యూదా తెగ

15 1. యూదా తెగవారికి వారివారి కుటుంబ ముల ప్రకారముగా చీట్లవలన వచ్చిన వారసత్వభూమి ఎదోము సరిహద్దునగలదు. ఆ భూమి సీను ఎడారి నుండి దక్షిణమున కాదేషువరకు వ్యాపించియుండెను.

2-3. వారి దక్షిణపు సరిహద్దు మృతసముద్రము నొద్ద దక్షిణపు అఖాతము నుండి ప్రారంభమై అక్రిబీము శిఖరమునకు దక్షిణముగా సీను మీదుగా సాగిపోయెను. అచినుండి కాదేషు బార్నెయాకు దక్షిణముగా వెడలిపోయి హెస్రోను మీదుగా ఆడ్డారు వరకు అచి నుండి కార్కా వరకు సాగిపోయెను.

4. ఆ మీదట ఆస్మాను చుట్టుతిరిగి ఐగుప్తునది మీదుగా సముద్రము వరకు వచ్చెను. ఇది వారి దక్షిణపు సరిహద్దు.

5. వారి తూర్పు సరిహద్దు మృతసముద్రమును యోర్దాను నది కలియుచోటు వరకు ఉండెను.

6. ఉత్తర దిక్కున ఎల్ల యోర్దాను నది మృతసముద్రమును కలియు అఖాతమునొద్ద ప్రారంభమై బేత్‌హోగ్లా మీదుగా బేత్హరబ్బాకు ఉత్తరముగా సాగిపోయి, రూబేను కుమారుడు బోహాను పేరుమీదుగా పిలువబడు శిలవరకు వ్యాపించెను.

7. ఆ సరిహద్దు ఆకోరు లోయలోని దెబీరు వరకు పోయి, ఉత్తరదిక్కు మరలి ఆదుమ్మీము శిఖరమునకు ఎదుట నదికి దక్షిణముగా నున్న గిలాలుమీదుగా తిరిగి ఎన్‌-షెమెషు సరస్సు గుండ వచ్చి ఎన్‌-రోగేలు వద్ద ఆగిపోయెను. 8. అచి నుండి బెన్‌హిన్నోము లోయ మీదుగా యెరూషలేము లేక యెబూసీయుల కొండపల్లము వరకు వచ్చి పశ్చిమమున హిన్నోము లోయను అడ్డుపరచు కొండ శిఖరము వరకు పోయెను. ఈ శిఖరము రేఫాయీము  లోయ ఉత్తరాగ్రమున ఉన్నది.

9. ఆ శిఖరము నుండి ఆ ఎల్ల నెఫ్తోవా సరస్సు వరకు వెడలిపోయి ఏఫ్రోను కొండపురములను దాి అచినుండి కిర్యత్యారీము లేక బాలా వైపునకు తిరిగెను.

10-11. అచినుండి ఆ సరిహద్దు సేయీరు కొండకు పడమటగా పోయి ఖేసలోను లేక యెయారీము కొండకు ఉత్తరముగా తిరిగి బేత్‌షెమేషు తిమ్నాల మీదుగా దిగివెళ్ళి ఎక్రోను ఉత్తరమును జేరి షిక్కారోను వైపు మరలి బాలా కొండను దాి యాబ్నీలు మీదుగా సముద్రము వరకు పోయెను.

12. వారి పడమి ఎల్లయేమో మహా సముద్రమే. యూదా తెగలవారి కుటుంబములకు వచ్చిన నేలయిదియే.

కాలెబీయులు హెబ్రోనును ఆక్రమించుకొనుట

13. యావే యెహోషువాను ఆజ్ఞాపించినట్లే యెఫున్నె కుమారుడగు కాలెబునకుగూడ యూదా తెగవారు ఆక్రమించుకొనిన నేలలో భాగమిచ్చిరి. అనాకీయుల ప్రధాననగరమగు కిర్యతార్బాను యెహోషువ కాలెబునకు ఇచ్చెను. ఇదియే నేి హెబ్రోను.

14. అచినుండి కాలెబు, అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షేషయి, అహీమాను, తల్మాయి అను వారిని తరిమివేసెను.

15. అక్కడినుండి కాలెబు, దెబీరు నివాసులపై దండెత్తిపోయెను. ఈ పట్టణము నకు పూర్వనామము కిర్యత్సేఫేరు.

16. కాలెబు ”కిర్యత్సేఫేరును ముట్టడించి దానిని పట్టుకొనిన వీరునకు నా కూతురు అక్సా నిచ్చి పెండ్లిచేసెదను” అనెను.

17. కాలెబు సోదరుడును కేనాసు కుమారుడగు ఒత్నీయేలు నగరమును ముట్టడించి పట్టుకొనెను. కాలెబు అతనికి అక్సా నిచ్చి వివాహము చేసెను.

18. ఆమె కాపురమునకు వచ్చినపుడు ఒత్నీయేలు ”మీ తండ్రిని పొలము అడుగుము” అని ప్రేరేపించెను. ఆమె గాడిదమీద నుండి త్వరగా దిగి నిలుచుండెను. కాలెబు ”తల్లీ! నీకేమి కావలయును?” అని అడిగెను.

19. అక్సా తండ్రితో ”నాయనా! నాకు ఒక్కకోరిక తీర్చుము. నన్ను నేగేబు ఎడారి సీమకు వెడలగ్టొితివి గదా! ఇక నీిబుగ్గలు గల నేలనైనను ఇప్పింపుము” అనెను. కాలెబు కుమార్తెకు ఎగువ నీిబుగ్గలను, దిగువ నీిబుగ్గలను ఇచ్చివేసెను.

20. యూదా తెగల వారికి వారివారి కుటుంబముల ప్రకారము సంక్ర మించిన వారసత్వభూమి యిదియే.

యూదా తెగవారు ఆక్రమించుకొనిన తావుల పేర్లు

21-32. ఎడారిలోని ఎదోము వైపునగల యూదా వంశీయుల దూర నగరములివి: కబ్సేలు, ఎదేరు, యాగురు, కీనా, దిమోను, ఆదదా, కేదేషు, హాసోరు, ఈత్నాను, సీపు, తేలెము, బెయాలోతు, హాసోరు-హడ్టా, కెర్యోతు-హెస్రోను లేక హాసోరు, ఆమాము, షేమా, మోలదా, హాసార్‌-గడ్డా, హెష్మోను, బేత్‌పాలేతు, హాసార్‌-షువాల్‌, బేర్షెబా మరియు బిసియోతియా, బాలా ఇయీము, ఏసేము, ఎల్తోలదు, కేసీలు, హోర్మా, సీక్లగు, మద్మానా, సన్సానా, లెబావోతు, షిల్హీము, ఆయిన్‌, రిమ్మోను. ఈ పట్టణములన్నియు పల్లెలతో కలసి ఇరువదితొమ్మిది.

33-36. పల్లపు నేలలలోని పట్టణములివి: ఏష్టవోలు, సోరా, ఆష్నా, సానోవా, ఎన్‌-గన్నీము, తప్పూవా, ఏనాము, యార్మూతు, అదుల్లాము, సోకో, అసేకా, షారాయీము, అదితాయీము, గెదెరా, గదెరోయీతాము. ఇవి అన్నియు వాి పల్లెలతో కలసి పదునాలుగు పట్టణములు.

37-41. సేనాను, హదాషా, మిగ్దాల్‌గాదు, దిలాను, మిస్ఫే, యోక్తీలు, లాకీషు, బోస్కాతు, ఎగ్లోను, కాబ్బోను, లాహ్మాసు, కిత్లీషు, గదెరోతు, బేత్‌దగోను, నామా, మక్కేడా. ఇవన్నియు వాి పల్లెలతో కలిసి పదునారు పట్టణములు.

42-44. లిబ్నా, ఏతేరు, ఆషాను, ఇఫ్తా, ఆష్నా, నేసీబు, కెయిలా, ఆక్సీబు, మరేషా. ఇవన్నియు వానివాని పల్లెలతోజేరి తొమ్మిది పట్టణములు.

45-47. చుట్టుపట్లగల పల్లెలతో పట్టణములతో జేరి ఎక్రోను, ఎక్రోను నుండి సముద్రము వరకును, అష్డోదు వరకును గల పల్లెలు. చుట్టుపట్లగల పల్లెలతో పట్టణ ములతో చేరి అష్డోదు, చుట్టుపట్లగల పల్లెలతో పట్టణ ములతో ఐగుప్తునదివరకును గల గాజా. మహా సముద్రమే వీనికన్నికి సరిహద్దు.

48-57. పీఠభూములలోని పట్టణములివి: షామీరు, యాత్తీరు, సోకో, దానా, కిర్యత్‌సాన్నా లేక దెబీరు, ఆనబు, ఎస్తమో, ఆనీము, గోషెను, హోలోను, గీలో. ఇవియన్నియు వానివాని పల్లెలతోజేరి పదు నొకండు పట్టణములు. ఆరబు, రూమా లేక దూమా, ఏషాను, యానీము, బేత్‌-తపూవా, అఫేకా, హుమ్తా, కిర్యత్బాలు లేక నేి హెబ్రోను, సియోరు. ఇవి యన్నియు వానివాని పల్లెలతోగూడి తొమ్మిది పట్టణ ములు. మావోను, కర్మెలు, సీపు, యుత్తా, ఎస్రెయేలు, యోక్దెయాము, సనోవా, కయీను, గిబియా మరియు తిమ్నా-వానివాని పల్లెలతో కలసి పది పట్టణములు.

58-59. హల్హూలు, బేత్‌సూరు, గెదోరు, మారతు, బేత్‌అనోతు, ఎల్తెకోను వానివాని పల్లెలతో జేరి ఆరు పట్టణములు. తేకోవా,  ఏప్రతా లేక నేి బేత్లెహేము, పెయోరు, ఏతాము, కులోను, తాతాము, సోరెసు, కారెము, గల్లీము, బేతేరు, మనాకా  వాని వాని పల్లెలతో చేరి పదునొకండు పట్టణములు5.

60. కిర్యత్బాలు లేక నేి కిర్యాత్యారీము, రబ్బా వాని వాని పల్లెలతోజేరి రెండు పట్టణములు.

61-62. ఎడారి సీమయందు బేత్‌అరబా, మిద్దీను, సెకాకా, నిబ్షాను, యీర్‌మెల్లాహు, ఎన్‌గెదీ  వానివాని పల్లెలతోగూడి ఆరు పట్టణములు.

63. కాని యూదా తెగవారు యెరూషలేమున వసించు యెబూసీయులను వెడలగొట్టలేకపోయిరి. యెబూసీయులు నాినుండి నేివరకు యూదీయులతో పాటు యెరూషలేముననే వసించుచున్నారు.

Previous                                                                                                                                                                                                   Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము