జ్ఞానము పుట్టుపూర్వోత్తరములు, దానిని సాధించు విధానము   

రాజులు జ్ఞానమును ఆర్జింపవలయును

6 1.        రాజులారా! నా పలుకులాలించి

                              విషయమునర్థము చేసికొనుడు.

                              విశాల ప్రపంచమునేలు పాలకులారా!

                              నా హెచ్చరికలు పాింపుడు.

2.           మీరు వేలాదిప్రజలను పరిపాలింతురు.

               మేము చాలమందిని ఏలెదమని గర్వింతురు.

3.           ప్రభువే మీకు ఈ పెత్తనము నొసగెను.

               మహోన్నతునినుండే మీకు

               ఈ రాజ్యాధికారము లభించినది.

               అతడు మీ పరిపాలనావిధానములను

               మీ ఉద్దేశములను పరిశీలించి చూచును.

4. మీరు దేవునితరపున

               అతని రాజ్యమును పరిపాలించువారు.

               కాని మీరు ధర్మయుక్తముగాపాలింపరేని,

               న్యాయము పాింపరేని,

               దైవచిత్తమును అనుసరింపరేని,

5.           అతడు దిఢీలున మీ మీదపడి

               మిమ్ము ఘోరముగా శిక్షించును.

               ఉన్నతాధికారులకు కఠినమైన శిక్ష ప్రాప్తించును. 

6.           ప్రభువు అల్పులను కరుణతో వదలివేయును.

               కాని ఘనులను నిశితముగా దండించును.

7.            అందరికిని యజమానుడైన ప్రభువు

               ఎవరికిని తలయొగ్గడు.

               ఆయన ఘనులను చూచి భయపడడు.

               అల్పులను, అధికులను కూడ ఆయనే చేసెను.

               అందరిని ఆయనే పోషించును.

8.           కాని ఆయన పాలకులకు మాత్రము

               కఠినమైన తీర్పుతీర్చును.

9.           కనుక రాజులారా! నా హెచ్చరికలు మీకొరకే,

               మీరు జ్ఞానమును బడసి

               మీ తప్పులను దిద్దుకొనుట కొరకే.

10.         పవిత్రమైన కార్యములను

               పవిత్రముగా నిర్వహించువారు

               పవిత్రులుగా గణింపబడుదురు.

               ఈ పాఠమును మీరు చక్కగా నేర్చుకొందురేని

               న్యాయనిర్ణయదినమున మిమ్ము మీరు

               రక్షించుకోగలుగుదురు.

11.           కనుక నా బోధల కొరకు ఆశతో

               కనిపెట్టుకొని ఉండుడు, కోరికతో వేచియుండుడు.

               అవి మీకు ఉపదేశము చేయును.

జ్ఞానము తనను వెదకువారికి దొరకును

12.          జ్ఞానము కాంతితో ప్రకాశించునే కాని కొడిగట్టదు.

               తనను ప్రేమించువారికది సులువుగనే లభించును.

               తనను వెదుకు వారికి అది సులువుగనే దొరకును.

13.          తనను అభిలషించు వారికది

               వెంటనే సాక్షాత్కరించును.

14.          పెందలకడనే లేచి జ్ఞానముకొరకు గాలించినచో

               తిప్పలుండవు.

               అది తనంతట తానే వచ్చి మీ తలుపుచెంత

               కూర్చుండును.

15.          జ్ఞానముగూర్చి ఆలోచించిన,

               పరిపూర్ణమైన విజ్ఞత కలుగును.

               దానికొరకు గాలించినచో చిత్తశాంతి లభించును.

16.          విజ్ఞానమే తనకు తగినవారికొరకు వెదకుచుండును

               దయతో వారి రోజువారిపనులలో

               వారికి సాక్షాత్కరించును.

               వారి ఆలోచనలన్నిట వారికి ప్రత్యక్షమగును.

17.          విజ్ఞానమునార్జింపవలెనన్న దానిమీద

               నిజమైన కోరిక ఉండవలెను.

               విజ్ఞానమును కోరుకొనుట అనగా

               దానిని ప్రేమించుటయే.

18.          విజ్ఞానమును ప్రేమించుట అనగా

               దాని ఆజ్ఞలను పాించుటయే.

               విజ్ఞానపుాజ్ఞలను పాించినచో

               అమరత్వము కలుగును.    

19.          అమరత్వము నరులను

               దేవునికి సన్నిహితులుగా చేయును.

20.        ఈ రీతిగా జ్ఞానాభిలాష మిమ్ము రాజ్యములేలుటకు

               సంసిద్ధులను  చేయును.

21.          కావున బహుజాతులనేలు రాజులారా!

               మీరు మీ సింహాసనమును,

               రాజ దండమును విలువతో చూతురేని,

               జ్ఞానమును సన్మానింతురేని,

               అప్పుడు మీరు శాశ్వతముగా

               రాజ్యము చేయుదురు.

సొలోమోను జ్ఞానమును వర్ణించుట

22.        జ్ఞానమనగానేమో, అదెట్లు ప్టుినదో వివరింతును

               నేను మీనుండి రహస్యములేమియు దాచను

               నేను జ్ఞానపుచరిత్రను మొదినుండి

               విశదీకరింతును.

               దానినిగూర్చి ఎల్లరికిని స్పష్టముగా

               తెలియజేయుదును.

               నేను సత్యమును మరుగుపరచను.

23.        అసూయకు లొంగి నాకు తెలిసిన దానినిదాచను. అి్ట దృక్పథమును  విజ్ఞానము అంగీకరింపదు.

24.         జ్ఞానులు అధికముగానున్నచో

               లోకమునకు మేలు కలుగును.

               విజ్ఞతగల రాజువలన ప్రజలకు భద్రత సిద్ధించును.

25.        కనుక నా ఉపదేశము నేర్చుకొని

               లాభమును బడయుడు.