ఫిలిస్తీయదొరలు దావీదును వెళ్ళగ్టొించుట

29 1. ఫిలిస్తీయులు ఆఫెకు వద్ద మోహరించి యుండిరి. యిస్రాయేలీయులు యెస్రెయేలు నీిబుగ్గ దగ్గర సైన్యమును చేర్చిరి.

2. ఫిలిస్తీయదొరలు నూరు మందితో, వేయిమందితో వ్యూహపరిచి వచ్చి యుండగా, దావీదును, అతని బలగమును ఆకీషుతో కలిసి అందరికంటె వెనుకవచ్చిరి.

3. దొరలు దావీదు పరివారమును చూచి ఈ హెబ్రీయులు ఇచట ఏమి చేయుచున్నారు అని అడిగిరి. ఆకీషు ”ఇతడు యిస్రా యేలు రాజగు సౌలుసేవకుడైన దావీదు. ఏడాదికిపైగా నా కొలువున ఉన్నాడు. నా పంచ చేరినప్పినుండి నేివరకు ఇతనియందు దోషమేమియు చూపట్టదు” అని చెప్పెను.

4. కాని ఫిలిస్తీయదొరలు ఆకీషుపై ఆగ్రహించి ”వీనిని వెంటనే పంపివేయుము. ముందుగా నీవు చెప్పిన తావునకు వెడలిపోనిమ్ము. దావీదు మనతో రాతగదు. పోరాటము ఆరంభమైన పిదప ఇతడు మనపై తిరుగబడును. తన యజమానుని అను గ్రహము వడయుటకై వీడు మనవారి తలలు తెగ నరకకుండునా?

5. ఈ దావీదును గూర్చియేకదా నాడు స్త్రీలు నాట్యమాడుచు- సౌలు వేయిమందిని సంహరించెను, కాని దావీదు పదివేలమందిని సంహ రించెను – అని గానము చేసినది?” అని అనిరి.

6. ఆకీషు దావీదుతో ”సజీవుడైన యావే తోడు! నా కొలువున చేరినప్పినుండి నేివరకును నీయందు నేరమేమియు కనబడలేదు. నీవు ఉత్తముడవు కనుక దండున నాతోనుండుట మేలు. అయినను ఈ దొర లకు నీవనిన గిట్టదు.

7. నీవిక నిశ్చింతతో వెడలి పొమ్ము. వీరిని చిఱ్ఱుబుఱ్ఱులాడింపనేల?” అనెను.

8. కాని దావీదు ఆకీషుతో ”నేను ఏ దుష్కార్యము చేసితిని? నీ కొలువున చేరిన నాినుండి నేివరకు నా వలన దోషమేమైన దొరలినదా? నేను యుద్ధమున నా దొర కొమ్ముకాచుకొని శత్రువులతో పోరాడ వలదా?” అని అడిగెను.

9. ఆకీషు అతనితో ”నా కింకి నీవు దేవదూతవలె నిర్దోషివి. అయినను అధికారులు నిన్ను యుద్ధమునకు రానీయమనిరి.

10. కావున నీవు, నీ యజమానుని సేవకులు వేకువనే లేచి నేను చెప్పిన తావునకు వెడలిపొండు. నా కింకి నీవు మంచివాడవే. నీవు మరొకలాగున భావింప వలదు. వేకువనే లేచి వెలుతురు చూపట్టగనే ఇంికి వెడలిపొమ్ము” అని ఆజ్ఞ ఇచ్చెను.

11. కనుక దావీదు, అతని అనుచరులు ప్రాతఃకాలముననే లేచి తెల్లవారక మునుపే ఫిలిస్తీయదేశమునకు మరలిపోవ ప్రయాణ మైరి. ఫిలిస్తీయుల దండు యెస్రెయేలునకు పయనమై పోయెను.

Previous                                                                                                                                                                                                    Next