గిబియా పౌరుల దుష్కార్యము, బెన్యామీనీయులపై యుద్ధము
ఎఫ్రాయీము లేవీయుడు
19 1. యిస్రాయేలీయులకు రాజు లేని దినము లలో, ఎఫ్రాయీము కొండసీమలో లేవీయుడు ఒకడు పరదేశిగా వసించుచుండెను. అతడు యూదా బేత్లెహే మునకు చెందిన ఒక ఉంపుడుగత్తెను భార్యగా1 చేకొనెను.
2. ఒకమారు ఆమెభర్త మీద కోపపడి ప్టుినింకి వెళ్ళిపోయి నాలుగు నెలలపాటు అచటనే యుండెను.
3. లేవీయుడు భార్యతో ప్రియముగా మాటలాడి ఆమెను మరల తీసికొని వత్తును అనుకొని సేవకుని, రెండు గాడిదలను వెంటపెట్టుకొని బేత్లెహే మునకు వచ్చెను. మామ అతనిని అల్లంతదూరమున నుండగనే చూచి సంతోషముతో ఎదురువచ్చెను.
4. అల్లుని అన్ని మర్యాదలతో సత్కరించెను. లేవీయుడు అచట మూడునాళ్ళుండెను. వారు అచటనే అన్నపానీ యములు పుచ్చుకొని రేయిగడిపిరి.
5. నాలుగవనాడు వేకువనే మేల్కొనిరి. లేవీయుడు ప్రయాణమునకు సంసిద్ధుడగుచుండగా మామ ”పిడికెడు మెతుకులుతిని సత్తువ దెచ్చుకొనుము. తరువాత సాగిపోవచ్చును” అనెను.
6. కనుక వారిద్దరు భోజనమునకు కూర్చుండి అన్నపానీయములు పుచ్చుకొనిరి. మామ అల్లునితో ”ఈ రాత్రికి నిలువుము ఇచట హాయిగా నుండి పోవచ్చును” అనెను.
7. లేవీయుడు వలదువలదనుచు ప్రయాణము కట్టబోయెను గాని మామ బలవంతము చేయుటచే ఆరాత్రికి ఆగిపోయెను.
8. ఐదవనాడు లేవీయుడు తెల్లవారకముందే లేచి ప్రయాణమునకు సిద్ధపడుచుండగా మామ కొంచెము అన్నము పుచ్చు కొమ్మని బతిమాలెను. వారు, మ్లాడుచు సాయంత్రము వరకు ప్రొద్దుపుచ్చిరి. మామ అల్లుడు కలిసియే భుజించిరి.
9. అంతట లేవీయుడు భార్యను సేవకుని తీసికొని పయనము కాబోగా మామ ”ఇపుడు ప్రొద్దు గ్రుంక బోవుచున్నది. హాయిగా ఈ రేయి యిట గడు పుము. రేపు వేకువనేలేచి మీ ఇంికి వెడలిపోవ చ్చును” అనెను.
10. కాని లేవీయుడు ఆ రాత్రి అచట గడుపుటకు అంగీకరింపలేదు. అతడు ప్రయాణము క్టి, జీను కట్టబడిన రెండు గాడిదలు మరియు అతని భార్యతో, సేవకునితో యెబూసు పట్టణము దాపునకు వచ్చెను. (అదియే యెరూషలేము).
గిబియా పౌరుల దుష్కార్యము
11. వారు యెరూషలేము చేరునప్పికి ప్రొద్దు వ్రాలుచుండెను. కనుక సేవకుడు ”అయ్యా! రాత్రికి ఈ యెబూసీయుల పట్టణమున బసచేయుదము రమ్ము” అనెను.
12-13. కాని యాజకుడు ”మనము యిస్రాయేలీయులు కాని అన్యజాతి జనుల పట్టణము లకు పోరాదు. గిబియాకు వెళ్ళుదముపద. గిబియా గాని, రామాగాని చేరుకొని అట బసచేయవచ్చును” అనెను.
14. కనుక వారు ప్రయాణము సాగించిరి. ఆ బాటసారులు బెన్యామీనీయుల గిబియా చేరుకొను నప్పికి ప్రొద్దుక్రుంకెను.
15. రేయి అచట గడుపు దము అనుకొని వారు పట్టణమున ప్రవేశించిరి. లేవీయుడు రచ్చపట్టున నడివీధిలో కూర్చుండెనుగాని, రాత్రికి మా ఇంికి రమ్మని పిలిచిన దిక్కులేదు.
16. కొంచెము సేపయిన తరువాత పొలముపని చాలించుకొని తిరిగివచ్చు ముదుసలి ఒకడు వారి కంటబడెను. అతడు ఎఫ్రాయీము కొండసీమ నుండి వలసవచ్చి ఆ బెన్యామీనీయుల నగరమున వసించు చుండెను.
17. ఆ ముదుసలి ఎగాదిగా పారజూచి ఎవరో బాటసారి నగరము నడివీధిలో కూర్చుండి యున్నాడని గ్రహించి ”అయ్యా! నీ వెచ్చినుండి వచ్చు చున్నావు? ఎచ్చికి వెళ్ళుచున్నావు?” అని అడిగెను.
18. బాటసారి ”మేము యూదాబేత్లెహేము నుండి ఎఫ్రాయీము పర్వతసీమల ఆవలికి వెళ్ళుచున్నాము. నేను అచివాడను. నేను యూదా బేత్లెహేమునకు వెళ్ళితిని. ఇపుడు యావే ఆలయమునకు పోవుచున్నాను. కాని ఈ ఊరిలో మీరు రాత్రికి మా ఇంికిరండు, అని పిలిచిన దిక్కులేదు.
19. మా గాడిదలకు గడ్డి, ధాన్యము కలవు. నాకు, ఈ నీ దాసురాలికి, మావెంట వచ్చు ఈ సేవకునికి సరిపోవునంత రొట్టె, ద్రాక్షసారా యము కలవు. ఇక మాకేమియు అక్కరలేదు” అనెను.
20. ముదుసలి ”మీరు మా ఇంికి రండు. నేను మీకు ఏ కొరత కలుగనీయను. రాత్రి వీధులలో పడియుండనేల?” అనెను.
21. వారిని తన ఇంికి కొనిపోయి గాడిదలకు మేత వేయించెను. అతిథులు కాళ్ళుగడుగుకొని అన్నపానీయములు పుచ్చుకొనిరి.
22. అటుల వారు ఆ ఇంట సుఖముగానుండగా నగరమునందలి ముష్కరులు కొందరు గుమిగూడివచ్చి ఆ ఇంిని చుట్టుమ్టుి తలుపు మీద దబదబబాదిరి. ఆ ఇంి యజమానుడైన ముదుసలితో ”నీ ఇంికి వచ్చిన మనుజుని ఇచటకు కొనిరమ్ము. మేము అతనిని కూడవలయును” అనిరి.
23. గృహయజమానుడు వెలుపలికివచ్చి ”నాయనలారా! ఇి్ట పాడుపని చేయు దురా? అతడు నా ఇంికి వచ్చిన అతిథి. మీర్టి దుష్కార్యమును తలపెట్టవలదు.
24. అదిగో కన్యక అయిన నా కుమార్తె మరియు ఆ మనుష్యుని భార్యను బయటకు కొనివత్తును. వారిని మీ ఇష్టము వచ్చినట్లు చేయుడు. కాని ఈ నరునికి మాత్రము చెడు తలపెట్ట కుడు”1 అని వారింపజొచ్చెను.
25. అయినను ఆ గుంపు వినిపించుకోలేదు. అపుడు లేవీయుడు తన భార్యను వెలుపలికి తీసికొనివచ్చి వారికి అప్పగించెను. ఆ దుర్మార్గులు ఆమెను కూడిరి. ఉదయమగువరకు ఆ రేయంతయు ఆమెను చెరిచి తెలతెలవారుచుండగా వారు ఆమెను విడిచివెళ్ళిరి.
26. ఆమె తెల్లవారు చుండగా లేచివచ్చి తన భర్తయున్న ఇంిద్వారము ముంగిటబడెను. ప్రొద్దుపొడుచువరకు అచటనే యుండెను.
27. ఉదయముననే లేవీయుడు ప్రయాణ మునకు సన్నద్ధుడై ఇంితలుపు తీసిచూడగా భార్య తలుపుచెంత పడియుండెను. ఆమె చేతులను గడప మీద చాపియుండెను.
28. అతడు ”లెమ్ము మనము వెళ్ళిపోవలెను” అనెను గాని ఆమెనోట మాటవెలువడ లేదు. అతడు ఆమె దేహమునెత్తి గాడిదమీదనుంచి ప్రయాణము కట్టెను.
29. ఇల్లుచేరుకొనిన తరువాత లేవీయుడు కత్తి తీసికొని ఏ అవయవమునకు ఆ అవయవము వచ్చునట్లుగా భార్యను పన్నెండు ముక్క లుగా కోసెను. ఆ ముక్కలను యిస్రాయేలు దేశము నలుమూలలకు పంపించెను.
30. అతడు దూతలను పంపుచు ”మీరు మన జనులెల్లరితో ‘యిస్రాయేలీ యులు ఐగుప్తునుండి వెడలివచ్చినప్పినుండి నేి వరకు ఇి్ట పాడుపనిని ఎందైన కింరా? మీరే స్వయముగా ఆలోచించి ఒకరితో ఒకరు సంప్రతించి జవాబునిండు’ అని చెప్పుడు” అనెను. ఆ సంగతి వినినవారందరు ”యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చిన నాినుండి య్టిిి దుష్కార్యమును కన్నదిలేదు, విన్నదిలేదు” అని జవాబుఇచ్చిరి.