయట పొలముననున్న వారు పోరున చత్తురు. నగరము లోపల ఉన్నవారు ఆకలివలనను, రోగమువలనను చత్తురు.

16. లోయలో నుండి బెదరిన పావురములవలె కొందరు కొండలకు పారిపోవుదురు. ఎల్లరును తమ పాపములకు విలపింతురు.

17. ఎల్లరి చేతులును చచ్చుపడును. మోకాళ్ళు గడగడవణుకును.

18. వారు గోనెతాల్చి భీతితో కంపింతురు. వారి తలలను గొరిగి వేయుదురు. కాన అవమానము తెచ్చుకొందురు. 19. వారు తమ వెండిబంగారములను కసవువలె వీధు లలో పారవేయుదురు. ప్రభువు కోపము వారిపై దిగి వచ్చినపుడు అవి వారిని రక్షింపలేవు. అవి వారి కోరి కలను ఆకలిని తీర్చలేవు. అవి వారిని పాపమునకు ప్రేరేపించెను.

20. పూర్వము వారు తమ ఆభరణ ముల సౌందర్యమును చూచి గర్వపడిరి. కాని వారు ఆ నగలతో హేయమైన ప్రతిమలను చేసికొనిరి. కనుక ప్రభువు ఆ సొత్తు వారికి అసహ్యకరమగునట్లుచేసెను.”

21. ప్రభువు ఇట్లు అనుచున్నాడు. ”నేను అన్య జాతి ప్రజలు వారిని దోచుకొనునట్లు చేయుదును. బందిపోటుదొంగలు  వారి  సొత్తును కొల్లగ్టొి దానిని అపవిత్రము చేయునట్లు చేయుదును.

22. దొంగలు నాకు ప్రీతిపాత్రమైన దేవాలయమును అపవిత్రము చేయునపుడు, దానిలో ప్రవేశించి దానిని మలినము చేయునపుడు, నేను ప్టించుకొనను.           

23. దేశము రక్తముతో నిండియున్నది. పొలము నరహంతకులతో నిండియున్నది. నగరమున హింస జరుగుచున్నది. సంకెళ్ళు సిద్ధముచేయుడి.

24. నేను క్రూరజాతులను ఇచికి కొనివత్తును. వారు మీ ఇండ్లను ఆక్రమించుకొందురు. మీ బలాఢ్యులు నమ్మ కమును కోల్పోవుదురు. పరజాతివారు మీ ఆరాధనా స్థలమును అపవిత్రము చేయుదురు.

25. నిరాశ మీ మీదికి ఎత్తివచ్చును. మీరు శాంతిని బడయగోరు దురు కాని అది మీకు దుర్లభమగును.

26. వినాశన ములు ఒకదానివెంట ఒకి మీమీదికి వచ్చును. దుర్వార్తలు నిరంతరము వినిపించును. మీరు ప్రవక్తలను దర్శనములు చెప్పుమందురు. యాజకులు ప్రజలకేమియు బోధింపలేరు. వృద్ధులు ఉపదేశము చేయలేరు.

27. రాజు శోకించును. అధిపతులు నిరాశ చెందుదురు. ప్రజలు భీతితో వణకుదురు. నేను మీ దుష్కార్యములకుగాను మిమ్ము శిక్షింతును. మీరు ఇతరులకు తీర్పుతీర్చునట్లే నేనును మీకు తీర్పుతీర్తును. దీనివలన నేను ప్రభుడనని మీరు గ్రహింతురు.”