2. సౌలు పరిపాలనారంభము
ఫిలిస్తీయులపై తిరుగుబాటు
13 1. సౌలు ముప్పదిఏండ్ల ప్రాయమువాడై రాజుగా పరిపాలన మొదలిడి ఏడాది గడచెను. రెండవ ఏడాది పాలించిన మీదట6 2. సౌలు యిస్రా యేలీయుల నుండి మూడువేలమంది వీరులనెన్ను కొనెను. వీరిలో రెండువేలమంది మిక్మాషునందు, బేతేలు కొండయందు విడిదిచేసిరి. సౌలు వారికి నాయకుడు. వేయిమంది బెన్యామీనీయుల గిబియా యందు మకాము చేసిరి. యోనాతాను వారికి నాయ కుడు. మిగిలిన వారిని సౌలు వారి వారిండ్లకు పంపి వేసెను.
3. యోనాతాను గెబా వద్దనున్న ఫిలిస్తీయుల దండును హతము చేసెను. దానితో ఫిలిస్తీయులు హెబ్రీయులు తిరుగుబాటు మొదలిడిరని గ్రహించిరి. సౌలు యుద్ధమునకు గుర్తుగా దేశమంతట హెబ్రీయులు వినవలెనని బాకా ఊదించెను.
4. సౌలు ఫిలిస్తీయుల దండును హతము చేసినందున ఫిలిస్తీయులు హెబ్రీయు లనిన పండ్లు కొరుకుచుండిరని యిస్రాయేలీయులు గుర్తించిరి. కనుక వారు సౌలు పిలుపునందుకొని గిల్గాలువద్ద అతనిని కలిసిరి.
5. ఫిలిస్తీయులు కూడ యుద్ధమునకు సన్నద్ధులైరి. వారికి ముప్పదివేల రథములు, ఆరువేలమంది రౌతులు, సముద్రతీరము నందలి ఇసుకరేణువులవలె లెక్కకందని కాలిబంటులు కలరు. ఫిలిస్తీయులు బేతావెనుకు తూర్పుననున్న మిక్మాషువద్ద శిబిరముపన్నిరి.
6. శత్రుసైన్యము యిస్రాయేలీయులచుట్టు క్రమ్ముకొనెను. అదిచూచి యిస్రాయేలీయులు ఆశవదలుకొని కలవరపాటున గుహలలో, బొరియలలో, రాతినెరియలలో, గోతు లలో, నూతులలో దాగుకొనిరి. చాలమంది యోర్దాను రేవుదాి గాదు, గిలాదు మండలములకు పారిపోయిరి.
సమూవేలు సౌలును విడనాడుట
7. సౌలు ఇంకను గిల్గాలు వద్దనేయుండెను. జనులందరు భయపడుచు అతనిని వెంబడించిరి.
8. సమూవేలు ప్టిెన గడువు ప్రకారముగా సౌలు ఏడు రోజులు వేచియుండెను. కాని సమూవేలు గిల్గాలునకు రాలేదు. అది చూచి జనులు సౌలును విడనాడి ఎవరి త్రోవను వారు వెడలిపోజొచ్చిరి.
9. సౌలు జనులు చెదరిపోవుట చూచి దహనబలిని, సమాధానబలిని సిద్ధము చేయించెను. తానే దహనబలిని అర్పించెను.
10. సౌలు దహనబలిని అర్పించి ముగింపగనే సమూవేలు వచ్చెను. సౌలు వందనము చేయుటకై సమూవేలునకు ఎదురువోయెను.
11. అతనిని చూడ గనే సమూవేలు ”ఎంతపని చేసితివి!” అనెను. సౌలు అతనితో ”జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నీవేమో గడువు లోపల రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మాషు వద్ద మోహరించి ఉండుటయు చూచి 12. వారు తప్పక గిల్గాలునకు వచ్చి నా మీదపడెదరు. నేనింకను యావేను మనవి చేయనైతిననుకొింని కనుక ఎటులనో గుండెనిబ్బరముతో ఈ దహనబలిని అర్పించితిని” అనెను.
13. సమూవేలు ”నీవు పిచ్చి పని చేసితివి.7 నీ దేవుడైన యావేఆజ్ఞ పాించి యుింవేని ప్రభువు కలకాలము నీ వంశము వారినే యిస్రాయేలీయులకు రాజులుగా నియమించియుండెడి వాడు8. ఇక నీ వంశమువారికి రాచరికము లభింపదు. నీవు యావేఆజ్ఞ పాింపవైతివి.
14. అందుచే ప్రభువు తనకు నచ్చినవానిని వేరొకనిని ఎన్నుకొనును. అతనినే తన ప్రజకు నాయకునిగా నియమించును” అని పలికెను. అటుల పలికి సమూవేలు గిల్గాలు నుండి వెళ్ళిపోయెను.
15. పిమ్మట సౌలు గిల్గాలు నుండి బయలుదేరి శత్రుసైన్యములున్న దిక్కుకువెడలెను. సౌలు అనుచరులు అతని వెంటబోయిరి. బెన్యామీనీయుల గిబియా వద్ద సౌలు తన జనమును లెక్కించిచూడగా ఆరువందల మంది మాత్రము తేలిరి.
యుద్ధ సన్నాహములు
16. సౌలు, అతని కుమారుడైన యోనాతాను అనుచరులు బెన్యామీనీయుల గిబియావద్ద విడిది చేసిరి. ఫిలిస్తీయులు మిక్మాషువద్ద బారులు తీరి యుండిరి.
17. ఫిలిస్తీయుల శిబిరము నుండి మూడు దోపిడిదండులు బయలుదేరెను. ఒక దండు షూవాలు రాష్ట్రములోని ఒఫ్రాకు వెళ్ళెను.
18. రెండవది బేత్‌హోరోనుకు వెడలెను. మూడవది సెబోయీము లోయకు, దాని ఆవలి ఎడారికి ఎదురుగానున్న కొండ వరుసవైపు నడచెను.
19. ఫిలిస్తీయులు హెబ్రీయులను కత్తులు, ఈటెలు తయారు చేసికొననీయలేదు. కావున యిస్రా యేలు దేశమున ఇనుపపనిముట్లు చేయువారు కరు వైరి.
20. అందుచే యిస్రాయేలీయులు కఱ్ఱు, గొడ్డలి, పార, పోటుకత్తి మొదలైన వానికి పదును ప్టిెంచు కొనుటకు ఫిలిస్తీయుల వద్దకే వెళ్ళెడివారు.
21. ఫిలిస్తీయులు కఱ్ఱులను గొడ్డళ్ళను సాగగొట్టుటకు వెండికాసున మూడింట రెండుపాళ్ళు పుచ్చుకొనెడి వారు. పారలకు, పోటుకత్తులకు పదునుపెట్టుటకు మూడవపాలు పుచ్చుకొనెడివారు.
22. కావున పోరాటము చెలరేగునప్పికి సౌలు సైన్యమునగాని, యోనాతాను సైన్యమునగాని ఒకని చేతిలోనైన కత్తి, ఈటె కనబడవయ్యెను. సౌలు, యోనాతాను చేతులలో మాత్రము ఆయుధములుండెను.
23. మిక్మాషు కనుమను కాచుటకై ఫిలిస్తీయులు కావలిదండును పంపిరి.