యిస్రాయేలు ఉద్ధరణము
కావలివాడుగా ప్రవక్త
33 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! నీవు నీ జనులతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఏ దేశము మీదికైనను యుద్ధము పంపినపుడు ఆ దేశీయులు తమలో ఒకనిని తమకు కావలివానినిగా ఉంచుకొందురు.
3. అతడు శత్రువులు వచ్చుటను చూచినపుడు బాకానూది ప్రజలకు హెచ్చరిక చేయును.
4. ఎవడైనను ఆ హెచ్చరికను ఆలించియు, అశ్రద్ధచేసి శత్రువు వాతపడి చచ్చెనేని, తన చావునకు తానే బాధ్యుడగును.
5. వాడు హెచ్చరికను వినియు అలక్ష్యము చేసెను. కనుక తన మరణమునకు తానే బాధ్యుడగును. అతడు లక్ష్యము చేసియుండిన యెడల చావును తప్పించుకొనెడివాడే.
6. కావలివాడు శత్రువు వచ్చుటను చూచియు బాకా నూది హెచ్చరిక చేయడేని, శత్రువు వచ్చి జనులను వధించెనేని, వారి మరణమునకు కావలివాడే బాధ్యుడగును.
7. ”నరపుత్రుడా! నేను నిన్ను యిస్రాయేలీయు లకు కావలివానినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలెను.
8. నేనెవడైన పాపాత్ముడు చచ్చునని పలికితినేని, నీవతనిని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకొనునట్లు చేయవేని, అతడు పాపిగానే మరణించును. అప్పుడు నీవతని మరణమునకు బాధ్యుడ వగుదువు.
9. కాని నీవెవడినైన దుష్టుని హెచ్చరించి పశ్చాత్తాపపడుమని చెప్పినను పశ్చాత్తాపపడడేని అతడు పాపిగానే చని పోవును. అప్పుడు నీ ప్రాణములకు ముప్పుకలుగదు.
వ్యక్తిగతమైన బాధ్యత
10. నరపుత్రుడా! నీవు యిస్రాయేలీయులకు ఇట్లు చెప్పుము: మీరు ‘మా పాపములు అక్రమములు మాపై భారమువలె నిలిచియున్నవి. మేము కృశించి పోవుచున్నాము. ఇక బ్రతుకుటెట్లు?’ అని నిరంతరము పలుకుచున్నారు.
11. నా జీవముతోడు, యాకోబు ప్రభుడనైన నా మాటలుగా నీవు వారితో ఇట్లనుము. దుష్టుడు చనిపోవుటవలన నాకు సంతుష్టి కలుగదు. దుష్టుడు తన మార్గమునుండి వెనుకకు మరలి బ్రతుకుటవలన నాకు సంతోషము కలుగును. యిస్రాయేలీయులారా! మీరు మీ దుష్టమార్గమునుండి వెనుకకు మరలుడు. మీరు అనవసరముగా చావనేల!”
12. నరపుత్రుడా! నీవు నీ ప్రజలతో ఇట్లు చెప్పుము. ”ఎవడైన సజ్జనుడు ఒకడు పాపము చేసెనేని అతడు చేసిన మంచి పనులతడిని రక్షింపజాలవు. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగెనేని, శిక్షను అనుభవింపడు. సజ్జనుడు పాపములకు పాల్పడెనేని అతని ప్రాణములు దక్కవు.
13. నేనెవడైన ఒక సజ్జనునికి జీవము నొసగుదునని మాటనీయ వచ్చును. కాని అతడు పూర్వము తాను చేసిన మంచిపనులను నమ్ముకొని పాపమునకు పాల్పడెనేని నేనతని సత్కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనను. అతడు తన పాపములకుగాను చచ్చితీరును.
14. ఎవడైన ఒక దుర్మార్గుని నేను ‘అతడు చచ్చును’ అని హెచ్చరిక చేయవచ్చును. కాని అతడు పాపమును విడనాడి న్యాయయుక్తములైన మంచికార్యములు చేసెను అను కొందము.
15. ఉదాహరణకు అతడు కుదువ సొమ్ముగా నుంచుకొనిన వస్తువును తిరిగి ఇచ్చివేయును. తాను అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చివేయును. పాపమును విడనాడి జీవమునొసగు ఆజ్ఞలను పాించె నేని అతడు చావనక్కరలేదు, బ్రతుకవచ్చును.
16. నేనతని పూర్వపాపములను విస్మరింతును. న్యాయమైన మంచిపనిని చేసెను, కనుక అతడు బ్రతుకును.
17. మీ ప్రజలు ‘ప్రభువు కార్యములు న్యాయముగా లేవు’ అని చెప్పుకొనుచున్నారు. కాని వారి కార్యములే న్యాయముగా లేవు.
18. సజ్జనుడు మంచిపనులను మాని చెడుపనులకు పాల్పెడెనేని, వాిమూలముగనే అతడు చచ్చును.
19. దుష్టుడు పాపకార్యములను వదిలివేసి నీతిన్యాయములను పాించెనేని తన ప్రాణ ములను దక్కించుకొనును.
20. యిస్రాయేలీయులారా! మీరు ‘ప్రభువు పని న్యాయముగాలేదు’ అనుచున్నారు. కాని నేను మీ నడవడిని బ్టి మీకు తీర్పు విధింతును.”
యెరూషలేము పతనము
21. మా ప్రవాసము పండ్రెండవయేడు, పదియవనెల ఐదవదినమున యెరూషలేము నుండి తప్పించుకొని వచ్చిన కాందిశీకుడు నాతో ”నగరము పట్టువడినది” అని చెప్పెను.
22. అతడు వచ్చుటకు ముంది రోజు సాయంకాలము ప్రభువు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను. ఆ మరుసి దినము ఉదయమున కాందిశీకుడు వచ్చినపుడు ప్రభువు నాకు మరల వాక్ఛక్తిని ప్రసాదించెను.
ప్రజల పాపములు
23. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 24. ”నర పుత్రుడా! యిస్రాయేలు దేశమునందలి పాడుపడిన నగరములలో వసించు జనులు ‘అబ్రహాము ఒక్కడై యుండగా ప్రభువు అతనికి ఈ భూమినంతిని ఇచ్చెను. ఇప్పుడు మనము చాలమందిమి కనుక ఈ భూమియంతయు మనదే అగును’ అని అనుకొను చున్నారు.
25. కనుక యావే ప్రభుడనైన నా పలుకు లుగా నీవు వారితో ఇట్లు చెప్పుము. ”మీరు రక్తమును ఓడ్చివేయక మాంసమును భుజించుచున్నారు. విగ్రహ ములను పూజించుచున్నారు. నరహత్య చేయుచున్నారు. అి్ట మీరు ఈ భూమిని స్వాధీనము చేసికొనుటయా?
26. మీరు మీ కత్తులను నమ్ముకొనుచున్నారు. మీ క్రియలు హేయమైనవి. మీలో ప్రతివాడును పొరుగు వాని పెండ్లముతో వ్యభిచరించుచున్నాడు. అి్ట మీరు ఈ భూమిని స్వాధీనము చేసికొనుటయా?
27. నా జీవముతోడు, యావే ప్రభుడనైన నేను ప్రమాణము చేసి చెప్పుచున్నాను వినుడు. పాడువడిన నగరములలో వసించువారు కత్తివాతబడుదురు. వెలుపలి పొలము లలో వసించువారిని వన్యమృగములు తినివేయును. కొండలలో, గుహలలో దాగుకొనువారు అంటురోగ ముల వలన చత్తురు.
28. నేను దేశమును ఎడారిచేసి నిర్మానుష్యము కావింతును. ప్రజలు నమ్ముకొనిన బలము అంతయు వమ్మగును. యిస్రాయేలు కొండలు అడవులగును. కనుక వానిగుండ ఎవడును ప్రయాణము చేయజాలడు.
29. నేను ప్రజలను వారి హేయమైన పాపములకుగాను శిక్షింతును. దేశమును నిర్మా నుష్యము చేయుదును. అప్పుడు వారు నేను ప్రభుడనని గుర్తింతురు.”
ప్రవక్త బోధవలన ఫలితములు
30. ప్రభువువాణి నాతో ఇట్లనెను: ”నరపుత్రుడా! ఈ ప్రజలు ప్రాకారములచెంతను, తమ గృహద్వారముల చెంతను నిన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారు. ‘రండు, మనము ప్రభువు పలుకులను ఆలింతము’ అని అనుకొనుచున్నారు.
31. నా ప్రజలు నీ చుట్టు కూర్చుండి నా పలుకులు ఆలించుచున్నారు. కాని నీవు చెప్పినట్లు చేయుటలేదు. ప్రేమపూరితమైన పలు కులు వారి నోటవచ్చుచున్నవి. కాని వారి కోరికలు లాభార్జనము మీదనే ఉన్నవి.
32. వారు నీవు ప్రేమ గీతములను పాడుచునో, తంత్రీవాద్యములు మీటు చునో, వినోదమును చేకూర్చి పెట్టువాడవని తలంచు చున్నారు. వారు నీ పలుకులు ఆలింతురుగాని పాింపరు.
33. అయితే నీ పలుకులెల్ల నెరవేరి తీరును. అవి నేరవేరినపుడు వారు ప్రవక్త ఒకడు తమ మధ్య ఉన్నాడని గుర్తింతురు.”