బలి అర్పణములు

28 1-2. ప్రభువు మోషేతో ”యిస్రాయేలీయు లతో ఇట్లు చెప్పుము. మీరు నియమితకాలములందు నాకు బలులు సమర్పింపవలెను. అవి నాకు ప్రీతిని కలిగించును.

1. ప్రతిదిన సమర్పణములు

3. మీరు నాకు సమర్పింపవలసిన బలి అర్పణ ములు యివి: ప్రతిదినమును అవలక్షణములు లేని ఏడాది మగగొఱ్ఱెపిల్లలను రెండింని దహనబలిగా అర్పింపవలెను.

4. వానిలో ఒకదానిని ఉదయము, మరొకదానిని సాయంకాలము సమర్పింపుడు.

5. ఆ రెండింతోపాటు రెండుకుంచముల ధాన్యపు పిండిని, రెండుబుడ్ల దంచితీసిన శ్రేష్టమైన ఓలివు నూనెను అర్పింపవలెను.

6. ఈ ఆహారపదార్థములు అన్నియు పూర్తిగా దహనము చేయబడును. ఈ దహనబలి మొదట సీనాయి కొండవద్ద సమర్పింప బడెను. ఆ బలిసువాసన ప్రభువునకు ప్రీతికలిగించెను.

7. మొది గొఱ్ఱెపిల్లతోపాటు ద్రాక్షసారాయమును ప్రభువునకు పానార్పణముగా పవిత్రస్థలమున ధార వోయవలెను.

8. ఆ రీతిగానే సాయంకాలమును నైవేద్య, ద్రాక్షసారాయమును అర్పించుచు రెండవ గొఱ్ఱెపిల్లను దహనబలిగా అర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతికలిగించును.

2. విశ్రాంతిదిన సమర్పణములు

9. విశ్రాంతిదినమున అవలక్షణములులేని ఏడాది ప్రాయముగల రెండు మగ గొఱ్ఱె పిల్లలను అర్పింపుడు. వానితోపాటు నాలుగుకుంచములపిండిని ఓలివునూనెను ద్రాక్షసారాయమును అర్పింపుడు.

10. ప్రతిదిన సమర్పణలతోపాటు, ప్రతిదిన ద్రాక్ష సారాయ ముతోపాటు ఈ దహనబలిని గూడ విశ్రాంతిదినమున ప్రత్యేకముగా సమర్పింపవలెను.

3. ప్రతినెల మొదిదినపు సమర్పణములు

11-13. ప్రతినెల మొదిదినమున అవలక్షణ ములు లేని రెండుకోడెదూడలను, ఒక పొట్టేలును, ఏడాదిప్రాయముగల ఏడు మగగొఱ్ఱెపిల్లలను ప్రభువు నకు దహనబలిగా అర్పింపుడు. ధాన్యార్పణముగా ఓలివునూనెతో కలిపిన పిండిని అర్పింపుడు. ఒక్కొక్క కోడెకు ఆరుకుంచముల పిండి, పొట్టేలుకు నాలుగు కుంచములపిండి, గొఱ్ఱెపిల్లకు రెండు కుంచముల పిండి చొప్పున అర్పింపుడు. ఈ దహనబలులు ప్రభువు నకు అర్పింపబడును. ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చును.

14. ద్రాక్షసారాయమును ఒక్కొక్క కోడెకు నాలుగుబుడ్లు, పొట్టేలుకు మూడుబుడ్లు, గొఱ్ఱెపిల్లకు రెండుబుడ్లు అర్పింపవలెను. ఏడాది పొడుగున ప్రతినెల మొదిరోజున సమర్పింపవలసిన దహనబలులివి.

15. ప్రతిరోజు సమర్పించు దహన బలితో పాటు పాపపరిహారబలిగా ఒక మేకపోతును గూడ సమర్పింపుడు.

4. పాస్క పొంగని రొట్టెల పండుగ

16-17. మొదినెల పదునాలుగవ దినమున పాస్క వచ్చును. పదునైదవనాడు పండుగ ప్రారంభమై ఏడురోజులవరకు కొనసాగును. ఈ ఏడురోజులు పొంగని రొట్టెలను మాత్రమే భుజింపుడు.

18. పండుగ వారము మొదిరోజున మీరందరు దేవుని ఆరాధించు టకు సమావేశము కావలెను. ఆ దినము మీరు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

19. అవ లక్షణములులేని రెండుకోడెదూడలను, ఒక పొట్టేలును, యేడాది ఈడు గల ఏడు మగగొఱ్ఱెపిల్లలు ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు.

20-21. ఓలివునూనెతో కలిపిన పిండిని ఒక్కొక్క కోడెకు ఆరుకుంచములు, పొట్టేలుకు నాలుగుకుంచములు, గొఱ్ఱెపిల్లకు రెండు కుంచముల చొప్పున అర్పింపుడు.

22. పాపపరిహార ముగా ఒక మేకపోతును గూడ అర్పింపుడు. ఈ విధముగా ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరిపింపుడు.

23. ప్రతిదినమున ఉదయమర్పించు దహనబలితోపాటు వీనిని కూడ అర్పింపుడు.

24. ఈ బలులను ఏడురోజులపాటు అర్పింపవలెను. ఈ దహనబలులు ప్రభువునకు ప్రీతికలిగించు సువాసన నిచ్చి ఆయనకు భోజనమగును.

25. ఏడవనాడు ప్రభుని ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆనాడు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

5. వారముల పండుగ

26. వారములపండుగ మొదిదినమున మీరు ప్రథమఫలములను ప్రభునికి అర్పింతురుగదా! ఆ దినమున ప్రభుని ఆరాధించుటకు సమావేశము కండు. ఆరోజు మీరు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయకుడు. 27. అవలక్షణములులేని రెండుకోడెలను, ఒక పొట్టేలును, ఏడాది యీడుగల ఏడు మగగొఱ్ఱె పిల్లలను దహనబలిగా అర్పింపుడు. ఈ బలి ప్రభువు నకు ప్రీతికలిగించు సువాసననిచ్చును.

28-29. ఓలివునూనెతో కలిపిన పిండిని ఒక్కొక్కకోడెకు ఆరు కుంచములు, పొట్టేలుకు నాలుగుకుంచములు, గొఱ్ఱె పిల్లకు రెండుకుంచముల చొప్పున అర్పింపుడు.

30. పాపపరిహారబలిగా ఒక మేకపోతునుగూడ అర్పింపుడు. ఈ రీతిగా ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరిపింపుడు.

31. ప్రతిదినము అర్పించు దహనబలితో పాటు, ధాన్యార్పణముతోపాటు వీనినికూడ అర్పింపుడు.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము