నిర్దోషి తనకు న్యాయము
చేకూర్చుమని వేడుకొనుట
దావీదు ప్రార్థనము
17 1. యావే!
నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము.
నీ సహాయము అర్థించుచు,
నేను చేయు వేడికోలును వినుము.
నా యందు కపటములేదు కనుక
నా ప్రార్థనను అంగీకరింపుము.
2. నీ నుండి నాకు న్యాయము జరుగునుగాక!
నీ నేత్రములు ధర్మమును గాంచునుగాక!
3. నీవు నా హృదయమును పరిశీలించినా,
రాత్రివేళ నీవు నన్ను దర్శించినా,
నీవు నన్ను పరీక్షించినా
నాయందు నీక్టిె దురాలోచన కన్పింపదు.
4. నేనితరులవలె చెడ్డమాటలు పలుకలేదు.
నేను నీ ఆజ్ఞలను పాించితిని,
పరహింసకు పాల్పడనైతిని.
5. నేనెల్లప్పుడు నీ మార్గముననే నడచితిని
నీ త్రోవనుండి కొంచెమైన తొలగనైతిని.
6. నీవు నా మొరవిందువు కనుక
నేను నీకు విన్నపము చేయుచున్నాను.
నీవు చెవియొగ్గి నా పలుకులాలింపుము.
7. నీ శరణుజొచ్చినవారిని నీవు రక్షింతువు.
నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపుము.
నీ రక్షణమును బడసి మేము
శత్రువులనుండి తప్పించుకొందుము.
8-9. నన్ను నీ కింపాపవలె కాపాడుము.
నన్ను మోసముచేయు నా విరోధులు
పట్టరానిద్వేషముతో నన్ను చుట్టుముట్టుచున్నారు.
దుష్టులచేతికి చిక్కకుండునట్లు
నన్ను నీ రెక్కలమరుగున దాచిఉంచుము.
10. వారికి దయ లేశమైనను లేదు.
వారు గర్వముతో ప్రగల్భములు పలుకుచున్నారు.
11. నేనెటు వెళ్ళినను వారు
నా మీదికి వచ్చుచున్నారు.
నన్ను కూలద్రోయవలెననియే వారి కోరిక.
12. వారు సింహమువలె నన్ను
ముక్కలుముక్కలుగా చీల్చివేయ కోరుచున్నారు.
సింగపు కొదమవలె నా మీదికి దుముకుటకు
మరుగున పొంచియున్నారు.
13. ప్రభూ! లెమ్ము.
నా శత్రువులనెదిరించి వారిని జయింపుము.
నీ ఖడ్గముతో దుర్మార్గులనుండి
నన్ను కాపాడుము.
14. నీ శక్తితో నన్ను ఈ దుష్టులనుండి రక్షింపుము.
వారు ఇహలోకజీవితముతోనే తృప్తినొందువారు.
నీ సంపదలను వారికి
సమృద్ధిగా దయచేయుము.
వారి పుత్రులకును, పౌత్రులకును కూడ
వానిని దక్కనీయుము.
15. నేను మాత్రము నా నీతివలన
నీ దివ్యముఖమును దర్శింతును.
నేను మేల్కొనినపుడు నీ దివ్యరూపమును గాంచి
సంతృప్తి చెందుదును.