యోతాము పరిపాలన
27 1. రాజగునప్పికి యోతామునకు ఇరువది యైదేండ్లు. అతడు యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలన చేసెను. అతని తల్లి, సాదోకు కుమార్తెయైన యెరూషా.
2. యోతాము తన తండ్రి ఉజ్జీయావలె ప్రభువునకు ప్రీతిగలిగించు కార్యములు చేసెను. అయినను అతడు దేవాలయములోనికి అడుగు పెట్టలేదు. ప్రజలు మాత్రము పాపము మూటగట్టు కొనుచునేయుండిరి.
3. దేవాలయపు ఉత్తర ద్వారమును నిర్మించినది యోతామే. ఓఫెలుచెంత యెరూషలేము ప్రాకార మును పొడిగించినది కూడ అతడే.
4. ఇంకను అతడు యూదా మన్యమున పట్టణములు నిర్మించెను. అరణ్య సీమలో కోటలు బురుజులు క్టించెను.
5. యోతాము అమ్మోనీయుల రాజుతో పోరాడి వారిని ఓడించెను. వారు మూడేండ్లపాటు ఏటేట రెండువందల మణుగుల వెండి, పదివేల కుంచముల గోధుమలు, పదివేల కుంచముల యవలు కప్పము కట్టుటకు అంగీకరించిరి.
6. అతడు ప్రభుని యాజ్ఞలు పాించెను గనుక మహా బలసంపన్నుడయ్యెను.
7. యోతాము పరిపాలనలోని ఇతరాంశములు, అతడు చేసిన యుద్ధములు, అనుసరించిన పద్ధతులు అన్నియు యిస్రాయేలు యూదారాజులచరితమున లిఖింప బడియేయున్నవి.
8. రాజు అగునప్పికి యోతాము నకు ఇరువది ఐదేండ్లు. అతడు యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలించెను.
9. యోతాము తన పితరులతో నిద్రించగా అతనిని దావీదు నగరమున పాతి ప్టిెరి. అటుతరువాత అతని కుమారుడు ఆహాసు రాజయ్యెను.