2 (12) 1. బిగ్తాను, తేరేషు అను ఇరువురు నపుంసకులు రాజప్రాసాద ప్రాంగణమునకు కావలి కాయుచుండగా మొర్దెకయి వారి దాపున శయ నించెను.

2. ఆ నపుంసకులు రాజు మీద కుట్ర పన్ను చుండిరి. మొర్దెకయి ఆ రహస్యమును పసికట్టెను. వారు అహష్వేరోషును హత్యచేయు పన్నాగమున నున్నారని గ్రహించి ఆ సంగతి రాజునకు విన్నవించెను.

3. రాజు ఆ ఇరువురిని బాధలకు గురిచేయగా వారు తమ తప్పిదమును ఒప్పుకొనిరి. అహష్వేరోషు  వారిని ఉరి తీయించెను.

4. అతడు ఈ ఉదంతమునెల్ల  రాజకార్యముల దస్తావేజున వ్రాయించెను. మొర్దెకయి కూడ ఆ సంగతిని లిఖించి యుంచెను.

5. రాజు మొర్దెకయికి ఆస్థానమున ఉద్యోగమిచ్చి బహుమతు లతో సత్కరించెను.

6. అప్పుడు అగాగు వంశజుడు హమ్మెదాతా కుమారుడైన హామాను అనువాడు రాజుమన్ననకు పాత్రుడైయుండెను. అతడు మాత్రము ఇరువురు   నపుంసకులను చంపించినందులకుగాను మొర్దెకయికి కీడుచేయతలపెట్టెను.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము