యోహోయాకీము కాలమునకు చెందిన ప్రవచనములు

దేవళమునకు ప్రతికూలముగా

7 1-2 ప్రభువువాణి యిర్మీయాకు ప్రత్యక్షమై ఇట్లనెను: ”నీవు యావే మందిరద్వారము వద్ద నిలు చుండి ప్రజలకు ఇట్లు బోధింపుము. ప్రభువును కొలు చుటకు ఈ ద్వారముగుండ లోనికివచ్చు యూదా వాసులారా! మీరు ప్రభువు వాక్కు ఆలింపుడు.

3. సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైౖౖన ప్రభువు ఇట్లు అనుచున్నాడు. మీరు మీ ప్రవర్తనను, మీ క్రియలను మార్చుకొనుడు. అప్పుడు నేను మిమ్మిట వసింపనిత్తును.

4. మీరు ‘ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, మనము సురక్షితముగా ఉండవచ్చును’ అను మోసపు మాటలను నమ్మవలదు.

5. మీ ప్రవర్తనను, మీ క్రియలను మార్చుకొనుడు. ఒకరిపట్ల ఒకరు నీతితో మెలగుడు.

6. పరదేశులను, అనాథలను, వితంతు వులను పీడింపకుడు. ఈ దేశమున నిర్దోషులనెత్తురును ఒలికింపకుడు. పరదైవములను కొలిచి వినాశము తెచ్చుకొనకుడు.

7. మీరు మీ బుద్ధిని మార్చు కొందు రేని నేను మీ పితరులకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ నేలపై మిమ్ము బ్రతుకనిత్తును.

8. కాని మీరు మోసపుమాటలు నమ్ముచున్నారు. వానివలన లాభములేదు.

9. మీరు దొంగతనమునకు, హత్యకు, వ్యభిచారమునకు, అబద్ధ ప్రమాణములకు పాల్పడుచున్నారు. బాలుదేవతకు ధూపము వేయు చున్నారు. మీకుతెలియని పరదైవములను అనుసరించు చున్నారే!

10. ఈ పనులన్నియుచేసి నాదైన ఈ దేవాలయము లోనికివచ్చి నా ఎదుట నిలుచుండి, మనము సురక్షితముగా ఉన్నామని చెప్పుకొను చున్నారు. మీరు సురక్షితముగా ఈ దుష్కార్యములెల్ల చేయవచ్చుననియే మీ తలపు.

11. నాదైన ఈ దేవళము దొంగలు తలదాచుకొను గుహకాదు. నేను మీ కార్యములెల్ల గమనించుచునే ఉందును. ఇది ప్రభువువాక్కు.

12. మీరు షిలోకు వెళ్ళిచూడుడు. అది నేను ఎన్నుకొనిన ప్రథమ ఆరాధనాస్థలము. నా ప్రజలైన యిస్రాయేలీయుల పాపములకుగాను నేను ఆ తావునకు ఏమి చేసితినో చూడుడు.

13. మీరీ పాపములెల్ల చేసితిరి. నేను వేకువనేలేచి మీతో మాట లాడినను మీరు నా పలుకులు పెడచెవిన ప్టిెతిరి. నేను మిమ్ము పిలిచినను మీరు బదులీయరైతిరి.

14. కనుక నేను షిలోనువలె నాదైన ఈ దేవళమును, మీరింతగా నమ్ముకొను ఈ మందిరమును నాశనము చేయుదును. మీకును, మీ పితరులకును నేనిచ్చిన ఈ తావును షిలోనువలె ధ్వంసము చేయుదును.

15. నేను మీ బంధువులైన యిస్రాయేలీయులనువలె మిమ్ము కూడ నా ఎదుినుండి తరిమివేయుదును. ఇవి ప్రభుడనైన నా పలుకులు.

పరదైవములు

16. ”యిర్మీయా! నీవు ఈ ప్రజల తరపున ప్రార్థన చేయవలదు. వారి పక్షమున మొర పెట్టవలదు, వేడికోలు చేయవలదు. నీవు నన్ను అర్థింపవలదు.  నేను నీ ప్రార్థనవినను.

17. యూదానగరములలోను, యెరూషలేము వీధులలోను వారు ఏమి చేయుచు న్నారో నీవు చూచుటలేదా? 18. పిల్లలు పుల్లలేరుకొని వచ్చుచున్నారు. పురుషులు పొయ్యిలో మంట సిద్ధము చేయుచున్నారు. స్త్రీలు పిండివిసరి ఆకాశరాజ్ఞి అనబడు దేవతకు అర్పించుటకుగాను మోదకములు వండు చున్నారు. ఇంక వారు అన్యదైవములకు ద్రాక్షాసారాయ మును పానీయార్పణగా పోసి నన్ను బాధింపచూచు చున్నారు.

19. కాని వారు నన్ను బాధించుటకు మారుగా తమ్ముతామే బాధించుకొందురు. తమకు  తామే అవమానము తెచ్చుకొందురు.

20. కనుక యావే ప్రభుడనైన నేను నా ఉగ్రకోపమును ఈ దేవళ ముపై కుమ్మరింతును. ప్రజలమీదను, పశువుల మీదను, చెట్లమీదను, పైరులమీదను కూడ దానిని కుమ్మరింతును. అది ఆర్పజాలని అగ్నివలెమండును.”

చిత్తశుద్ధిలేని ఆరాధనము

21. సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: ”మీ దహన బలులను, సమాధానబలులను కూడ కలుపుకొని అన్నింలోను నైవేద్యమును భుజింపుడు.

22. నేను మీ పితరులను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినపుడు దహనబలులను గూర్చిగాని, ఇతర బలులను గూర్చి గాని వారికి ఎి్ట ఆజ్ఞలను ఈయలేదు.

23. కాని నేను మీరు నాకు విధేయులై ఉండవలెనని ఆజ్ఞాపించు చున్నాను. అటులచేసినచో నేను మీకు దేవుడనగుట కును, మీరు నాకు ప్రజలగుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగును’ అని చెప్పితిని.

24. కాని వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులుకాలేదు. మొండితనముతో తమ దుష్టహృదయము ప్రకారము తామునడచిరి. నా చెంతకురాక నానుండి వైదొలగిరి.

25. మీ పితరులు ఐగుప్తునుండి వచ్చినప్పినుండి నేివరకును అనుదినము పెందలకడనే లేచి నేను నా దాసులైన ప్రవక్తలను మీచెంతకు పంపుచునే యుింని.

26. కాని నా పలుకులు ఎవరును ఆలింప లేదు. మీరు మొండివారై మీ పితరులకంటెను దుష్టు లుగా తయారైతిరి. 27. యిర్మీయా! ”నీవు ఈ పలుకు లన్నింని ప్రజలతో చెప్పవచ్చును. కాని వారు నీ మాటవినరు. నీవు వారిని పిలువవచ్చును. కాని వారు నీకు ప్రత్యుత్తరమీయరు.

28. నీవు వారితో ‘ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవునిమాట వినుటలేదనియు, తాము పొందిన దండననుండి పాఠము నేర్చుకొనుట లేదనియు చెప్పుము. ప్రజలలో చిత్తశుద్ధి లోపించి నది. దానినిగూర్చి మ్లాడువాడుకూడ లేడు.

విగ్రహారాధన, ప్రవాస శిక్ష

29.        యెరూషలేము పౌరులారా!

               మీ కేశములను కత్తిరించి ఆవల పారవేయుడు.

               కొండకొమ్ముల మీద

               శోకగీతములు ఆలాపింపుడు.

               ప్రభుడనైన నేను కోపము చెంది

               నా ప్రజలను విడనాడితిని.

30. యూదా ప్రజలొక దుష్కార్యము చేసిరి. వారు నేను ఏవగించుకొను విగ్రహములను నా దేవళమున నెలకొల్పి, దానిని అమంగళము చేసిరి.

31. హిన్నోము లోయలో తోఫెతు అను బలిపీఠము క్టి వారి కుమారులను, కుమార్తెలను అగ్నిలో కాల్చి వేసిరి. నేను ఈ కార్యము చేయుడని వారిని ఆజ్ఞాపింప లేదు. అి్ట ఆలోచన నాకు తట్టనుకూడ తట్టలేదు.

32. కనుక ప్రజలు ఇక దానిని తోఫెతు పీఠమనిగాని, హిన్నోములోయయనిగాని పిలువక, వధలోయ అని పిలుచు రోజులు వచ్చును. పాతిపెట్టుటకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతిపెట్ట బడును. ఇది ప్రభువు వాక్కు.

33. వన్యమృగము లును, ఆకాశపకక్షులును వారి శవములను తిని వేయును. వానినెవడును తోలివేయడు.

34. నేను దేశమును ఎడారి చేయుదును. యూదా నగరముల లోను, యెరూషలేము వీధులలోను ఆనందనాదముల నెల్ల అణచివేయుదును. వివాహోత్సవములలో వధూ వరులనోట విన్పించు సంతోషధ్వానములనెల్ల నిర్మూ లింతును.