దేవుని మీద కోరిక

దావీదు యూదా ఎడారిలోనుండగా రచించిన కీర్తన

63 1.      దేవా! నీవు నాకు దేవుడవు.

                              నేను నీ కొరకు ఉబలాటపడుచున్నాను.

                              నీ కొరకు ఆశగొనియున్నాను.

                              నీళ్ళు లేక ఎండి మాడియున్న నేలవలె

                              నా ప్రాణము నీ కొరకు దప్పికగొనుచున్నది.

2.           నీ దేవాలయమున నిన్ను దర్శింపవలెననియు,

               నీ శక్తిని, తేజస్సును కన్నులార

               చూడవలెననియు నాకోరిక.

3.           నీ అపారప్రేమ ప్రాణముకంటెను శ్రేష్ఠమైనది.

               కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను.

4.           నేను జీవించియున్నంత కాలము

               నిన్ను స్తుతించెదను.

               నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసెదను.

5.           నీ సాన్నిధ్యమున మధురమైన

               విందును ఆరగించి,

               నా ప్రాణము ఆనందమున సంతృప్తి చెందును.

               నేను సంతసముతో కీర్తనలు పాడుచు,

               నిన్ను వినుతింతును.

6.           నా పడక మీద నిన్ను స్మరించుకొందును.

               రేయి నాలుగు జాములు నిన్ను ధ్యానింతును.

7.            నీవు నాకు సహాయుడవుగా ఉంివి కనుక నేను

               నీ రెక్కలనీడలో సంతసముతో పాటలుపాడెదను.

8.           నేను నీకు అంి పెట్టుకొని నడతును.

               నీ కుడిచేయి నన్ను ఆదుకొనును.

9.           నా ప్రాణములు తీయగోరువారు

               పాతాళమునకు పోవుదురుగాక!

10.         వారు కత్తివాత పడుదురుగాక!

               నక్కలు వారి శవములను పీక్కొని తినునుగాక!

11.           రాజు దేవునియందు ఆనందించును.

               దేవుని పేరుమీదుగా ప్రమాణము చేయు

               వారందరు సంతసింతురు.

               దేవుడు కల్లలాడు వారి నోళ్ళు మూయించును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము