జనాభా లెక్కలు
21 1. సైతాను యిస్రాయేలీయులను తిప్పలు పెట్టనెంచి జనాభాలెక్కలు తయారు చేయింపవలెనని దావీదును ప్రేరేపించెను.
2.కనుక దావీదు యోవాబుతో, అధిపతులతో ”మీరు వెళ్ళి బేర్షెబనుండి దానువరకు గల యిస్రాయేలీయులందరిని లెక్కప్టిె మొత్తమెంత మంది ఉన్నారో నాకు తెలియజేయుడు” అనెను.
3. ఆ మాటలకు యోవాబు ”యావే మన ప్రజలను నూరంతలుగా వృద్ధిచేయుగాక! ఈ జనులెల్లరును దేవర వారి దాసులేకదా! ఇప్పుడు ఈ లెక్కల వలన యిస్రా యేలీయులు అందరు నేరము కట్టుకొందురు. ప్రభువు ఇి్ట కార్యముచేయనేల?” అనెను.
4. కాని రాజు తన ఆజ్ఞను పాింపుమని యోవాబును ఒత్తిడిచేసెను. కనుక అతడు దేశమంత తిరిగి జనాభా లెక్కలు సిద్ధము చేసికొనివచ్చెను.
5. అతడు యిస్రా యేలీయులలో యుద్ధము చేయగలవారు మొత్తము పదునొకండు లక్షలమంది అనియు, యూదా నివాసా లలో యుద్ధము చేయగలవారు మొత్తము నాలుగు లక్షలడెబ్బదివేలమంది అనియు రాజునకు విన్నవించెను.
6. యోవాబునకు రాజాజ్ఞ నచ్చలేదు కనుక అతడు లేవీయులను, బెన్యామీనీయులను లెక్కపెట్టలేదు.
అంటువ్యాధి, ప్రభువు దావీదును క్షమించుట
7. రాజు చేసినపని ప్రభువునకు ప్రీతి కలిగింప లేదు. కనుక ఆయన యిస్రాయేలును శిక్షించెను.
8. దావీదు ”ప్రభూ! ఈ జనాభా లెక్కల మూలమున నేను పెద్దతప్పిదము చేసితిని, నేను చాల అవివేకముతో ప్రవర్తించితిని. నన్ను క్షమింపుము” అని వేడుకొనెను.
9-10. యావే దావీదునకు దీర్ఘదర్శి అయిన గాదుతో ”నీవు వెళ్ళి రాజుతో నా మాటలుగా ఇట్లు చెప్పుము: నేను నీకు మూడు కార్యములు నిర్ణయించితిని. వానిలో నీవు ఎన్నుకొన్నదానిని చేసెదను” అనెను.
11. గాదు దావీదువద్దకు వచ్చి ప్రభువు పలుకులను ఇట్లు ఎరిగించెను.
12. ”మూడేండ్లపాటు కరువు లేదా మూడునెలలు నీవు శత్రువుల ఎదుట నిలువలేక నాశనమగుట లేదా మూడుదినములు ప్రభువుఖడ్గము నిన్నువెన్నాడ అంటురోగము ఈ దేశమును పీడింపగా ప్రభువుదూత యిస్రాయేలీయులను నాశనము చేయుట ఈ మూడింలో ఏది కావలయునో కోరుకొనుము. ప్రభువునకు నన్నేమి జవాబు చెప్పుమందువో తెలియ జేయుము” అనెను.
13. దావీదు ”నేను ఇరుకున పడితిని. అయినను ప్రభువు దయాసముద్రుడు కనుక నరులచేతికి చిక్కుటకంటే ఆయన చేతికిచిక్కుట మేలు” అనెను.
14. అప్పుడు ప్రభువు యిస్రాయేలీయులను అంటురోగమువాత బడునట్లు చేసెను. దానివలన డెబ్బదివేలమంది చచ్చిరి.
15.ఆయన యెరూషలేమును నాశనము చేయుటకు తనదూతను పంపెను. కాని ఆ దూత నగరమును పాడుచేయబోవుచుండగా ప్రభువు జాలినొంది అతనితో ”ఓయి! ఇక చాలు” అనెను. అప్పుడు దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమువద్ద సాక్షాత్కరించెను.
16. దావీదు ప్రభువు దూత భూమ్యాకాశములకు మధ్య నిలచి కత్తిదూసి యెరూషలేమును నాశనము చేయుటకు సంసిద్ధమగు టను గమనించెను. వెంటనే గోనె తాల్చియున్న దావీదు, ప్రజానాయకులు సాష్టాంగపడిరి.
17. దావీదు ”ప్రభూ! ప్రజలను లెక్కపెట్టుట అను చెడుపని చేయించినది నేను. గొఱ్ఱెలవిం ఈ ప్రజలు ఏ పాప మును ఎరుగరు. కనుక నీవు నన్నును, నా కుటుంబ మును శిక్షించి ఈ నీ జనులను వదలివేయుము” అని మనవి చేసెను.
బలిపీఠమును కట్టుట
18. అప్పుడు ప్రభువుదూత గాదుతో ఒర్నాను కళ్ళమునందు ప్రభువునకు ఒక బలిపీఠము నిర్మింపు మని దావీదుతో చెప్పుమనెను.
19. గాదు చెప్పినట్లే దావీదు ప్రభువు ఆజ్ఞకు బద్ధుడై కళ్ళము చెంతకు పోయెను.
20. అప్పుడు ఒర్నాను తన నలుగురు కుమారులతో గోధుమలు నూర్చుచుండెను. వారు ప్రభువుదూతను చూచి భయపడి దాగుకొనిరి.
21. ఒర్నాను దావీదు రాజు తనయొద్దకు వచ్చుట చూచి కళ్ళమునుండి వెలుపలికొచ్చి శిరము నేలమోపి దండము పెట్టెను.
22. రాజతనితో ”ఈ కళ్ళమును నాకు అమ్ముము. నేనిట ప్రభువునకు బలిపీఠము నిర్మింపవలయును. అప్పుడుగాని ఈ అంటురోగము సమసిపోదు. నేను దీనికి నిండువెలను ఇత్తును” అనెను.
23. ఒర్నాను ”ప్రభువు ఈ స్థలముతో తమ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చును. ఇవిగో ఈ ఎద్దు లను దహనబలిగా అర్పింపవచ్చును. గోధుమలను నూర్చు ఈ మ్రానును వంటచెరకుగా వాడుకోవచ్చును. ఈ గోధుమలను ధాన్యబలిగా అర్పింపవచ్చును. వీనినెల్ల నీకు ఇచ్చెదను, గైకొనుము” అని దావీదుతో అనెను.
24. దావీదు అతనితో ”నేను నీకు పూర్తి వెల యిత్తును. నేనేమియు ఖర్చుపెట్టకుండ నీ వస్తువులను తీసికొని దేవునికి బలియర్పింతునని అనుకొింవా?” అనెను.
25. కనుక దావీదు ఆ తావునకుగాను ఒర్నానునకు ఆరువందల తులముల బంగారము చెల్లించెను.
26. దావీదు అచట ఒక బలిపీఠము నిర్మించి దహనబలులు, సమాధానబలులు అర్పించెను. అతడు ప్రభువునకు ప్రార్థనచేయగా ప్రభువు ప్రత్యుత్తరముగా ఆకసమునుండి నిప్పు పంపి బలిపీఠముమీది బలులను దహించెను. 27. ప్రభువు ప్రభువుదూతతో ఇక నీ కత్తిని ఒరలో పెట్టుమని చెప్పెను.
28. దావీదు ప్రభువు తనమొర ఆలకించెనని గుర్తించి ఒర్నాను కళ్ళము నందు బలిపీఠముమీద బలులు అర్పించెను.
29. మోషే ప్రభువు కొరకు ఎడారిలో తయారుచేసిన గుడా రము, దహనబలులు అర్పించు బలిపీఠము అంత వరకు గిబ్యోను క్షేత్రముననేయుండెను.
30. దావీదు ప్రభువుదూత కత్తిని జూచి భయపడి ప్రభువును సంప్ర తించుటకు గిబ్యోనునకు వెళ్ళడయ్యెను.