10 1. యిస్రాయేలీయులు

               విస్తారముగా పండిన ద్రాక్షతీగవింవారు.

               కాని సంపదలు పెరిగిన కొలది

               వారు బలిపీఠములను అధికముగా నిర్మించిరి.

               పంట విస్తారముగా పండినకొలది

               దేవతాస్తంభములను ఎక్కువ

               సుందరముగా తయారుచేసిరి.

2.           వారు కపాత్ములు కావున

               తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు.

               దేవుడు వారి బలిపీఠములను కూలద్రోయును.

               వారి దేవతాస్తంభములను పడగొట్టును.

3.           ఈ ప్రజలు ఇట్లు పలుకుదురు:

               ”మేము దేవుని లక్ష్యము చేయలేదుగాన

               మాకు రాజులేడయ్యెను.

               కాని రాజుండి మాత్రము మాకేమి చేయగలడు?”

4.           వారి మాటలు నిరర్థకములు,

               ప్రమాణములు అబద్ధపూరితములు,

               ఒడంబడికలు నిష్ప్రయోజనములు, 

               న్యాయము అన్యాయముగా మారినది.

               అది విషపూరితమైన కలుపుమొక్కలవలె

               దున్నిన చేనిలో పెరుగుచున్నది.

5.           బేతావెను కోడెదూడ బొమ్మ నాశనమైనందులకు

               సమరియాపౌరులు భీతిని చెందుదురు.

               ఆ ప్రజలు దానికొరకు శోకింతురు.

               కనుమరుగైపోయిన ఆ బంగారు బొమ్మకొరకు

               దానిని కొలుచు యాజకులు విలపింతురు.

6.           ఆ విగ్రహమును అస్సిరియాకు కొనిపోయి

               మహాచక్రవర్తికి కానుకగా ఇత్తురు.

               తాము పాించిన సలహాలకుగాను

               ఎఫ్రాయీమీయులు తలవంపులు

               నగుబాట్లు తెచ్చుకొందురు.       

7.            సమరియా ధ్వంసమగును,

               దాని రాజు విరిగి నీిమీదపడిన

               కొమ్మతో సమానము.

8.           యిస్రాయేలీయులు

               విగ్రహములను కొలిచిన బేతావెను

               కొండలమీది గుళ్ళు నాశనమగును.

               అచి బలిపీఠములపై ముళ్ళు,

               కలుపు మొక్కలునెదుగును.

               ప్రజలు మమ్ము దాచియుంచుడని

               పర్వతములకు మనవి చేయుదురు.

               మమ్ము కప్పివేయుడని

               కొండలకు మొరపెట్టుకొందురు.

గిబియా ఖండనము

9.           ప్రభువు ఇట్లనుచున్నాడు:

               యిస్రాయేలీయులు గిబియావద్ద

               పాపము చేసినప్పినుండియు

               నాకు ద్రోహము చేయుచునేయున్నారు.

               కావున గిబియావద్దనే

               వారు పోరును చవిచూతురు.

10.         నేను వారి మీదికి దండెత్తి వారిని శిక్షింతును. జాతులు ఏకమైవచ్చి వారిపై దాడిచేసి

               వారి నానాపాపములకుగాను

               వారిని దండించును.

ప్రజలు పశ్చాత్తాపపడవలెను

11.           పూర్వము ఎఫ్రాయీమీయులు

               బాగుగా తర్ఫీదుపొంది కళ్ళమును త్రొక్కుటకు

               సిద్ధముగానున్న పెయ్యవలెనుండిరి.

               కాని నేను ఆ పెయ్య సొగసైన మెడమీద

               కాడిమోపి దానిచే పొలము దున్నింపగోరితిని.

               యూదాచే నాగలి దున్నించితిని.

               యాకోబుచే దానిని చదును చేయించితిని.

12.          నేను ఇట్లింని:

               మీరు క్రొత్తపొలమును దున్నుకొనుడు.

               న్యాయమను విత్తనములు వేసి

               దైవప్రేమ అను పంటకోసికొనుడు.

               మీరు ప్రభుడనైన నా చెంతకు తిరిగిరావలెను.

               నేను వచ్చి మీపై నీతివర్షమును కురియింతును.

13.          కాని మీరు దుష్టత్వమను విత్తనములువేసి

               పాపమను పంటకోసికొింరి.

               మీ అనృతములు పండించిన

               ఫలములను భుజించితిరి.

               మీరు మీ రథములను,

               మీ సైన్యమును నమ్ముకొింరి.

యిస్రాయేలు వినాశనము

14.          కావున మీ మీదికి యుద్ధమువచ్చును.

               మీ కోటలన్నియు ధ్వంసమగును.

               పూర్వము షల్మాను రాజు

               యుద్ధమున బేతర్బేలును నాశనముచేసి

               తల్లులను, పిల్లలను

               నేలకు విసరిక్టొినట్లుగానే జరుగును.       

15.          బేతేలు ప్రజలారా!

               మీరుచేసిన ఘోరపాపమునకుగాను

               నేను మీక్టి కార్యమునే చేయబూనితిని.

               యుద్ధము ప్రారంభము కాగానే

               యిస్రాయేలు రాజు చచ్చును.

Previous                                                                                                                                                                                                     Next