దేవుని పర్వతమైన సియోను

కోర కుమారులు రచించిన గీతము

48 1.      ప్రభువు ఘనుడు. మన దేవుని

                              పట్టణమునను, ఆయన పవిత్ర

                              పర్వతము మీదను ఆ ప్రభువును

                              ఘనముగా కీర్తింపవలయును.

2.           దైవనిలయమైన సియోను ఉన్నతమును,

               సుందరమునైన పర్వతము.

               విశ్వధాత్రికి అది ప్రమోదము చేకూర్చును.

               అది ఉత్తర దిక్కునగల మహారాజు నగరము.

3.           ఈ నగరదుర్గములందు ప్రభువు

               తన రక్షణను వెల్లడిచేసెను.

4.           రాజులు ఏకమై సియోనుమీదికి దండెత్తి వచ్చిరి.

5.           వారు ఆ పురమును జూచి విస్తుపోయిరి,

               భయపడి పారిపోయిరి.

6.           ఆ పట్టణమును గాంచి గడగడ వణకిరి.

               ప్రసవవేదనము అనుభవించు

               స్త్రీవలె బాధ చెందిరి.

7.            తర్షీషునకు పోవు నావలు తూర్పు గాలికి

               కంపించునట్లు వారు కంపించిరి.

8.           దేవుడు చేసిన కార్యమును

               మనము ముందే వినియుింమి.

               సైన్యములకు అధిపతియైన ప్రభుని పట్టణమున

               ఇప్పుడా సంఘటనను కన్నులారా చూచితిమి.

               దేవుడు ఆ నగరమును కలకాలము కాపాడును.

9.           ప్రభూ! మేము నీ దేవాలయమున

               నీ ప్రేమను ధ్యానించుకొందుము.

10.         నీ కీర్తివలె నీ నామము

               నేలఅంచుల వరకు వ్యాపించును.

               నీ కుడిచేయి విజయముతో నిండియున్నది.

11.           నీ తీర్పు, కట్టడలు ధర్మబద్ధమైనవి కనుక

               సియోను పర్వతము, యూదా

               నగరములు హర్షించును.

12.          సియోను చుట్టును తిరిగి

               దాని బురుజులను లెక్కపెట్టుడు.

13.          దాని కోటగోడను గమనింపుడు.

               దాని దృఢత్వమును పరిశీలింపుడు.

14.          అప్పుడు మీరు ఈ దేవుడు కలకాలము

               మనకు దేవుడగునని

               రాబోవు తరముల వారికి

               తెలియచేయ గలుగుదురు.

               అతడెల్లకాలము మనకు  

               మార్గదర్శియై నడిపించును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము