దావీదు నోబునందలి యాజకుని కడకు ఏగుట

21 1. దావీదు వెడలిపోగా యోనాతాను పట్టణ మునకు తిరిగివచ్చెను.

2. అంతట దావీదు నోబు నగరముచేరి యాజకుడైన అహీమెలెకు చెంతకు పోయెను. అహీమెలెకు భయవిహ్వలుడై దావీదును ”పరివారము లేకయే ఇట్లు ఒంటరిగా వచ్చితివేల?” అని యడిగెను.

3. దావీదు అతనితో ”రాజు నన్నొక పనిమీద పంపెను. తన పనిగాని, ఆజ్ఞగాని ఎవ్వరికి తెలియగూడదని ప్రభువు కట్టడచేసెను. ఇక నా పరివారమందువా, ఒకానొక తావున కలిసికొందునని వారికి ముందుగనే తెలిపియుింని. 4. నీయొద్ద తినుటకేమైన ఉన్నదా? ఐదురొట్టెలున్న ఇమ్ము. ఎన్ని యున్న అన్నియే ఇచ్చివేయుము” అనెను.

5. యాజకుడు నా యొద్ద మామూలు రొట్టె లేమియు లేవు. దేవునిసన్నిధినిడిన రొట్టెలు మాత్రమే కలవు. నీతో వచ్చినవారు స్త్రీ సంగమము వలన మైలపడలేదు కదా?” అని అడిగెను.

6. దావీదు అతనితో ”మేము యుద్ధమునకు బయలుదేరినది మొదలు ఈ మూడు దినములు స్త్రీ పొందునకు దూరముగానే యున్నాము. వీరు  సాధా రణముగా యుద్ధమునకు బయలుదేరునపుడెల్ల స్త్రీల పొత్తును మానుకొనుచునే యున్నారనిన, రాజాజ్ఞనుబ్టి బయలుదేరిన ఈ వేళ వీరెంత శుద్ధులుగా నుందురో గదా!” అని యాజకునితో అనెను.

7. అపుడు యాజకుడు వేరు రొట్టెలేమియు లేకపోవుటచే దేవుని సాన్నిధ్యమున నుంచిన రొట్టెలనే అతనికిచ్చెను. అవి అప్పుడే దైవసాన్నిధ్యమునుండి తొలగింపబడినవి. వాని స్థానమున క్రొత్తగాకాల్చిన రొట్టెలనుంతురు.

8. ఆ దినమున సౌలు సేవకుడొకడు అక్కడ యావే ముందుట నిలిపి ఉంచబడెను. అతడు ఎదోమీయుడగు దోయేగు. అతడు సౌలు పశువులకాపరులకు పెద్ద.

9. దావీదు అహీమెలెకుతో ”నీ చెంత బల్లెము గాని, కత్తిగాని ఉన్నదా? రాజాజ్ఞను సత్వరము పాింప వలసి వచ్చుటచే నేను ఖడ్గముగాని, ఆయుధముగాని కొనిరాలేదు” అనెను.

10. యాజకుడు ”ఏలా లోయలో నీవు సంహరించిన ఫిలిస్తీయ గొల్యాతుఖడ్గము మాత్రము ఉన్నది. బట్టచ్టుి అల్లచ్చ దానిని యాజకవస్త్రము వద్ద ఉంచితిమి. వలయునేని తీసికొనుము. ఇక్కడ మరియొక ఆయుధమేమియులేదు” అని చెప్పెను. దావీదు ”దానికి మించిన కత్తిలేదు. తీసికొనిరమ్ము” అనెను.

ఫిలిస్తీయ రాజు ఆకీషు

11. అంతట దావీదు సౌలు నుండి పారిపోయి గాతు దేశాధిపతి ఆకీషు వద్దకు వచ్చెను.

12. ఆకీషు సేవకులతనిని చూచి తమ రాజుతో ”ఇతడు దావీదు. ఆ దేశపు రాజు. ఇతని నుద్దేశించియే నాడు స్త్రీలు నాట్యమాడుచు ‘సౌలు వేయిమందినిచంపగా, దావీదు పదివేలమందిని చంపెను’ అని గానము చేసిరి” అని నుడివిరి.

13. దావీదు ఆ మాటలు ఆలించెను. గాతు రాజు ఆకీషునుచూచి మిక్కిలిభయపడెను.

14. అతడు వెంటనే తన వర్తనమును మార్చుకొని కొలువువారి ఎదుట పిచ్చివానివలె నింపజొచ్చెను. నగరద్వారము మీద పిచ్చిగీతలు గీయుచు, గడ్డము మీదుగా చొల్లు కార్చెను.

15. అది చూచి ఆకీషు తన పరివారముతో ”వీడు పిచ్చివాడు. వీనిని నా యొద్దకేల కొనివచ్చితిరి?

16. ఇచట పిచ్చివారు కరువైరనియా వీనినికూడ పట్టుకొని వచ్చితిరి? వీడు నా ఎదుట ఈ వెఱ్ఱిమొఱ్ఱి చేష్టలు చేయనేల? వీనిని కూడ నా ఇంట చేర్చుకో వలయునా?” అని అనెను.

Previous                                                                                                                                                                                                Next