తూరురాజు పొగరు

28 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. ”నరపుత్రుడా! ప్రభుడనైౖన నా పలుకులు తూరు రాజునకిట్లు వినిపింపుము:

               ”ఓయి! నీవు గర్వముతో పొంగిపోయి

               నేను దేవుడను అనుకొనుచున్నావు

               సాగరములనడుమ దేవునివలె

               సింహాసనముపై కూర్చుింనని తలంచుచున్నావు

               నేను దేవునితో సరిసమానుడనని ఎంచుచున్నావు.

               నీవు నరుడవు కాని దేవుడవుకావు.

3.           నీవు నేను దానియేలుకంటె తెలివైనవాడను

               నాకు తెలియని రహస్యములు

               లేవని తలంచుచున్నావు.

4.           నీవు తెలివితోను, నేర్పుతోను

               సంపదలు కూడబ్టెితివి.

               వెండి, బంగారు రాసులు ప్రోగుచేసితివి.

5.           నీవు నైపుణ్యముతో వర్తకముచేసి

               నీ ధనమును అభివృద్ధి చేసికొింవి.

               సంపదలవలన నీకు మిగుల పొగరెక్కినది.

6.           కనుక యావే ప్రభుడనైన నా వాక్కిది:

               నేను దేవునితో సరిసమానుడనని నీవెంచితివి.

7.            నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను

               నీ మీదికి రప్పింతును.

               వారు నీవు చాకచక్యముతో కూడబ్టెిన

               వైభవోపేతములైన వస్తువులన్నిని

               నాశనము చేయుదురు.

8.           వారు నిన్ను సంహరించి జలముల మధ్య

               అగాధపు గోతిలో పడద్రోయుదురు.

9.           నిన్ను సంహరించువారు నీ మీదికి వచ్చినపుడు

               నేను దేవుడనని నీవు చెప్పగలవా?

               నిన్ను హతము చేయువారు

               నీ మీదికి వచ్చినపుడు నీవు నరుడవే

               అవుదువుగాని,    దేవుడవు కాజాలవు.  

10.         సున్నతిలేనివారు చంపబడురీతిగా

               నీవు పరజాతి వారికిచిక్కి నీచమైన చావుచత్తువు.

               ఇది దేవుడైన ప్రభువు ఆజ్ఞ.”

తూరురాజు పతనము

11. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 12. ”నర పుత్రుడా! నీవు తూరు రాజును గూర్చి శోకాలాపము చేయుము. అతనితో యావే ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము:

               నీవు ఒకప్పుడు సర్వగుణ సంపూర్ణుడవు,

               మహాజ్ఞానివి, మహాసౌందర్యమూర్తివి.

13.          నీవు దేవుని వనమైన ఏదెనున వసించితివి.

               మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము,

               వజ్రము, కురవిందము, నీలము, పద్మరాగము,

               పచ్చ మొదలైన మణులను ధరించితివి.

               సువర్ణాభరణములు తాల్చితివి.

               నేను నిన్ను సృజించిన దినముననే

               అవియన్నియు తయారుచేయబడినవి.

14. నీకు కావలికాయుటకు

               ఒక కెరూబు దూతను నియమించితిని.

               నీవు నా పవిత్ర పర్వతముపై వసించుచు

               ధగధగ మెరయు మణులమధ్య

               తిరుగాడుచుింవి.

15.          నీవు జన్మించినప్పినుండియు

               సుచరిత్రుడవుగానే ఉంివి.

               కాని కొంతకాలమునకు చెడుకు పాల్పడితివి.

16. నీ వ్యాపారము పెరుగుట వలన

               నీవు హింసకును పాపమునకును ఒడిగ్టితివి.

               నేను నిన్ను నా పవిత్రనగరము నుండి గిెంవేసితిని.

               నీకు కావలియున్న  కెరూబుదూత, నిన్ను

               ధగధగ మెరయు మణులనుండి తరిమివేసెను.

17. నీవు నేను అందగాడనని గర్వించితివి.

               నీ కీర్తివలన నీకు తలతిరిగెను.

               నీ విజ్ఞానమంతరించెను.

               కావున నేను నిన్ను నేలమీద పడత్రోసితిని.

               ఇతరజాతులు నీ నుండి గుణపాఠము

               నేర్చుకొనునట్లు చేసితిని.

18.          వ్యాపారమున నీవు చేసిన అన్యాయముల వలన 

               నీ ఆరాధనా మందిరములు అపవిత్రమయ్యెను.

               కావున నేను నిన్ను సూచించు

               ఈ నగరమునకు నిప్పింంచి

               దానిని కాల్చివేసితిని.

               నీవైపు చూచువారందరును

               నీవు బుగ్గియైతివని గ్రహింతురు.

19.          జాతులలో నిన్నెరిగినవారు

               నిన్ను చూచి భీతిల్లుదురు.

               నీవు భీకరముగా అంతమొందితివి.

               శాశ్వతముగా కనుమరుగైపోతివి.”

సీదోను

20. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 21. ”నీవు సీదోనును ఖండింపుము.

22. దానికి నా పలుకులుగా ఇట్లు చెప్పుము:

               సీదోనూ! నేను నీకు శత్రువును అగుదును.

               నేను నిన్ను శిక్షించి కీర్తి తెచ్చుకొందును.

               నేను నిన్ను దండించి

               నా పావిత్య్రమును వెల్లడిచేసికొనినపుడు

               ప్రజలు నేను ప్రభుడనని గుర్తింతురు.

23.         నేను నీ మీదికి అంటురోగమును పంపుదును.

               నీ వీధులలో  నెత్తురు  పారును.

               శత్రువులు నలువైపుల నుండి నిన్ను ముట్టడించి,

               నీ ప్రజలను హతము చేయుదురు.

               అప్పుడు నేను ప్రభుడనని నీవు గుర్తింతువు.”

శత్రుపీడననుండి విముక్తి

24. ప్రభువు పలుకులివి:

”యిస్రాయేలునకు చుట్టుపట్ల వసించుచు

               వారిని చిన్నచూపు చూచిన జాతులు 

ఇకమీదట ముండ్లవలెను, ముండ్లకంపవలెను

               వారిని బాధింపజాలవు.

యిస్రాయేలీయులు నేను ప్రభుడనని గుర్తింతురు.

25. యావే ప్రభువు ఇట్లనెను: నేను యిస్రాయేలీ యులను చెల్లాచెదురు చేసిన దేశములనుండి మరల వారిని రప్పింతును. ఎల్లజాతులును నేను పవిత్రుడనని గుర్తించును. యిస్రాయేలీయులు వారి సొంతదేశము ననే, నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన నేల మీదనే వసింతురు.

26. అచట వారు సురక్షితముగా బ్రతుకుదురు. ఇండ్లు కట్టుకొని, ద్రాక్షతోటలు నాటు దురు. నేను వారిని చిన్నచూపు చూచిన ఇరుగుపొరుగు జాతులను శిక్షింతును. యిస్రాయేలునకు భద్రత కలుగును. అప్పుడు వారు నేను తమ దేవుడనైన ప్రభుడనని గుర్తింతురు”.