కపట ప్రవక్తలు

13 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. ”నరపుత్రుడా! తమ సొంత ప్రవచనములను చెప్పు యిస్రాయేలు ప్రవక్తలను నీవు ఖండింపుము. వారిని ప్రభువు పలుకులు ఆలింపమనుము.

3. యావే ప్రభువు పలుకులివి. అవివేకులైన ఈ ప్రవక్తలకు అనర్థము తప్పదు. వారు తమకు తామే ప్రేరణము పొంది, తమకు తామే దర్శనములు చూచుచున్నారు.

4. యిస్రాయేలీయులారా! మీ ప్రవక్తలు  నగర శిథిలా లలో వసించు నక్కలవింవారు.

5. వారు గోడపడి పోయిన చోట కావలికాయరు. పడిపోయిన గోడను మరలకట్టరు. ప్రభువు దినమున యుద్ధము సంభవించి నపుడు యిస్రాయేలీయులకు రక్షణ కల్పింపరు.

6. వారివి అనృతదర్శనములు, అసత్య ప్రవచనములు. వారు నా సందేశమును పలుకుచున్నాము అని చెప్పుచున్నారు. కాని నేను వారిని పంపనేలేదు. అయినను వారు తమ పలుకులు నెరవేరునని కాచు కొనియున్నారు.

7. నేను వారితో చెప్పునదేమనగా, వారి దర్శనములు అనృతములు, వారి ప్రవచనములు అసత్యములు. వారు నేను పలుకని పలుకులను నా పేరు మీదుగా ప్రభువే పలికెను అని చలామణి చేయుచున్నారు.”

8. కనుక ప్రభువైన యావే ఇట్లు చెప్పుచున్నాడు: ”మీ మాటలు అనృతములు, మీ దర్శనములు అసత్య ములు. నేను నీకు విరోధినయ్యెదను.

9. అనృత దర్శనములు చూచి అసత్య ప్రవచనములు చెప్పు ప్రవక్తలారా! నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలు నిర్ణయములు చేసికొనుటకు సభదీర్చినపుడు మీరందులో నుండజాలరు. యిస్రాయేలు పౌరుల జాబితాలో మీ పేరులుండవు. మీరు మీ దేశమునకు తిరిగిపోరు. అప్పుడు మీరు నేను యావే ప్రభుడనని గుర్తింతురు.

10. ప్రవక్తలు అంతయు క్షేమముగా నున్నదని చెప్పి నా ప్రజలను అపమార్గము ప్టించుచున్నారు. కాని అంతయు క్షేమముగా లేదు. నా ప్రజలు అతికీ అతకని రాళ్ళతో గోడక్టిరి. ప్రవక్తలు దానికి సున్నము పూసిరి.

11. నీవు ఆ ప్రవక్తలతో వారి గోడ కూలునని చెప్పుము. నేను జడివాన కురిపింతును. వడగండ్లు దానిపై పడును. పెనుగాలి దానిపై వీచును.

12. ఆ గోడకూలును. అప్పుడు సున్నము కొట్టుటవలన ప్రయోజనమేమియని ఎల్లరును మిమ్ము ప్రశ్నింతురు.

13. యావే ప్రభువు పలుకులివి: నేను మహా రౌద్రముతో పెనుగాలిని, జడివానను, వడగండ్లను కొనివచ్చి గోడను కూలద్రోయుదును.

14. వారు సున్నముపూసిన గోడను పడగ్టొి చిన్నాభిన్నము చేయు దును. దాని పునాదిరాళ్ళు బయికి కన్పించును. ఆ గోడ కుప్పకూలి మిమ్మెల్లరిని చంపును. అప్పుడెల్లరును నేను ప్రభుడనని గుర్తింతురు. 

15. ఆ గోడయు దానికి సున్నము క్టొినవారు కూడ నా ఆగ్రహమునకు గురియగుదురు. ఆ గోడయు, దానికి సున్నము పూసినవారుకూడ కనుమరుగైపోదురు.

16. ఆ సున్నము పూసిన వారెవరనగా, క్షేమము లేకున్నను, క్షేమము కలుగునని యెరూషలేమును మోసపుచ్చు ప్రవక్తలు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు”.

కపట ప్రవక్త్రీమణులు

17. ప్రభువు ఇట్లనెను ”నరపుత్రుడా! మీ జను లలో తమ సొంత ప్రవచనములను చెప్పు స్త్రీలను పరికింపుము. నీవు వారిని తెగడుచూ ప్రవచనము చెప్పుము.

18. యావే ప్రభుడనైన నా పలుకులను వారికిట్లు వినిపింపుము. స్త్రీలారా! మీకు అనర్థము తప్పదు. మీరు ఎల్లరి చేతులకును మంత్ర బంధము లను, ఎల్లరి  తలలకును మంత్రపు ముసు గులను తయారు చేయుచున్నారు. దీనివలన వారు ఇతరులపై అధికారము బడయుదురని చెప్పుచున్నారు. స్వార్థ లాభము కొరకు నా ప్రజల ప్రాణములను మీ గుప్పిట పెట్టుకొనుచున్నారు.

19. పిడికెడు యవ ధాన్యము కొరకును, రొట్టెముక్కల కొరకును నా ప్రజలయెదుట నన్ను అవమానపరచుచున్నారు. మీరు చంపకూడని వారిని చంపి, బ్రతుకకూడని వారిని బ్రతికించు చున్నారు. మీరు నా ప్రజలకు అబద్ధము చెప్పగా వారు నమ్ముచున్నారు.

20. యావే ప్రభుడనైన నా పలుకులివి. ప్రజల ప్రాణములను మీ గుప్పిట పెట్టుకొనుటకుగాను మీరు వాడు మంత్రబంధములను నేను అసహ్యించు కొందును. మీ చేతులనుండి వానిని లాగివేసి మీరు వేాడి మీ గుప్పిటనుంచుకొను నావారిని పకక్షులవలె విడిపింతును.

21. మీ ముసుగులను లాగివేసి మీ అధీనముననున్న నా వారిని విడిపింతును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.

22. నేను కీడు చేయనొల్లని సజ్జనులను మీరు అబద్ధములు చెప్పి నిరుత్సాహపరచుచున్నారు. ఇంకను మీరు దుష్టులను ప్రోత్సహించి వారు తమ దుష్కార్య ములను విడనాడి, తమ ప్రాణములను దక్కించుకో కుండునట్లు చేయుచున్నారు. 

23. మీ అనృత దర్శనము లును, అసత్య ప్రవచనములును ఇక చెల్లవు. నేను నా ప్రజలను మీ బారినుండి విడిపింతును. అపుడు నేను ప్రభుడనని మీరు గుర్తింతురు.”