4 1. ఈ జ్ఞానము దేవుని ఆజ్ఞల గ్రంథము, శాశ్వతముగా నిలుచు ధర్మశాస్త్రము. 

               దానిని పాించువారు బ్రతుకుదురు,

               విడనాడువారు చత్తురు.

2.           యాకోబూ!

               మీరు జ్ఞానమువైపు మరలి, దానిని గైకొనుడు. దాని వెలుగులో కాంతివైపు నడువుడు.

3.           దేవుడు మీ కీర్తిని అన్యుల కొసగకుడు

               మీ భాగ్యమును అన్యప్రజలకు వదిలివేయకుడు.

4.           యిస్రాయేలూ!

               మనము నిజముగా ధన్యులము.

               దేవుడు తనకు ప్రీతి కలిగించునదేదియో

               మనకు తెలియజేసెను.

యెరూషలేము ఫిర్యాదులు, ఆశలు

5.           నా ప్రజలారా! మీరు ధైర్యము వహింపుడు. యిస్రాయేలు నామమును నిలబెట్టువారు మీరే.

6.           మీరు అన్యజాతులకు అమ్ముడు పోయినది నాశనమగుటకు కాదు.

               మీరు దేవునికి కోపము రప్పించితిరి

               కనుక ఆయన మిమ్ము శత్రువులకు అప్పగించెను.       

7.            మీరు దేవునికి కాక

               దయ్యములకు బలులు అర్పించి,

               మీ సృష్టికర్తకు ఆగ్రహము కలిగించితిరి.

8.           మీరు మిమ్ములను పెంచి పెద్దజేసిన

               శాశ్వతుడైన దేవుని విస్మరించితిరి.

               మిమ్ము తల్లివలె పెంచిన

               యెరూషలేమును దుఃఖప్టిెతిరి.

9.           ప్రభువు ఆగ్రహముచెంది మిమ్ము

               శిక్షించుటను చూచి తన చుట్టుపట్లనున్న నగరములతో యెరూషలేము ఇట్లనెను:

               ”ప్రభువు నా కెంతి విచారమును

               తెచ్చిపెట్టెనో చూడుడు.

10. నేను నా పుత్రీపుత్రులు

               ప్రవాసమునకు పోవుటను చూచితిని.

               నిత్యుడైన దేవుడే వారికి ఆ శిక్ష విధించెను.

11. నేను నా బిడ్డలను మహానందముతో పెంచితిని.

               వారు నానుండి వెడలిపోవుట గాంచి

               కన్నీరుకార్చి విలపించితిని.

12. నేను  వితంతువునై  విచారించుచున్నందునను,

               నా బిడ్డలందరు నన్ను వదిలి పోయినందునను,

               ఎవరును ఆనందముతో పొంగిపోకుందురుగాక!

               నా బిడ్డలు దేవుని ధర్మశాస్త్రమును విడనాడి

               పాపము చేసిరి కనుక నేను పరిత్యక్తనైతిని.

13.          వారికి దేవుని ఆజ్ఞలపట్ల గౌరవము లేదయ్యెను.

               వాని ప్రకారము జీవించుబుద్ధి పుట్టదయ్యెను.

               వారు ప్రభువు తమను న్యాయపథమున నడిపించుటకు ఇష్టపడరైరి.   

14. చుట్టుపట్లనున్న నగరములారా!

               మీరిచికి వచ్చి శాశ్వతుడైన దేవుడు

               నా బిడ్డలనెట్లు ప్రవాసమునకు పంపెనో చూడుడు

15.          ఆయన దూరము నుండి

               వారి మీదికొక జాతిని గొనివచ్చెను.

               అది పరభాష మాటలాడు జాతి,

               సిగ్గుసెరములేని జాతి.

               వృద్ధులయెడల గౌరవము,

               పిల్లలయెడల కరుణలేని జాతి.

16.          ఆ  జాతి  నా ముద్దు  కుమారులను,

               కుమార్తెలను గొనిపోయెను.

               నేను వితంతువునై ఏకాకినైతిని.

17.          ప్రవాసముననున్న బిడ్డలారా!

               నేను మీకు ఏవిధముగాను సహాయపడలేను   

18.          ఈ వినాశనములను మీ మీదికి

               కొనివచ్చిన దేవుడు మాత్రమే

               శత్రువులనుండి మిమ్ము కాపాడును.       

19. బిడ్డలారా! మీ దారి మీరు చూచుకొనుడు.

               నేను ఒంటరిదాననైతిని.

20.        నేను శాంతికాలమున

               ధరించు దుస్తులను తొలగించి, శోకించువారు ధరించు దుస్తులను తొడుగుకొింని. 

               నేను బ్రతికున్నంతకాలము

               నిత్యుడైన దేవునికి మొరపెట్టుదును.

21. బిడ్డలారా! మీరు ధైర్యము తెచ్చుకొని

               దేవునికి మనవిచేయుడు.

               పరపీడన నుండియు, అన్యుల బలము నుండియు

               ఆయన మిమ్ము విడిపించును.

22. నిత్యుడైన దేవుడు త్వరలోనే

               మీకు విముక్తి దయచేయునని నా నమ్మకము.

               పవిత్రుడును, మిమ్ము శాశ్వతముగా

               రక్షించువాడైన ప్రభువు,

               మీ మీద కరుణ చూపినపుడు

               నేను ఆనందింతును.

23.        మీరు బందీలుగా వెడలిపోయినపుడు

               నేను కన్నీరు కార్చి విలపించితిని.

               కాని ప్రభువు మిమ్ము మరల తీసికొనిరాగా

               నేను నిత్యానందమును అనుభవింతును.

24. ఈ సియోను, పొరుగువారు బందీలుగా

               వెడలి పోవుట చూచినట్లే, నిత్యుడైన దేవుడు

               మహావైభవముతో విచ్చేసి

               మిమ్ము రక్షించుటను గూడ త్వరలోనే చూచును.        

25.        బిడ్డలారా! మీరు దైవశిక్షను ఓర్పుతో సహింపుడు.

               మీ శత్రువులు మిమ్ము హింసించిరి.

               కాని వారి వినాశనమును మీరు త్వరలోనే చూతురు.

               వారు మీ దయకొరకు కాచుకొని

               ఉండుటను గాంతురు.

26.        నేను మురిపెముతో పెంచిపాడుచేసిన మీరు

               ఇపుడు కరకుత్రోవవెంట పయనించితిరి.

               శత్రువులు దాడిచేసి తోలుకొనిపోయిన

               గొఱ్ఱెలమందవలె మీరును వెడలిపోతిరి. 

27. బిడ్డలారా! మీరు ధైర్యము తెచ్చుకొని

               దేవునికి మొరపెట్టుడు.

               దేవుడు మిమ్ము దండించినను,

               మిమ్ము విస్మరింపడు.

28.        మీరు పూర్వము దేవునినుండి వైదొలగ నిశ్చయించుకొనినట్లే ఇప్పుడు పదియంతలు                అదనముగా ఆయనచెంతకు తిరిగివచ్చి

               ఆయనను సేవించుటకు ఉత్సహింపుడు.

29.        మీకీ శిక్షను గొనివచ్చిన దేవుడు

               మిమ్ము కాపాడి

               శాశ్వతానంద భరితులను చేయును.”

30.        యెరూషలేమూ!

               నీవు ధైర్యము తెచ్చుకొనుము. 

               నీకీ పేరు ప్టిెన దేవుడే నిన్ను ఓదార్చును. 

31. నిన్ను బాధప్టిె, నీ శ్రమలను చూచి

               సంతోషించిన వారు దుఃఖముపాలగుదురు.

32.        నీ బిడ్డలను బానిసలను చేసిన నగరములు

               దుఃఖము పాలగును.నీ బిడ్డలను మ్రింగివేసిన బబులోనియా నగరము దుఃఖము పాలగును.

33.        నీ పతనమును, నాశనమును గాంచి

               ఆనందించిన ఆ నగరము ఇపుడు

               ఏకాకియై విలపించును.

34.         ఆ నగరము తాను ప్రగల్భములు

               ఆడినందుకు దుఃఖించును.

               దానికి గర్వకారణమైన మహాప్రజను

               నేను నాశనము చేయుదును.   

35.        నిత్యుడనైన నేను ఆ పట్టణముపై

               అగ్ని కురిపించగా అది రోజుల తరబడి మండును.

               దానిలో చాల రోజుల వరకు 

               దయ్యములు వసించును.

36.        యెరూషలేమూ! నీవు తూర్పువైపు మరలి

               దేవుడు కొనివచ్చు ఆనందమును చూడుము.

37. నీనుండి వెడలిపోయిన బిడ్డలు

               తిరిగివచ్చుచున్నారు చూడుము!

               పవిత్రుడైన దేవుని ఆజ్ఞపై వారిని

               తూర్పు పడమరలనుండి ప్రోగుచేసిరి.

               దేవుని వైభవమును గాంచి

               ఆనందించుచు వారిపుడు తిరిగివచ్చుచున్నారు.