సహాయుడైన దేవునికి స్తుతి

146 1.    మీరు ప్రభువును స్తుతింపుడు.

                              ఓ నా ప్రాణమా! ప్రభువును స్తుతింపుము

2.           నా జీవితకాలమంతయు

               ప్రభువును కొనియాడుదును

               నేను బ్రతికియున్నన్నినాళ్ళు

               ఆయన కీర్తనలు పాడుదును.

3.           రాజులను నమ్ముకొనకుము.

               నరమాత్రుడెవ్వడును నిన్ను రక్షింపజాలడు.

4.           నరుడు ఊపిరివిడచి మ్టిలో కలిసిపోవును.

               ఆ దినమే అతని యత్నములెల్ల వమ్మగును.

5.           యాకోబు దేవుని అండగా బడసినవాడు,

               తన ప్రభువైన దేవునిమీద

               ఆధారపడువాడు ధన్యుడు.

6.           ప్రభువు భూమ్యాకాశసముద్రములను

               వానిలోని సమస్తవస్తువులను చేసినవాడు.

               ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును.

7.            ఆయన పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును.

               ఆకలిగొనినవారికి ఆహారము పెట్టును.

               బందీలను చెరనుండి విడిపించును.

8.           గ్రుడ్డి వారికి చూపునొసగును.

               క్రుంగిపోయిన వారిని లేవనెత్తును.

               సజ్జనులను ఆదరముతో చూచును.

9.           మన దేశమునవసించు పరదేశులను కాపాడును. వితంతువులను, అనాథశిశువులను ఉద్ధరించును

               దుర్మార్గుల పన్నాగములను భంగపరచును.

10.         ప్రభువు కలకాలము పరిపాలించును.

               సియోనూ! నీ దేవుడు నిత్యము

               రాజ్యపాలనము చేయును.

               మీరు ప్రభువును స్తుతింపుడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము