నాలుగవ భాగము 90-106

హ్రస్వకాలికమైన నరజీవితము

దైవసేవకుడైన మోషే ప్రార్ధనము

90 1.     ప్రభూ! అనాదికాలమునుండియు

                              నీవు మాకు వాసస్థలముగానుింవి.

2.           పర్వతములు పుట్టకమునుపే, భూమియు,

               లోకమును ఏర్పడకపూర్వమే

               అనాదికాలమునుండి నీవు దేవుడవుగానుింవి

               ఎల్లకాలమును నీవు వేల్పువుగానుందువు.

3.           నీవు నరులను మ్టిగా మార్చెదవు.

               ”నరులారా! మీరు మరల మన్నయిపొండు”

               అని పలికెదవు.

4.           నీకు వెయ్యేండ్లు ఒక్కరోజుతో సమానము,

               అవి గతించిపోయిన నిన్నిదినముతోను

               రేయి అందలి ఒక్క జాముతోను సరిసమానము.

5.           నీవు నరులను వరదవలె ఈడ్చుకొని పోయెదవు.

               వారు కలవింవారు,

               ఉదయమున మొలకెత్తు గడ్డివింవారు.

6.           అది వేకువన ఎదిగి పూలు పూయును.

               సాయంకాలమున కోయబడి వాడి, ఎండిపోవును

7.            మేము నీ కోపాగ్నివలన మాడిపోవుచున్నాము.

               నీ క్రోధమువలన గడగడ వణకుచున్నాము.

8.           నీవు మా పాపములను నీ ముందట ఉంచుకొందువు

               మా రహస్య పాపములను

               నీ ముఖకాంతితో పరిశీలించి చూతువు.

9.           నీ కోపము భరించుచూనే

               మా దినములన్నియు గతించిపోవును.

               మా ఆయువు శ్వాసమువలె గతించును.

10.         మేమొక డెబ్బదియేండ్లు జీవింతుము.

               దృఢకాయులమైనచో

               ఎనుబదియేండ్లు బ్రతుకుదుము

               కాని ఆ యేండ్లన్నియు

               బాధావిచారములతో నిండియుండును.

               మా జీవితము క్షణములో ముగియగా

               మేము దాిపోవుదుము.

11.           కాని నీ కోపప్రభావమును

               అర్థము చేసికొన్నవాడెవడు?

               నీ క్రోధమువలన ఎి్ట భయము కలుగునో

               గ్రహించినవాడెవడు?

12.          మా ఆయుష్కాలము ఎంతస్వల్పమైనదో

               మేము గ్రహించునట్లు చేయుము.

               దానివలన మేము విజ్ఞులమగుదుము.

13.          ప్రభూ! నీ క్రోధమును అణచుకొనుము.

               నీవింకను ఎంతకాలము కోపింతువు?

               నీ దాసులమీద దయచూపుము.

14.          వేకువన మమ్ము నీకృపతో నింపుము.

               మా జీవితకాలమందెల్ల

               మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము.

15.          పూర్వము మమ్ము ఎంతగా శ్రమలపాలుచేసి,

               దుఃఖప్టిెతివో అంతగా నేడు

               మమ్ము సంతోషపెట్టుము.

16.          నీ దాసులమైన మేము నీ రక్షణమును చూతుముగాక

               మా బిడ్డలు నీ మాహాత్మ ్యమును కాంతురుగాక

17.          మా దేవుడవైన ప్రభూ!

               నీ అనుగ్రహమును మాకు దయచేయుము.

               మా కార్యములనెల్ల సఫలము చేయుము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము